Gunde Ninda Gudi Gantalu: తల్లి సెంటిమెంట్‌తో బుక్కయిన రోహిణి - రవికి ఇంట్లోకి నో ఎంట్రీ - మీనా ఇన్వేస్టిగేషన్
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడి గంటలు నవంబర్ 22 ఎపిసోడ్‌లో చెప్పపెట్టకుండా ఇంటికొచ్చిన తల్లి నిచూసి రోహిణి షాకవుతుంది. రోహిణి ఆరోగ్యం గురించి సుగుణ పడుతోన్న కంగారు చూసి ప్రభావతి, మీనా డౌట్‌పడతారు. నాన్నమ్మ పిలవడంతో ఆనందంగా ఇంటికొచ్చిన రవిని బాలు బయటకు గెంటేస్తాడు.
Gunde Ninda Gudi Gantalu: పండుగ రోజున రోహిణి చేత గారెలు చేయించాలని ఫిక్సవుతుంది సుశీల. ఇంటి పనులు మొత్తం మీనా ఒక్కతే చేయడానికి వీలులేదని ఆర్డర్ వేస్తుంది. గారెలు చేయడం తనకు రాదని చెప్పి రోహిణి తప్పించుకోవాలని చూస్తుంది. తాను నేర్పిస్తానని రోహిణి చేత గారెలు దగ్గరుండి చేయిస్తుంది సుశీల. బ్యూటీ పార్లర్ భాషలోనే గారెలు తయారు చేయడం నేర్పిస్తుంది.
రోహిణి యాక్టింగ్...
కంట్లో నూనె పడిందని రోహిణి గోల చేస్తుంది. అయినా గారెలు పూర్తయ్యే వరకు రోహిణిని సుశీల వదిలిపెట్టదు. గారెల మధ్యలో చిల్లు పెట్టడం మర్చిపోవడంతో...చిల్లు మలేషియా నుంచి మీ నాన్న వచ్చి పెడతాడా రోహిణిపై చిందులు తొక్కుతుంది సుశీల.
రోహిణికి వంట చేయడం రాదని, వదిలేయమని సుశీలను ప్రభావతి బతిమిలాడుతుంది. దీపావళి పిండి వంటలు మొత్తం తన చేతే సుశీల చేయిస్తుందని భయపడిన రోహిణి తలనొప్పిగా ఉందని, కళ్లు తిరుగుతున్నాయని యాక్టింగ్ చేయడం మొదలుపెడుతుంది.
ప్రభావతి సేవలు...
రోహిణి కంటే ఎక్కువగా ప్రభావతి కంగారుపడిపోతుంది. గారెలు చేయడం ఆపేయమని కోడలితో అంటుంది. రోహిణికి సేవలు చేస్తుంది. తలకు కట్టుకడుతుంది. ఏంటో ఈ కాలం పిల్లలకు పని అంటే చాలు ఎక్కడ లేని నొప్పులు వచ్చేస్తాయని రోహిణిపై సుశీల సెటైర్లు వేస్తుంది. గారెలు బాగా లేవని మీనాపై డామినేషన్ చేయబోతుంది ప్రభావతి. ఆమె నోటికి సుశీల అడ్డుకట్టవేస్తుంది.
సుగుణ అరుపులు...
రోహిణికి యాక్సిడెంట్ అయ్యిందని దినేష్ ఫోన్ చేయడంతో కంగారుపడిన సుగుణ డైరెక్ట్‌గా కూతురు ఇంటికి వచ్చేస్తుంది. రోహిణి తలకు కట్టుకొని చైర్‌లో పడుకొని ఉండటం చూసి కంగారు పడి రోహిణి...ఏమైందమ్మా నీకు అని గట్టిగా అరుచుకుంటూ లోపలికివస్తుంది.
తల్లిని చూసి రోహిణి షాకవుతుంది. సుగుణ అరుపులకు ఇంట్లో వాళ్లందరూ గుమిగూడుతారు. ఏమైందని అడుగుతారు. రోహిణిని చూసి ఎందుకలా అరిచారు? ఆ కళ్లల్లో నీళ్లు ఏంటి అని సుగుణపై ప్రశ్నలు వర్షం కురిపిస్తారు.
ప్రభావతి అనుమానం...
రోహిణి తలకు గుడ్డ చూసి భయపడిపోయానని సుగుణ అంటుంది. గాయమైందని పొరపడ్డానని చెబుతుంది. అసలు మీరెందుకు రోహిణిని చూసి అంతలా కంగారు పడ్డారని ప్రభావతి అనుమానంగా సుగుణను అడుగుతుంది. సుగుణను మీనానే ఇంటికి రమ్మని చెప్పి ఉంటుందని ప్రభావతి అనుకుంటుంది.
ఇదే విషయమై నిలదీస్తుంది. అనుకోకుండా ఊరొచ్చాము.. ఓ సారి అందరిని చూసి వెళ్లిపోదామని తామే వచ్చామని సుగుణ అబద్ధం ఆడుతుంది. సుగుణ వెళ్లడానికి సిద్ధమవుతుంది. ఆమెను మీనా, బాలు ఆపుతారు. సాయంత్రం వరకు ఉండాల్సిందేనని పట్టుపడతారు.
రవి కాలర్ పట్టుకున్న బాలు...
గేట్ తీసి భయభయంగా ఇంట్లో అడుగుపెట్టబోతాడు రవి. తమ్ముడిని చూడగానే బాలు కోపం పట్టలేకపోతాడు. ఇంటికి ఎందుకొచ్చావని కాలర్ పట్టుకొని బయటకు తోసేస్తాడు. ఇంటి పరువు తీసి...ఇంట్లో వాళ్లను రోడ్డుకు ఈడ్చి మళ్లీ ఏ ముఖం పెట్టుకొని వచ్చావని రవిపై బాలు ఫైర్ అవుతాడు. అన్నయ్య అంటూ బాలుకు సర్ధిచెప్పబోతాడు రవి. ఎవడ్రా నీకు అన్నయ్య...మా మాట కాదని వెళ్లిపోయిన రోజు నుంచే ఈ ఇంటితో..ఇంట్లోవాళ్లతో నీకు అన్ని బంధాలు తెగిపోయాయని బాలు కోపంగా రవికి బదులిస్తాడు.
నానమ్మకు అబద్ధం చెప్పాం...
నానమ్మ నన్ను రమ్మని పిలిచిందని రవి అంటాడు. నువ్వో ఇంటివాడివి అయ్యావని తెలియక రమ్మని ఉంటుంది. మా అందరికి నువ్వు చేసిన ద్రోహం గురించి తెలియక రమ్మని ఉంటుందని బాలు అంటాడు. నువ్వు కనపడకపోయేసరికి...నిజం చెబితే తట్టుకోలేవని రెస్టారెంట్ పని మీద ఊరెళ్లావని నానమ్మతో అబద్ధం చెప్పామని అసలు విషయం రవికి చెబుతాడు బాలు.
నానమ్మ ఛీ కొడుతుంది...
నీవల్లే నాన్న హాస్సిటల్ పాలయ్యాడని తెలిస్తే నానమ్మ నిన్ను ఛీ కొడుతుందని బాలు అంటాడు. ఇప్పుడిప్పుడే బాధ నుంచి బయటపడుతున్నామని, మళ్లీ కనిపించి అందరిని బాధపెట్టదొద్దని ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండొద్దని, వెంటనే వెళ్లిపొమ్మని రవికి వార్నింగ్ ఇస్తాడు బాలు. పండుగ రోజు అయినా ప్రశాంతంగా ఉండనివ్వమని రవిని తోసేస్తాడు. బాలు మాటలతో హర్ట్ అయిన రవి వెళ్లిపోతాడు.
అప్పుడే సత్యం బయటకు వస్తాడు. రవి ముఖం కనిపించదు. ఎవరితో మాట్లాడుతున్నావని బాలును అడుగుతాడు. పండుగ కదా చందా కోసం వచ్చాడని, గట్టిగా ఇచ్చానని తండ్రితో అబద్ధం చెబుతాడు బాలు.
రోహిణి ఫైర్...
రోహిణి తల్లితో పాటు కొడుకును తన రూమ్‌కు తీసుకొస్తుంది మీనా. రోహిణి కొడుకు ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటాడు. తల్లితో పాటు కొడుకు ఇంట్లో ఉంటే తన నాటకం మొత్తం బయటపడుతుందని రోహిణి తెగ కంగారుపడుతుంది. నన్ను పట్టించడానికే ఇంటికొచ్చావా...ఏదో చుట్టాల ఇంటికి వచ్చినట్లుగా డైరెక్ట్‌గా వచ్చావని తల్లిపై రోహిణి ఫైర్ అవుతుంది. మీనా, బాలును కలవొద్దు...ఈ ఇంటివైపు చూడొద్దని నీకు అల్రెడీ చెప్పానుగా అంటూ క్లాస్ ఇస్తుంది. పొరపాటుగా రోహిణిని కళ్యాణి అని పిలుస్తుంది. తనను అలా పిలవొద్దని రోహిణి ఫైర్ అవుతుంది.
దినేష్ ఫోన్...
నీకు యాక్సిడెంట్ అయ్యిందని ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడని, అది నిజం అవువో కాదో తెలుసుకోవడానికి నీకు ఫోన్ చేస్తే స్విఛాఫ్ అని రావడంతో కంగారుపడి వచ్చానని అంటుంది సుగుణ. ఫోన్ కలవకపోతే వచ్చేస్తావా అంటూ తల్లిని తప్పుపడుతుంది రోహిణి. ఇప్పటికే వంద టెన్షన్‌తో నేను సతమతమవుతున్నాను...నువ్వు వచ్చి కొత్త టెన్షన్స్ పెట్టకు.
ఈ సారి ఇలాంటి వార్త ఏదన్నా విన్నా ఇంటికి మాత్రం రాకు అని సుగుణపై కోప్పడుతుంది. కూతురు చావు బతుకుల్లో ఉందని తెలిసి కూడా రాలేని బతుకు నాకు ఎందుకు అని సుగుణ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎన్నాళ్లు ఇలా అబద్దాలు, నాటకాలు ఆడుకుంటూ బతుకుతావని కూతురితో అంటుంది సుగుణ.
టాపిక్ డైవర్ట్...
మీనా డోర్ దగ్గర కనిపించడంతో రోహిణి, సుగుణ షాకవుతారు. రోహిణి టాపిక్ డైవర్ట్ చేస్తుంది. నాకు ఏదో అయ్యిందని సుగుణ కంగారు పడ్డారని, నాకు ఏం కాలేదని చెబుతున్నానని రోహిణి తడబడుతూ మీనాతో అంటుంది. చింటుకు మీనా తెచ్చిన గారెలను రోహిణి ఇస్తుంది. అక్కడే ఉంటే తాను దొరికిపోతానని వెళ్లిపోతుంది.
మీనా ప్రశ్నలు...
రోహిణి మీకు ముందే తెలుసు కదా అని సుగుణను అడుగుతుంది మీనా. ఆమె ప్రశ్నకు సుగుణ షాకవుతుంది. దీపావళి రోజు అందరూ కలిసి టపాసులు కాల్చుతుంటారు. తమ ఫ్యామిలీ మెంబర్స్ దీపావళి సెలబ్రేషన్స్‌ను చాటు నుంచి చూస్తుంటాడు రవి. మరోవైపు చింటు తమతో దీపావళి జరుపుకోవడం చూసి మనోజ్ చిరాకుపడతాడు.
వాడు ఎవడికి పుట్టాడో..దర్జాగా ఇంటి మనవడిలా టపాసులు కాల్చుతున్నాడని అంటాడు. అనుకోకుండా టపాసుల నిప్పు రవ్వ చింటు కళ్లలో పడటంతో రోహిణి కంగారు పడి పరిగెత్తుకుంటూ వెళ్లి చింటును దగ్గరకు తీసుకుంటుంది. ఆ సీన్ చూసి ఇంట్లో వాళ్లందరికి రోహిణిపై డౌట్ వస్తుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.
టాపిక్