OTT Web Series: సత్యరాజ్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. తెలుగులోనూ..-sathyaraj tamil family drama ott web series my perfect husband to release on disney plus hotstar ott streaming date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Web Series: సత్యరాజ్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. తెలుగులోనూ..

OTT Web Series: సత్యరాజ్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. తెలుగులోనూ..

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 11, 2024 04:07 PM IST

My Perfect Husband OTT Web Series: మై పర్‌ఫెక్ట్ హస్బెండ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ ఫ్యామిలీ డ్రామా సిరీస్‍లో సత్యరాజ్, రేఖ ప్రధాన పాత్రలు పోషించారు. ట్రైలర్ ద్వారా స్టోరీలైన్ కూడా తెలిసిపోయింది. ఎప్పుడు స్ట్రీమింగ్‍కు వస్తుందంటే..

OTT Web Series: సత్యరాజ్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. తెలుగులోనూ..
OTT Web Series: సత్యరాజ్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. తెలుగులోనూ..

తమిళ సీనియర్ స్టార్ యాక్టర్ సత్యరాజ్ విభిన్నమైన పాత్రలతో మెప్పిస్తున్నారు. వివిధ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తున్నారు. సత్యరాజ్ ప్రధాన పాత్రలో ఓ వెబ్ సిరీస్ వస్తోంది. మై పర్‌ఫెక్ట్ హస్బెండ్ పేరుతో ఈ సిరీస్ రూపొందింది. ఫ్యామిలీ డ్రామాగా ఈ వెబ్ సిరీస్‍కు తమిర దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ట్రైలర్‌ను రిలీజ్ చేసిన డిస్నీ+ హాట్‍స్టార్ తేదీని కూడా ఖరారు చేసింది.

స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఏడు భాషల్లో..

మై పర్‌ఫెక్ట్ హస్బెండ్ వెబ్ సిరీస్ ఆగస్టు 16వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. తమిళంలో రూపొందిన ఈ సిరీస్ తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వస్తుంది. ఈ విషయాన్ని హాట్‍స్టార్ అధికారికంగా వెల్లడించింది.

మై పర్‌ఫెక్ట్ హస్బెండ్ వెబ్ సిరీస్‍లో సత్యరాజ్ భార్య పాత్ర చేశారు రేఖ. టాలీవుడ్ హీరోయిన్ వర్షబొల్లమ్మ కూడా నటించారు. రక్షణ్, లివింగ్‍స్టోన్, సీత, రాఘవి అజీత్ కలీఖ్, కృతిక మనోహర్ కూడా ఈ సిరీస్‍లో కీరోల్స్ చేశారు. ఈ సిరీస్‍ను తమిర తెరకెక్కించారు.

మై పర్‌ఫెక్ట్ హస్బెండ్ స్టోరీలైన్

ఈ సిరీస్‍లో భర్త పాత్ర పోషించిన సత్యరాజ్ ఓ ఉమెన్స్ కాలేజీలో ప్రొఫెసర్‌గా చేస్తుంటారు. అయితే, తన భర్త పరాయి మహిళ వైపు కన్నెత్తి కూడా చూడరని, అదే తనకు గర్వకారణమని మురిసిపోతుంటారు భార్య (రేఖ). ఈ విషయం అందరికీ చెప్పుకొని సంతోషపడుతుంటారు. అయితే, సత్యరాజ్‍ చిన్నప్పుడు వేరే అమ్మాయిని ప్రేమించి ఉంటారు. ఆ విషయాన్ని తన భార్య వద్ద దాచిపెడుతుంటారు. అప్పట్లో ప్రేమించిన మహిళ మళ్లీ సత్యరాజ్ జీవితంలోకి వచ్చిందా? ఈ ప్రేమ వ్యవహారం తెలిసిన సత్యరాజ్ భార్య ఏం చేశారు? గతంలో ఏం జరిగింది? అనే విషయాలు మై పర్‌ఫెక్ట్ హస్బెండ్ సిరీస్‍లో ఉంటాయి.

మై పర్‌ఫెక్ట్ హస్బెండ్ ట్రైలర్ ఆకట్టుకుంది. భార్య వద్ద తన గత ప్రేమను దాచే భర్త.. ఆ విషయం బయటపడ్డాక జరిగే ఘటనలు ఇలా సాగింది. లవ్ స్టోరీ ప్లాష్‍బ్యాక్ కూడా సిరీస్‍లో ఉంటుందని ట్రైలర్లో మేకర్స్ హింట్ ఇచ్చారు. ఎమోషన్స్ కూడా ఈ సిరీస్‍లో ఉండనున్నాయి. ట్రైలర్‌తోనే స్ట్రీమింగ్ డేట్‍ను హాట్‍స్టార్ వెల్లడించింది.

మై పర్‌ఫెక్ట్ హస్బెండ్ వెబ్ సిరీస్‍ను మహమ్మద్ రషిత్ నిర్మించగా.. విద్యాసాగర్ సంగీతం అందించారు. ఈ ఫ్యామిలీ డ్రామా సిరీస్‍ను ఆగస్టు 16 నుంచి హాట్‍స్టార్ ఓటీటీలో చూడొచ్చు.

సక్సెస్ అయిన ‘చట్నీ సాంబర్’

డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో గత నెల వచ్చిన చట్నీ సాంబర్ వెబ్ సిరీస్ మంచి వ్యూస్ దక్కించుకుంది. జూలై 26వ తేదీన ఈ సిరీస్ హాట్‍స్టార్ ఓటీటీలో అడుగుపెట్టింది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళ టాప్ కమెడియన్ యోగిబాబు నటించిన ఈ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ చట్నీ సాంబర్ హాట్‍స్టార్ ఓటీటీలో మంచి సక్సెస్ అయింది. కొన్ని రోజులు నేషనల్ వైడ్‍లోనూ టాప్‍లో ట్రెండ్ అయింది. ఈ సిరీస్‍కు రాధామోహన్ దర్శకత్వం వహించారు.