Gold and Silver prices today : నవంబర్​ 23 : మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..-gold and silver prices today 23rd november 2024 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : నవంబర్​ 23 : మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and Silver prices today : నవంబర్​ 23 : మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Sharath Chitturi HT Telugu
Nov 23, 2024 05:25 AM IST

Gold and Silver prices today : దేశంలో పసిడి ధరలు మరింత పెరిగాయి. వెండి ధరలు మాత్రం దిగొచ్చాయి. మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

దేశంలో బంగారం ధరలు శనివారం మరింత పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 72,260కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 72,250గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 7,22,600కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 7,226గా కొనసాగుతోంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 వృద్ధి చెంది.. రూ. 78,830కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 78,820గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 7,88,300గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 72,410గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,980గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 72,260 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 78,830గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 72,260గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 78,830గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 72,260గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 78,830గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 72,26గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 78,830గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 72,310గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 78,880గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 72,260గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 78,830గా ఉంది.

ఫెడ్​ వడ్డీ రేట్ల కోత, అంతర్జాతీయ అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి రేట్లు..

దేశంలో వెండి ధరలు శనివారం స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,190గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 91,900కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 92,000గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,00,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 91,900.. బెంగళూరులో రూ. 91,900గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 60 పడి.. రూ 26,050కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 26,110గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,050గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

Whats_app_banner

సంబంధిత కథనం