OTT: ఓటీటీలోకి నిన్న రిలీజైన మెకానిక్ రాకీ, జీబ్రా సినిమాలు.. ఒక్క ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే స్ట్రీమింగ్.. ఎక్కడంటే?-vishwak sen mechanic rocky ott streaming satyadev zebra ott release on amazon prime mechanic rocky zebra review telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: ఓటీటీలోకి నిన్న రిలీజైన మెకానిక్ రాకీ, జీబ్రా సినిమాలు.. ఒక్క ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

OTT: ఓటీటీలోకి నిన్న రిలీజైన మెకానిక్ రాకీ, జీబ్రా సినిమాలు.. ఒక్క ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Nov 23, 2024 05:30 AM IST

OTT Release Movies Telugu: ఓటీటీలో మెకానిక్ రాకీ, జీబ్రా డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. నిన్న (నవంబర్ 22) థియేట్రికల్ రిలీజ్ అయిన విశ్వక్ సేన్ థ్రిల్లర్ మూవీ మెకానిక్ రాకీ, సత్యదేవ్ బ్యాంక్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం జీబ్రా రెండు సినిమాల ఒక్క డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి.

ఓటీటీలోకి నిన్న రిలీజైన మెకానిక్ రాకీ, జీబ్రా సినిమాలు.. ఒక్క ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
ఓటీటీలోకి నిన్న రిలీజైన మెకానిక్ రాకీ, జీబ్రా సినిమాలు.. ఒక్క ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

OTT Movies Telugu: ఓటీటీలోకి థియేట్రికల్ రిలీజ్ అయిన సినిమాలు వెంటనే రిలీజ్ అవుతున్నాయి. కొన్ని సినిమాలు చాలా గ్యాప్ తీసుకుంటే మరికొన్ని మాత్రం అతి తక్కువ సమయంలో అంటే నెల రోజులు, 20 రోజుల్లోపే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అంతేకాకుండా ఇంతకుముందు సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు కొన్ని రోజుల ముందు తెలిసేది.

ఓటీటీ ప్లాట్‌ఫామ్

కానీ, ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్‌కు ముందుగా లేదా విడుదల తేది నాడే తెలిసిపోతున్నాయి. అలా నిన్న శుక్రవారం (నవంబర్ 22) థియేట్రికల్ రిలీజ్ అయిన మెకానిక్ రాకీ, జీబ్రా రెండు సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్, స్ట్రీమింగ్ డేట్ వివరాలు లీక్ అయ్యాయి.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీనే మెకానిక్ రాకీ. ఇందులో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ ఇద్దరు ముద్దుగుమ్మలు హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమాతో రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించిన మెకానిక్ రాకీ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వస్తోంది.

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో

మెకానిక్ రాకీ ఫస్టాఫ్ అంతా చాలా బోరింగ్, స్లో నెరేషన్‌తో సాగిందని నెగెటివ్ రివ్యూస్ వినిపించాయి. కానీ, సెకండాఫ్ మాత్రం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో అదిరిపోయిందని మెచ్చుకుంటున్నారు. మెకానిక్ రాకీ సెకండాఫ్ గ్రిప్పింగ్ నెరేషన్‌తో చాలా ఫాస్ట్‌గా సాగుతూ మంచి థ్రిల్ ఇచ్చిందని చెబుతున్నారు. అయితే, ఫస్టాఫ్ కొంచెం భరించాల్సిందే అని పబ్లిక్ టాక్.

ఇలా మిశ్రమ స్పందన తెచ్చుకుంటున్న విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ ఓటీటీ హక్కులను మంచి ధరకు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని సమాచారం. అమెజాన్ ప్రైమ్‌లో మెకానిక్ రాకీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అది కూడా డిసెంబర్ మిడ్ వీక్ లేదా చివరి వారంలో మెకానిక్ రాకీ ఓటీటీ రిలీజ్ కానుందని తెలుస్తోంది. అయితే, ఆడియెన్స్ రెస్పాన్స్, బాక్సాఫీస్ కలెక్షన్స్‌ను బట్టి మెకానిక్ రాకీ డిజిటల్ స్ట్రీమింగ్‌లో మార్పులు జరిగే అవకాశం ఉంది.

బ్యాంకింగ్ క్రైమ్ థ్రిల్లర్

మెకానిక్ రాకీతోపాటు నవంబర్ 22న థియేటర్లలో విడుదలైన మరో తెలుగు సినిమా జీబ్రా. యంగ్ హీరో సత్యదేవ్, కన్నడ యాక్టర్, పుష్ప ఫేమ్ డాలీ ధనుంజయ ప్రధాన పాత్రలు పోషించిన బ్యాంకింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీనే జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ డైరెక్ట్ చేసిన జీబ్రా సినిమాను ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించారు.

జీబ్రా సినిమాలో ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో హీరోయిన్స్‌గా యాక్ట్ చేశారు. ఓ బ్యాంక్ ఉద్యోగి బ్యాంక్‌లోని లొసుగులు తెలుసుకుని తన తప్పులను కవర్ చేసుకుంటాడు. ఓ రోజు తన గర్ల్‌ఫ్రెండ్ చేసిన మిస్టేక్‌ను సరిచేసే క్రమంలో పెద్ద గ్యాంగ్‌స్టర్‌ చేతికి చిక్కుతాడు. దాంతో విలన్‌కు హీరో రూ. 5 కోట్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనే

ఆ తర్వాత సినిమాలో వచ్చే ట్విస్ట్‌లు, థ్రిల్లింగ్ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయని జీబ్రా మూవీపై పాజిటివ్ టాక్ వస్తోంది. సత్యదేవ్‌కు కమ్ బ్యాక్ హిట్ పడిందని ఆడియెన్స్ అంటున్నారు. ప్రస్తుతం మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్న జీబ్రా ఓటీటీ రైట్స్‌ను కూడా అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని సమాచారం.

డిసెంబర్ చివరి వారం, లేదా మిడ్ వీక్‌లో అమెజాన్ ప్రైమ్‌లో జీబ్రా ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. జీబ్రా ఓటీటీ రిలీజ్‌లో కూడా ఆడియెన్స్ రెస్పాన్స్, కలెక్షన్స్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. అయితే, మొత్తానికి నిన్న థియేటర్లలో విడుదలైన విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ, సత్యదేవ్ జీబ్రా రెండు తెలుగు సినిమాలు అమెజాన్ ప్రైమ్‌లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి.

Whats_app_banner