Bigg Boss Elimination: మారిపోయిన ఓటింగ్ స్థానాలు- ఇవాళ, రేపు రెండుసార్లు ఎలిమినేషన్- కన్నడ బ్యాచ్ నుంచి ఇద్దరు ఎలిమినేట్
Bigg Boss Telugu 8 Double Elimination Twelfth Week: బిగ్ బాస్ తెలుగు 8 పన్నెండో వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇవాళ, రేపు రెండు సార్లు ఎలిమినేషన్ జరగనుందని టాక్. దీంతో బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం కన్నడ బ్యాచ్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది.
Bigg Boss Telugu 8 Elimination This Week: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ తుది ఘట్టానికి చేరుకుంది. బిగ్ బాస్ తెలుగు 8 నవంబర్ 22 ఎపిసోడ్‌లో హౌజ్‌కు కొత్త మెగా చీఫ్‌గా జబర్దస్త్ రోహిణి గెలిచింది. దాంతో బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ చివరి మెగా చీఫ్‌గా రోహిణి నిలిచింది. ఇదిలా ఉంటే, బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని సమాచారం అందింది.
హౌజ్‌లో పదిమంది
ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లో గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, నిఖిల్ మలియక్కల్, విష్ణుప్రియ, యష్మీ గౌడ, ప్రేరణ కంబం, పృథ్వీరాజ్ శెట్టి, జబర్దస్త్ అవినాష్, జబర్దస్త్ రోహిణి, నబీల్ అఫ్రీది ఇలా పది మంది వరకు కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో ఐదుగురు బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు.
నవంబర్ 18, 19 రెండు రోజుల పాటు సాగిన బిగ్ బాస్ తెలుగు 8 12వ వారం నామినేషన్స్‌లో నిఖిల్, ప్రేరణ, యష్మీ, నబీల్, పృథ్వీ ఐదుగురు ఉన్నారు. వీరందరిని బిగ్ బాస్ 8 తెలుగు నుంచి ఎలిమినేట్ అయిన మాజీ కంటెస్టెంట్స్ నామినేట్ చేశారు. నామినేషన్ ప్రక్రియ అనంతరం నుంచి వీరందరికి ఓటింగ్ పోల్ ఓపెన్ అయింది.
ఓటింగ్ స్థానాల్లో మార్పులు
ఈ వారం బిగ్ బాస్ ఓటింగ్ ఫలితాలు తరచుగా మారుతూ వచ్చాయి. మొదటి రోజున ఎలిమినేట్ అవుతుందనుకున్న కంటెస్టెంట్ రెండో రోజు వచ్చేసరికి ఒక్కసారిగా టాప్ 2 స్థానంలోకి ఎగబాకారు. టాప్‌లో ఉండాల్సిన కంటెస్టెంట్ బాటమ్‌లోకి పడిపోయారు. ఇలా హెచ్చు తగ్గులతో రోజు రోజు బిగ్ బాస్ ఓటింగ్ స్థానాలు మారిపోయాయి. ఫైనల్‌గా శుక్రవారం (నవంబర్ 22)తో ఓటింగ్ పోల్స్ క్లోజ్ అయ్యాయి.
ఈ బిగ్ బాస్ ఓటింగ్ లెక్కల ప్రకారం టాప్‌లో మొదటి స్థానంలోకి మళ్లీ నిఖిల్ వచ్చేశాడు. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న నిఖిల్ మరోసారి తన ఆటతో టాప్ 1 ప్లేస్‌లోకి వచ్చాడు. ఆ తర్వాతి రెండో స్థానంలో నబీల్ నిలిచాడు. అయితే, వీరిద్దరి స్థానాల్లో కాస్తా అటు ఇటుగా మార్పులు ఉన్నాయి. మరికొన్ని ఓటింగ్ పోల్స్‌లో నబీల్ టాప్ 1లో ఉంటే నిఖిల్ రెండో స్థానంలో ఉన్నాడు.
డేంజర్ జోన్‌లో ఇద్దరు
ఇక మూడో స్థానంలో ప్రేరణ నిలిచింది. ఇప్పటివరకు వీరంతా సేఫ్‌గా ఉన్నారు. టాప్ 4 ప్లేస్‌లో యష్మీ గౌడ, ఐదో స్థానమైన చివరి పొజిషన్‌లో పృథ్వీ ఉన్నారు. అంటే, వీరిద్దరి బాటమ్‌లో డేంజర్ జోన్‌లో ఉన్నారు. మొదటి రోజు ఓటింగ్‌లో పృథ్వీ టాప్ 4లో ఉంటే, యష్మీ ఐదో స్థానంలో ఉంది. కానీ, వీకెండ్ వచ్చేసరికి ఓటింగ్ స్థానాలు మారిపోయాయి. దీంతో ఐదో స్థానంలోకి పృథ్వీ పడిపోయాడు.
ఈ లెక్కన ఈ వారం పృథ్వీ ఎలిమినేట్ కానున్నాడని తెలుస్తోంది. అయితే, బిగ్ బాస్ తెలుగు 8లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందని బీబీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. అంటే, ఈ వారం రెండు సార్లు ఎలిమినేషన్ ప్రక్రియ జరగనుంది. అది కూడా ఇవాళ ఒకరిని, రేపు మరొకరిని ఎలిమినేట్ చేయనున్నారని తెలుస్తోంది.
పృథ్వీ-యష్మీ ఎలిమినేట్
ఇలా చూసుకుంటే ఇవాళ, రేపు కలిపి కన్నడ బ్యాచ్‌కు చెందిన పృథ్వీ, యష్మీ ఇద్దరు హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం నాటికి సంబంధించిన షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఒకవేళ షూట్ ప్రారంభం అయ్యాక పృథ్వీ, యష్మీలో ఒకరు ఎలిమినేట్ కానున్నారా లేదా ఇద్దరు ఎలిమినేట్ అవుతారనే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.