Running: ప్రతీ రోజు రన్నింగ్ ఎందుకు చేయాలి? ఫిట్‍నెస్ ఒక్కటే కాదు.. 10 కారణాలు ఇవే
Running: పరుగెత్తడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. అందుకే ప్రతీ రోజు రన్నింగ్ చేయాలి. అయితే, దీనివల్ల కొన్ని లాభాలే ఎక్కువ మందికి తెలుసు. అయితే, మరిన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి. రెగ్యులర్‌గా ఎందుకు రన్నింగ్ చేయాలో 10 కారణాలను ఇక్కడ చూడండి.
రన్నింగ్ అనేది చాలా ప్రభావవంతమైన వ్యాయమం. ఎలాంటి పరికరాలు లేకుండా పరుగెత్తే ఈ ఎక్సర్‌సైజ్ ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది. రన్నింగ్ చాలా పాపులర్. ఇది ఫిట్‍నెస్ కోసం మాత్రమే అని చాలా మంది అనుకుంటారు. కానీ రన్నింగ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. గుండె ఆరోగ్యం నుంచి బరువు తగ్గడం వరకు ఎన్నో లాభాలు దక్కుతాయి. ప్రతీ రోజు కచ్చితంగా ఎందుకు పరుగెత్తాలో 10 కారణాలను ఇక్కడ చూడండి.
క్యాలరీలు బర్న్.. బరువు తగ్గేందుకు..
శరీరంలో క్యాలరీలు బర్న్ అయ్యేందుకు రన్నింగ్ అద్భుతంగా పని చేస్తుంది. ఆరోగ్యకరమైన బరువు మెయింటెన్ చేసేందుకు పరుగు ఎంతో ఉపకరిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు ప్రతీ రోజు రన్నింగ్ చేయడం ఎంతో ముఖ్యం. పరుగు వల్ల కొవ్వు కూడా కరుగుతుంది. జీవక్రియ మెరుగుపడుతుంది. క్యాలరీలుగా మెరుగ్గా బర్న్ అవుతాయి.
ఎముకలు, కీళ్లకు దృఢత్వం
ప్రతీ రోజు రన్నింగ్ చేయడం వల్ల ఎముకలు, కీళ్ల దృఢత్వం పెరుగుతుంది. దీర్ఘకాలంలో ఇది ఎంతో మేలు చేస్తుంది. ఎముకలు పెళుసుగా మారే ఓస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని పరుగు తగ్గిస్తుంది. ఎముకల సాంద్రత కూడా పదిలంగా ఉండేలా చేయగలదు. కండరాలు కూడా మెరుగవుతాయి.
ఆయుష్షు పెరుగుదల!
రన్నింగ్ చేయడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. చాలా వ్యాధుల బారిన పడే రిస్క్ తగ్గుతుంది. అందుకే ప్రతీ రోజు రన్నింగ్ చేస్తే ఆయుష్షు పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. పరుగు వల్ల ఆయుర్దాయం అధికం అవుతుందని పేర్కొన్నాయి.
శరీరానికి విటమిన్ డీ
రన్నింగ్ చేయాలంటే చాలా మంది బయటికే వెళతారు. దీంతో ఉదయాన్ని శరీరానికి సూర్య కిరణాలు తగులుతాయి. దీంతో శరీరానికి విటమిన్ డీ మెరుగ్గా అందుతుంది. రోగ నిరోధక శక్తి, ఎముకల దృఢత్వం, చురుగ్గా ఉండేందుకు విటమిన్ డీ తోడ్పడుతుంది.
గుండె ఆరోగ్యం
రెగ్యులర్‌గా పరుగెత్తడం వల్ల గుండె కండరాలు బలపడతాయి. శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇది బ్లడ్ ప్రెజర్‌ను తగ్గిస్తుంది. అందుకే రన్నింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. గుండె వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.
శ్వాస సమస్యలు తగ్గేలా..
రన్నింగ్ చేయడం వల్ల శ్వాసకోశ వ్యవస్థలోని భాగాల కండరాలు బలపడటంతో పాటు ఊపిరితిత్తుల పని తీరు మెరుగుపడుతుంది. దీనివల్ల శ్వాసకోశ సమస్యలు తగ్గేందుకు సహకరిస్తుంది. ఆస్తమా లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతంది.
రోగ నిరోధక శక్తి
రన్నింగ్ చేయడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. పరుగెత్తడం వల్ల శరీరంలో ఇమ్యూన్ కణాల ఉత్పత్తికి ప్రేరణ కలుగుతుంది. వాటి పని తీరు మెరుగవుతుంది. ఇన్ఫెక్షన్ల నుంచి రోగ నిరోధక శక్తి మెరుగ్గా పోరాడగలుగుతుంది.
నిద్ర నాణ్యత
రెగ్యులర్‌గా రన్నింగ్ చేస్తే నిద్ర కూడా మేలు జరుగుతుంది. నిద్ర నాణ్యత మెరుగవుతుంది. రన్నింగ్ వల్ల నిద్ర షెడ్యూల్ కూడా ఒకే తీరులో మెయింటెన్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి. నిద్రలేమి సమస్యను పరుగెత్తడం తగ్గించగలదు.
కళ్ల ఆరోగ్యం మెరుగు
క్రమం తప్పకుండా పరుగెత్తడం వల్ల కళ్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. ఇతర అవయవాల్లాగే రన్నింగ్ వల్ల కళ్లకు కూడా రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. దీనివల్ల గ్లుకోమా లాంటి వయసు సంబంధిత కళ్ల సమస్యల రిస్క్ తగ్గుతుంది.
మంచి మూడ్
పరుగెత్తడం వల్ల ఎండార్ఫిన్స్ ఉత్పత్తి పెరుగుతుంది. న్యూరోట్రాన్స్‌మిటర్స్ మెరుగవుతాయి. దీంతో సంతోషంగా అనిపించి.. మంచి మూడ్ ఉంటుంది. మానసిక ఒత్తిడి, బద్ధకం కూడా తగ్గుతాయి.
టాపిక్