OTT Comedy Web Series: ఓటీటీలో టాప్ ట్రెండింగ్‍లోకి దూసుకొచ్చిన తమిళ కామెడీ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Comedy Web Series: చట్నీ సాంబర్ వెబ్ సిరీస్ ఓటీటీలో అదరగొడుతోంది. మంచి వ్యూస్ దక్కించుకుంటోంది. దీంతో స్ట్రీమింగ్‍కు వచ్చిన రెండు రోజుల్లోనే ఓటీటీ ట్రెండింగ్‍లో టాప్‍లోకి వచ్చేసింది.

తమిళ వెబ్ సిరీస్ ‘చట్నీ సాంబర్’పై ముందు నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. స్టార్ కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్ర పోషించడంతో క్రేజ్ వచ్చింది. ఈ సిరీస్‍కు రాధామోహన్ దర్శకత్వం వహించారు. టైటిల్‍తోనూ ఈ సిరీస్‍పై ఆసక్తి పెరిగింది. చట్నీ సాంబర్ వెబ్ సిరీస్ ఈ వారంలోనే జూలై 26న డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.
అప్పుడే ట్రెండింగ్‍లో టాప్
చట్నీ సాంబర్ చిత్రానికి భారీ వ్యూస్ వస్తున్నాయి. పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో.. మంచి ఆదరణ దక్కించుకుంటోంది. దీంతో ఈ వెబ్ సిరీస్ డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో ఈ సిరీస్ ట్రెండింగ్‍లో టాప్‍కు వచ్చేసింది. హాట్‍స్టార్ నేషనల్ వైడ్ ట్రెండింగ్‍లో ప్రస్తుతం ఫస్ట్ ప్లేస్‍లో ఉంది.
ఏడు భాషల్లో..
తమిళంలో రూపొందిన చట్నీ సాంబర్ వెబ్ సిరీస్ మొత్తంగా ఏడు బాషల్లో డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. మొత్తంగా ఈ కామెడీ డ్రామా సిరీస్ హాట్‍స్టార్ ఓటీటీలో మంచి ఆరంభాన్ని అందుకుంది.
చట్నీ సాంబార్ సిరీస్‍లో యోగిబాబుతో పాటు వాణి భోజన్, ఎలాంగో కుమార్ వేల్, చంద్రన్, దీపా శంకర్, నితిన్ సత్య, క్రిష్ హాసన్, నిజల్‍గల్ రవి కీలకపాత్రలు పోషించారు. ఈ సిరీస్‍కు కథ రాసుకున్న రాధామోహన్ తెరకెక్కించారు. ఈ సిరీస్‍ను వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారీ కే గణేశ్ నిర్మించారు. అజేశ్ సంగీతం అందించిన ఈ సిరీస్‍కు ప్రసన్న కుమార్ సినిమాటోగ్రఫీ చేశారు.
చట్నీ సాంబర్ సిరీస్‍కు సోషల్ మీడియాలో ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మంచి కామెడీ సిరీస్ అని, నవ్వులు పంచుతోందని చాలా మంది పోస్టులు చేస్తున్నారు. ఎలాంటి హింస, అభ్యంతకరమైన సీన్లు లేకుండా సరదాగా చూసేలా ఈ సిరీస్ ఉందని కామెంట్లు చేస్తున్నారు. కామెడీ ఈ సిరీస్‍లో బాగా పండిందని అంటున్నారు. యోగిబాబుతో పాటు ఈ సిరీస్‍లో నటించిన అందరి పర్ఫార్మెన్స్‌పై ప్రశంసలు వస్తున్నాయి.
చట్నీ సాంబర్ స్టోరీలైన్
ఊటీలో అముద కేఫ్ పేరుతో ఓ పాపులర్ హోటల్ నడుపుతుంటాడు రత్నస్వామి. సాంబార్‌కు అది చాలా ఫేమస్ అయి ఉంటుంది. జీవితం సంతోషంగా గడుపుతుండగా ఓ రోజు ఆయనకు గుండెపోటు వస్తుంది. ఈ తరుణంలో తన కుమారుడు కార్తీక్ (చంద్రన్)కు ఓ విషయం చెబుతాడు. పెళ్లికి ముందే తనకు ముందే అముద (దీపా శంకర్) అనే వేరే మహిళలతో సంబంధం ఉందని, మరో కొడుకు కూడా ఉన్నాడని కార్తీక్‍తో రత్నస్వామి చెబుతాడు. తాను సవతి సోదరుడిని కనుగొంటానని రత్నస్వామికి కార్తీక్ మాటిస్తాడు. రత్నస్వామి మరణిస్తాడు. అతడి అంత్యక్రియలు చేసేందుకు తన సవతి సోదరుడు సచిన్ (యోగిబాబు)ను కనుగొనేందుకు కార్తీక్ ప్రయత్నాలు చేస్తాడు. చెన్నైలో సచిన్ రోడ్‍సైడ్ ఓ టిఫిన్ సెంటర్ నడుపుతుంటాడు. అది చట్నీకి బాగా ఫేమస్. సచిన్‍ను కలిసిన కార్తీక్ అతడిని ఊటీకి తీసుకెళతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? కలిసి హోటల్‍ను ఎలా నడిపారన్నది చట్నీ సాంబర్ వెబ్ సిరీస్‍లో ప్రధానంగా ఉంటాయి.