ప్రపంచంలో చైనా తర్వాత భారత్ రెండో అతిపెద్ద బంగారం వినియోగదారు. బంగారం అవసరాలలో ఎక్కువ భాగం దిగుమతులు, దేశీయ బులియన్ స్థానికంగా రీసైకిల్ చేయడం ద్వారా తీరుతుంది. కాబట్టి అంతర్జాతీయ ధరలు మాత్రమే కాకుండా దిగుమతి సుంకాలు, ఇతర పన్నులు దేశీయ బంగారం ధరలను నిర్ణయించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. సాధారణంగా బంగారం ద్రవ్యోల్బణం నుంచి, ఆర్థిక అస్థిరత నుంచి తట్టుకుని నిలబడేలా చేయగలుగుతుంది. బాండ్ ఈల్డ్, డాలర్ రేటు కూడా విలువైన లోహం ధరలపై ప్రభావం చూపుతాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా ప్రధాన భారతీయ నగరాల్లో తాజా బంగారం ధరలు ఇక్కడ చూడండి.
గోల్డ్ రేట్ (బంగారం ధర) ఈ రోజు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా మీ ప్రాంతం, సిటీ వారీగా ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఈ పేజీ మీకు ఉపయోగంగా ఉంటుంది. బంగారం ధర ఎంత ఉంది? వెండి ధర ఎలా ఉంది? వంటి వివరాలతో పాటు బంగారం ఎలా కొనాలి, ఎక్కడ కొనాలి వంటి విషయాలను మీకు అందిస్తాం. రోజువారీగా 24 క్యారెట్లు, 22 క్యారెట్ల గోల్డ్ ప్రైస్ (బంగారం ధరలు) తో పాటు గోల్డ్ క్వాలిటీకి సంబంధించి పలు విషయాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.
Friday, June 20, 2025
Monday, June 16, 2025
Sunday, June 15, 2025
Tuesday, June 10, 2025
Sunday, June 8, 2025
Wednesday, June 4, 2025
జవాబు: బంగారం ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరల్లో మార్పులు, గోల్డ్ రిజర్వ్ పరిమాణం, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల వంటి అంశాల కారణంగా ప్రభావితమవుతాయి. అనేక అంతర్జాతీయ అంశాల ప్రభావం భారతీయ మార్కెట్లలో బంగారం ధరలపై ఆధారపడి ఉంటుంది.
జవాబు: క్యారట్ (karat) అనే పదాన్ని స్వచ్ఛత లేదా బంగారం నాణ్యతను కొలవడానికి ఉపయోస్తారు. దీనిని "K" గా సూచిస్తారు. మార్కెట్‌లో 14 క్యారెట్లు, 18 క్యారెట్లు, 22 క్యారెట్లు, అలాగే 24 క్యారెట్లలో బంగారం అందుబాటులో ఉంది. 24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్చమైన బంగారంగా పరిగణిస్తారు. 22 క్యారెట్లు, 18 క్యారెట్లతో పోలిస్తే 24 క్యారెట్ల గోల్డ్ రేట్ ఎక్కువగా ఉంటుంది.
జవాబు: ఇండియాలో బంగారాన్ని సర్టిఫై చేయడానికి భారత ప్రభుత్వం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్)ని ఏజెన్సీగా గుర్తించింది. బీఐఎస్ హాల్‌మార్క్ బంగారు ఆభరణాల స్వచ్ఛతపై విశ్వసనీయతను సమకూరుస్తుంది. హాల్ మార్క్ ఉన్న నగలపై బీఐఎస్ లోగో, జువెల్లర్ కోడ్, గోల్డ్ ప్యూరిటీ (క్యారట్) తెలియజేస్తుంది