Bigg Boss Vishwak Sen: బిగ్ బాస్ హౌజ్‌లోకి విశ్వక్ సేన్ ఎంట్రీ.. టైమ్ పెంచే పవర్.. జబర్దస్త్ రోహిణికి పంచ్‌లు (వీడియో)
Bigg Boss Telugu 8 Vishwak Sen: బిగ్ బాస్ హౌజ్‌లోకి విశ్వక్ సేన్ ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో మాస్ కా దాస్ మెకానిక్ రాకీ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా అడుగుపెట్టాడు. కంటెస్టెంట్స్ అందరితో సరదాగా మాట్లాడిన విశ్వక్ సేన్ జబర్దస్త్ రోహిణికి పంచ్‌లు వేశాడు.
Bigg Boss 8 Telugu Vishwak Sen: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. బిగ్ బాస్ 8 తెలుగు పూర్తి కావడానికి మరికొన్ని వారాలే మిగిలి ఉంది. ఇక బిగ్ బాస్ హౌజ్‌లో అప్పుడప్పుడు సెలబ్రిటీలు అడుగుపెట్టి సర్‌ప్రైజ్ ఇస్తారన్న విషయం తెలిసిందే. తాజాగా అలాంటి సర్‌ప్రైజ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇచ్చాడు.
మెకానిక్ రాకీ ప్రమోషన్స్
బిగ్ బాస్ తెలుగు 8 నవంబర్ 21 ఎపిసోడ్‌లో మెకానిక్ రాకీ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా విశ్వక్ సేన్ హౌజ్‌లోకి అడుగుపెట్టాడు. మెకానిక్ రాకీ సినిమా నవంబర్ 22న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 8 తెలుగు సీజన్‌లో ప్రమోషన్స్ కోసం విశ్వక్ సేన్ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
న్యూ కంటెస్టెంట్ అంటూ
బిగ్ బాస్ హౌజ్‌లో ఆటోతోపాటు మాస్ ఎంట్రీ ఇచ్చాడు విశ్వక్ సేన్. బిగ్ బాస్ ఇంట్లో విశ్వక్ సేన్‌ను చూసి కంటెస్టెంట్స్ అంతా ఆశ్చర్యపోయారు. హౌజ్‌లోకి వెళ్తూ తాను "న్యూ కంటెస్టెంట్" అని విశ్వక్ సేన్ అన్నాడు.
టైమ్ పెంచే పవర్
"నిజమా.. నువ్ మెకానిక్ రాకీ" అని తెలుసు అని టేస్టీ తేజ అన్నాడు. దాంతో అంతా నవ్వేశారు. తర్వాత అంతా కూర్చున్నారు. మెకానిక్ రాకీ స్టోరీ ఏంటన్న అని అవినాష్ అడిగాడు. "మలక్‌పేట్‌లో ఒక మెకానిక్ స్టోరీ. సో మీకు టైమ్ పెంచే పవర్ ఇచ్చారు. మరి నాకేంటీ" అని విశ్వక్ సేన్ అడిగాడు. "నీకు ఏం కావాలి" అని తిరిగి టేస్టీ తేజ అడిగాడు. "నీకెం కావాలి" అంటూ జబర్దస్త్ రోహిణి లేచి నిల్చుంది.
బయట లోపల మ్యూజిక్
"బ్రో మీ లైఫ్ చాలా బాగుంటది బ్రో. అందరు బిగ్ బాస్‌కు వచ్చి చాలా మిస్ అవుతుంటారు. మీకు అయితే అసలు బయట మ్యూజిక్కే లోపల మ్యూజిక్కే" అని విశ్వక్ సేన్ అనడంతో అంతా నవ్వేశారు. తర్వాత మెకానిక్ రాకీ స్కిట్ వేశారు అవినాష్, రోహిణి. "నాకు నేర్చుకోవాలని ఉంది" అని రోహిణి అంటే "ఏంటి" అని అవినాష్ అంటాడు. "అదే డ్రైవింగ్" అని రోహిణి రిప్లై ఇస్తుంది.
ఐదు వేలకు మించి ఇవ్వను
పదివేలు అని అవినాష్ అంటే.. మూడు వేలు ఇస్తా కానియ్ అని రోహిణి అంటుంది. ఏం కానియ్యలే అని అవినాష్ అంటాడు. దాంతో విశ్వక్ సేన్ అడల్ట్ జోక్‌లా తీసుకుని నవ్వుతాడు. తర్వాత ఓనర్ అయిన విశ్వక్ సేన్ నీకు ఫీజే లేదు తెలుసా అని అంటాడు. ఫ్రీగా నేర్పించుకునేదానిలా కనపడుతున్నానా. రూ. ఐదు వేలకుమించి ఇవ్వను అని రోహిణి అంటే.. ఏది ఇయ్యి అని విశ్వక్ సేన్ పంచ్ వేశాడు.
విశ్వక్ సేన్ డ్యాన్స్
"ఇప్పుడు అడిగితే ఎలా" అని రోహిణి చెబుతుంటే.. "నేను అడిగింది నీ ఐదు వేళ్లను నా ఐదు వేళ్లల్లో పెట్టమని" అని మరో పంచ్ వేస్తాడు విశ్వక్ సేన్. దాంతో అంతా కేకలు పెడతారు. తర్వాత పాగల్ మూవీ టైటిల్ సాంగ్‌కు అంతా విశ్వక్ సేన్‌తో కలిసి డ్యాన్స్ చేస్తారు. అంతటితో బిగ్ బాస్ తెలుగు 8 విశ్వక్ సేన్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.