Mercury Rise: వృశ్చిక రాశిలోకి బుధుడు- ఈ రాశుల వారికి అదృష్టం మామూలుగా కలిసిరావడం లేదు
Mercury Rise: గ్రహాల అధిపతి బుధుడు డిసెంబర్ నెలలో వృశ్చికరాశిలో ఉదయిస్తాడు. ఇది అన్నిరాశుల వారిపై ప్రభావం చూపుతున్నప్పటికీ మూడు రాశుల వారికి మాత్రం బాగా కలిసొస్తుంది. మంచి సానుకూల ఫలితాలను ఇస్తుంది.
సూర్యుడికి దగ్గరగా ఉండే బుధు గ్రహాన్ని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తుంటారు. బుధుడు అతి తక్కువ సమయంలో రాశిచక్రాన్ని మారుస్తాడు. తర్కం, తెలివితేటలు, కమ్యూనికేషన్, వివేకం, వ్యాపారానికి బుధుడు చిహ్నంగా ఉంటాడు. బుధ సంచారం సానుకూలంగా ఉంటే, ఒక వ్యక్తి నైపుణ్యం మెరుగ్గా ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. బుధుని సంచారంలో మార్పులు అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రస్తుతం ఎనిమిదో దశలో ఉన్న బుధుడు వచ్చే నెలలో ఉదయిస్తాడు. అంటే 2024 డిసెంబర్ 11 న బుధుడు వృశ్చిక రాశిలో ఉదయిస్తాడు. తిరిగి 2025 నూతన సంవత్సరం మార్చిలో చురుగ్గా కదులుతాడు. ఆ సమయంలో వివాదాలు పరిష్కారమవుతాయి. మూడ్ పాజిటివ్ గా ఉంటుంది. వృశ్చిక రాశిలోకి బుధుడు ఉదయించడం వల్ల ఏ రాశి వారికి అదృష్టం కలిసొస్తుందో తెలుసుకుందాం.
వృషభం రాశి:
వృశ్చిక రాశిలోకి బుధుడు ఉదయించడం వల్ల వృషభ రాశి వారికి దీర్ఘకాలిక విజయం లభిస్తుంది. వృత్తి జీవితం అద్భుతంగా ఉంటుంది. ఆదాయ వనరులు అనూహ్యంగా పెరుగుతాయి. బుధుడి అనుగ్రహంతో కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి. ఇతరులను ఆకర్షిస్తారు. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా బలంగా ఉంటారు. బుధుడి పెరుగుదల ప్రభావం వల్ల ఇతరులతో సత్సంబంధాలు నెలకొంటాయి.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారి ఎదుగుదలకు బుధ సంచారం అనుకూలమైన సమయం. వ్యాపారంలో పెట్టే పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. స్పష్టమైన ఆలోచనలు, నిర్ణయాలతో జీవితంలో ముందుకు సాగుతారు. సృజనాత్మక రంగంలో విజయం సాధిస్తారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కొన్ని విషయాల్లో సాహసోపేతమైన అడుగులు వేస్తారు. కఠినమైన సవాళ్లను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది.
మకర రాశి:
వృశ్చిక రాశిలోకి బుధుడు ఉదయించడం మకర రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. వృత్తి జీవితంలో పురోగతి సాధిస్తారు. కొన్ని రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలను సులభంగా పరిష్కరించుకో గలుగుతారు. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఇది సంతోషకరమైన సమయంగా చెప్పవచ్చు. కొత్త సంవత్సరంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి ఆర్థిక ప్రయోజనం పొందుతారు. లక్ష్యాలపై దృష్టి పెడతారు. లక్ష్యాలను సాధించడంలో ఈ సమయం మీకు సహాయపడుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి. వివాదాలు పరిష్కారమవుతాయి.
ఇక్కడ గమనించ వలసిన విషయం ఏంటంటే.. బుధుడు సానుకూల ఫలితాలను ఇచ్చినప్పుడు జీవితం సాఫీగా గడిచిపోతుంది. అదే జాతకంలో బుధుడి స్థానం ప్రతికూలంగా ఉంటే, హెచ్చుతగ్గులు ఉంటాయి. వాటిని అధిగమించడానికి, బుధుడి ప్రభావాలను తగ్గించడానికి మనం కొన్ని చర్యలపై దృష్టి పెట్టాలి. అప్పుడే బుధుడు బలంగా మారతాడు. ఇతరులతో తొందరపడి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోకూడదు. ఆర్థిక అంశాలపై దృష్టి పెట్టాలి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.