OTT Action Thriller: ఓటీటీలోకి ఇవాళే వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్- తెలుగు, కన్నడలో స్ట్రీమింగ్- ఎక్కడ చూడాలంటే?-bagheera ott streaming on netflix ott action thriller srimurali super hero movie bagheera ott release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Action Thriller: ఓటీటీలోకి ఇవాళే వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్- తెలుగు, కన్నడలో స్ట్రీమింగ్- ఎక్కడ చూడాలంటే?

OTT Action Thriller: ఓటీటీలోకి ఇవాళే వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్- తెలుగు, కన్నడలో స్ట్రీమింగ్- ఎక్కడ చూడాలంటే?

Sanjiv Kumar HT Telugu
Nov 21, 2024 10:36 AM IST

Bagheera OTT Streaming: ఓటీటీలోకి ఇవాళ సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ బఘీర వచ్చేసింది. తెలుగు, కన్నడ భాషల్లో నవంబర్ 21 నుంచి బఘీర ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించిన బఘీర సినిమాలో ఉగ్రమ్ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి హీరోగా చేశాడు. బఘీర ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏదంటే?

ఓటీటీలోకి ఇవాళే వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్- తెలుగు, కన్నడలో స్ట్రీమింగ్- ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి ఇవాళే వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్- తెలుగు, కన్నడలో స్ట్రీమింగ్- ఎక్కడ చూడాలంటే?

Bagheera OTT Release: కేజీఎఫ్ సినిమాతో ప్రశాంత్ నీల్ డైరెక్టర్‌గా ఎంతటి పేరు, క్రేజ్ తెచ్చుకున్నారో తెలిసిందే. కేజీఎఫ్ సిరీస్‌తోనే కాకుండా ప్రభాస్‌తో సలార్ తెరకెక్కించి డార్లింగ్ అభిమానుల్లో జోష్ నింపారు ప్రశాంత్ నీల్. అలాంటి క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కన్నడలో చేసిన మొదటి సినిమా ఉగ్రమ్. ఈ మూవీలో హీరోగా చేసిన శ్రీమురళి సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు.

ప్రశాంత్ నీల్ కథ

కన్నడ నాట మాస్ హీరో క్రేజ్ తెచ్చుకున్న శ్రీమురళిని రోరింగ్ స్టార్ అని అభిమానులు పిలిచుకుంటారు. అలాంటి రోరింగ్ స్టార్ శ్రీమురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ బఘీర. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ కథ అందించడం విశేషం. బఘీర సినిమాకు డాక్టర్ సూరి దర్శకత్వం వహించారు.

సూపర్ హీరో మూవీ

కేజీఎఫ్‌ ఫ్రాంఛైజీతో పాపులర్ అయిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ బఘీర సినిమాను నిర్మించారు. సూపర్ హీరో మూవీగా వచ్చిన బఘీర అక్టోబర్ 31న దీపావళి పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది.

కన్నడలో సూపర్ హిట్

అలాగే, పలు బ్లాక్‌ బస్టర్‌లను విజయవంతంగా డిస్ట్రిబ్యూట్ చేసిన టాలీవుడ్ టాప్ డిస్ట్రిబ్యూషన్ హౌజ్ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పీ బఘీర చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఫస్ట్ సింగిల్, ట్రైలర్‌తో మంచి అంచనాలను పెంచేసిన బఘీర మూవీ కన్నడ నాట సూపర్ హిట్ కొట్టింది.

20 రోజుల్లోనే ఓటీటీలోకి

బఘీర సినిమాను సుమారుగా రూ. 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తే బాక్సాఫీస్ వద్ద రూ. 29 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించి పెట్టింది. దీంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కన్నడలో మంచి విజయం సాధించిన బఘీర మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన బఘీర సుమారు 20 రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది.

బఘీర ఓటీటీ స్ట్రీమింగ్

బఘీర మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయింది. నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో బఘీర ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా కన్నడతో పాటు తెలుగు భాషలో బఘీర డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. అయితే, మరికొన్ని రోజుల్లో తమిళం, మలయాళం భాషల్లో కూడా బఘీరను ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ పేర్కొంది.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

థియేటర్లలో మిస్ అయిన ఈ సూపర్ హీరో మూవీ బఘీరను ఎంచక్కా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు. కాగా బఘీర సినిమాలో శ్రీమురళి హీరోగా చేస్తే రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. అలాగే, ఈ మూవీలో ప్రకాష్ రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

హై యాక్షన్ థ్రిల్లింగ్ సీన్స్

బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించిన బఘీర సినిమాకు ఏజే శెట్టి సినిమాటోగ్రఫీగా వ్యవహరించారు. అలాగే, ఎడిటర్‌గా ప్రణవ్ శ్రీ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్‌గా రవి సంతేహక్లు వర్క్ చేశారు. ఇక బఘీర సినిమాలో హై ఇంటెన్స్ యాక్షన్, థ్రిల్లింగ్ సన్నివేశాలతోపాటు ఎమోషనల్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది.

Whats_app_banner