Electric car : సింగిల్ ఛార్జ్‌తో హైదరాబాద్ టు వైజాగ్ ట్రిప్- ఈ కొత్త ఎలక్ట్రిక్ కారులో సూపర్ రేంజ్!
Hyundai Ioniq 9 : హ్యుందాయ్ ఐయానిక్ 9ని సంస్థ తాజాగా లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఫీచర్స్, పవర్, రేంజ్, స్పీడ్‌తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్.. సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. దీని పేరు హ్యుందాయ్ ఐయానిక్ 9. ఇదొక 3-రో ఈవీ. ఐయానిక్ 5, ఐయానిక్ 6తో సహా కొత్త తరం ఎలక్ట్రిక్ కార్లకు మద్దతు ఇచ్చే కొత్త ఈ-జీఎంపీ ప్లాట్‌ఫామ్‌పై ఈ కొత్త కారును రూపొందించింది. హ్యుందాయ్ 2025 ప్రథమార్ధంలో దక్షిణ కొరియా, యూఎస్ఏలో మొదట ఐయానిక్9ను విడుదల చేయనుంది. ఇండియా లాంచ్‌పై ఇంకా అప్డేట్ రాలేదు. ఇక ఈ మోడల్‌కి సంబంధించిన వివరాలను ఇక్కడ చూడండి..
హ్యుందాయ్ ఐయానిక్ 9: అతిపెద్ద కొరియన్ ఈవీ?
హ్యుందాయ్ ఎలక్ట్రిక్ వాహనాల్లో ఐయానిక్ 9 అతిపెద్దది! 3,130 ఎంఎం పొడవైన వీల్‌బేస్‌ను అందిస్తుంది. ఈవీ మొదటి, రెండొవ వరుసలను పూర్తిగా రెక్లైన్ చేసే ఎంపికతో ఆరు- ఏడు సీట్ల కాన్ఫిగరేషన్లను అందిస్తుంది.
హ్యుందాయ్ ఐయానిక్ 9: ఫీచర్లు
ఐయానిక్ 9లో ప్రయాణీకులను ఆకట్టుకునే అనేక ఫీచర్లు ఉన్నాయి. పనోరమిక్ కర్వ్డ్ డిస్ప్లేలో భాగమైన 12 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే కూడా ఉంది. 14 స్పీకర్లతో కూడిన బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, 5.1 ఛానల్ సరౌండ్ సౌండ్‌తో అడ్వాన్స్డ్ మల్టీమీడియా యూనిట్ ఇందులో ఉన్నాయి. ఐయానిక్ 9లో ఈ-యాక్టివ్ సౌండ్ డిజైన్ కూడా ఉంది. ఇది ఈవీ వర్చువల్ డ్రైవింగ్ సౌండ్‌ని ఉత్పత్తి చేయడానికి కారు సౌండ్ సిస్టమ్‌ని ఉపయోగిస్తుంది.
సెగ్మెంట్ ఫస్ట్ రిలాక్సేషన్ సీట్లు హ్యుందాయ్ ఐయానిక్ 9లో ఉన్నాయి. డైనమిక్ బాడీ కేర్ సిస్టమ్‌ని కలిగి ఉంది. ఇందులో మసాజ్ ఫంక్షనాలిటీ కూడా ఉంటుంది. ఐయానిక్ 9 రెండొవ వరుసలో స్వివెల్ సీట్లతో ప్రత్యేకంగా నిలుస్తుంది.
యూనివర్సల్ ఐలాండ్ 2.0 అనే కన్సోల్‌ను కలిగి ఉన్న ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఆకట్టుకునే స్టోరేజ్‌ను కూడా అందిస్తుంది. ముందు వరుస సీటింగ్ అమరికలో ప్రాప్యత, సౌకర్యాన్ని పెంచే ఈ కన్సోల్ ముందు- వెనుక నుంచి తెరవగల టూ-వే ఆర్మ్‌రెస్ట్ కూడా కలిగి ఉంది.
మూడొవ వరుస సీట్లను మడతపెట్టినప్పుడు, బూట్ 1,323 లీటర్ల వరకు ఉంటుంది. మూడు వరుసలు ఓపెన్ పొజిషన్లో ఉన్నప్పుడు, ఇది 620 లీటర్ల వరకు సాధారణ బూట్ స్పేస్‌ను అందిస్తుంది. రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్లో ఫ్రంట్ బూట్ 88 లీటర్లు, ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షన్లో 52 లీటర్లు ఉంది.
హ్యుందాయ్ ఐయానిక్ 9: రేంజ్, బ్యాటరీ, ఛార్జింగ్
హ్యుందాయ్ ఐయానిక్ 9 కొరియా ఆటో దిగ్గజం తయారు చేసిన ఏ కారులోనైనా అతిపెద్ద ఈవీ బ్యాటరీని కలిగి ఉంది! 110.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా దాదాపు 620 కిలోమీటర్లు నడపడానికి సహాయపడుతుంది. హ్యుందాయ్ ఐయానిక్ 9.. 350 కిలోవాట్ల ఛార్జర్‌ను సపోర్ట్ చేస్తుందని, కేవలం 24 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు రీఛార్జ్ అవుతుందని సంస్థ తెలిపింది.
పవర్ అవుట్ పుట్ 215 బీహెచ్పీ నుంచి 492 బీహెచ్పీ మధ్య, వేరియంట్‌ని బట్టి ఉంటుంది. పర్ఫార్మెన్స్ మోడల్ కేవలం 5.2 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. లాంగ్ రేంజ్ ఏడబ్ల్యూడీ వేరియంట్ 6.7 సెకన్లలో ఈ స్పీడ్‌ని అందుకుంటుంది. లాంగ్ రేంజ్ ఆర్డబ్ల్యూడీ వెర్షన్ ఈ స్పీడ్‌ని 9.4 సెకన్లలో అందుకోగలదు.
సంబంధిత కథనం