Vastu Tips: సాయంత్రం సమయంలో బట్టలు ఉతకకూడదా? ఉతికితే ఏమవుతుంది?
Vastu Tips: హిందూ నమ్మకాల ప్రకారం, కొన్ని చెడు అలవాట్లను మానుకోకపోతే లక్ష్మీదేవీ ఆగ్రహిస్తుందట. దుఃఖదాయకమైన జీవితంతో పాటు ఆర్థిక సమస్యలు వెంటాడతాయని పురాణాలు చెబుతున్నాయి.
Vastu Tips: హిందూ నమ్మకాల ప్రకారం, కొన్ని చెడు అలవాట్లను మానుకోకపోతే లక్ష్మీదేవీ ఆగ్రహిస్తుందట. దుఃఖదాయకమైన జీవితంతో పాటు ఆర్థిక సమస్యలు వెంటాడతాయని పురాణాలు చెబుతున్నాయి.
హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం, లక్ష్మీదేవి ఆగ్రహానికి కారణభూతులు కాకుండా ఉండాలంటే సాయంత్రం వేళల్లో కొన్ని పనులను చేయడం మానేయాలి. సిరిసంపదలు నొసగే అమ్మవారి అనుగ్రహం కోసం ఇంట్లో ఉన్నప్పుడు కూడా సరైన ప్రవర్తన కలిగి ఉండాలి. నమ్మకాలకు విరుద్ధంగా యథేచ్ఛగా పనులు చేయాలనుకుంటే ఆర్థిక సమస్యలు, ఆందోళనలు వారి జీవితంలోకి వద్దన్నా వచ్చి చేరతాయి.
సాయంత్రం వేళల్లో చేయకూడని పనులేంటో ఓసారి చూద్దాం.
రాత్రి సమయాల్లో జుట్టు వదిలేసుకుని పడుకోవడం/ తలస్నానం చేయడం/ దువ్వు కోవడం వంటివి చేయకూడదు. సాయంత్రం అంటే సూర్యాస్తమయం నుంచి రాత్రి మొత్తం మన చుట్టూ దుష్టశక్తుల ప్రభావం ఉంటుంది. ఆ సమయంలో మహిళలు జుట్టు దువ్వుకోవడం లేదా జుట్టు ఓపెన్ గా ఉంచుకోవడం వంటివి చేయడం వల్ల వాటి ప్రభావం మన మీద పడుతుంది. దుష్ట శక్తులు మన చుట్టూ ఉన్నప్పుడు జుట్టు విరబోసుకుని పడుకోవడం వల్ల వాటిని మరికాస్త ఆకర్షించినట్లు అవుతుంది.
రాత్రి సమయాల్లో పాత్రలు కడగటం
నిద్రకు ఉపక్రమించే ముందు వంటగదిలో గిన్నెల తోముకోకుండా అలాగే ఉంచేయకూడదు. ఏదైనా కారణం వల్ల ఆ రాత్రి వాటిని కడగలేమని తెలిసినప్పుడు, వంటగదిలో పెట్టకపోవడమే ఉత్తమం. వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలా ఉంచుకోకపోవడం వల్ల అప్పుల్లోకి కూరుకుపోవడం, పేదరికం లాంటి వాటిల్లో కూరుకుపోతామని చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలని మీరు ఆశిస్తే వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి.
పాలను, పెరుగును, ఉప్పు, చక్కెరలను దానం చేయకండి
లక్ష్మీదేవి నివాసముంటే పాలు, పసుపు, ఉప్పు, పుల్లటి పదార్థములు దానం చేయకూడదు. ఒకవేళ సాయంత్రం సమయాల్లో వీటిని దానం చేశారంటే ఆ తర్వాత కలిగే ఆర్థిక సంక్షోభం, జీవితంలో అస్థిరత వంటి వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.
రాత్రుళ్లు గోళ్లు, జుట్టు కత్తిరించుకోవడం
రాత్రి సమయాల్లో గోళ్లు, జుట్టు కత్తిరించుకోవడం చెడ్డ అలవాటు అని అందరికీ తెలుసు. లక్ష్మీదేవి సంచరించే సమయం సాయంత్రమే కాబట్టి ఆ సమయంలో గోళ్లు, జుట్టు కత్తిరించుకుంటే కూర్చొంటే అమ్మవారిని అవమానించినట్లే అవుతుంది.
రాత్రుళ్లు ఇల్లు కడుక్కోవడం
వాస్తు శాస్త్రం ప్రకారం, ఉదయం సమయంలో ఊడ్చుకోవడమే మంచి పద్ధతి. సూర్యోదయం కాకముందే చీపురుతో ఎంతసేపైనా ఊడ్చుకోవచ్చు. కానీ, సూర్యాస్తమయం తర్వాత చీపురుని వాడటం చాలా చెడ్డ అలవాటు. తెలిసి కూడా సాయంత్రం సమయంలో ఊడుస్తూ ఉన్నారంటే లక్ష్మీదేవి కూడా ఊడ్చి పెట్టుకుని పోతుందట. ఆ కుటుంబ సభ్యులు ఆరోగ్యం, సంతోషం, ప్రశాంతత కోల్పోవడాన్ని కళ్లతో చూస్తారు. అందుకే రాత్రి సమయంలో ఇల్లు శుభ్రం చేసుకోకూడదు.
రాత్రిళ్లు బట్టలు ఉతకడం
పగటి సమయంతో పోల్చుకుని చూసుకుంటే సాయంత్రం లేదా రాత్రిళ్లు బట్టలు ఉతుకుతుంటే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. బట్టలు ఉతికి ఆరేసినప్పుడు వాటిల్లో అవి నివాసముంటాయి. చాలా మందికి తెలియని విషయమేమిటంటే, బట్టలు సూర్యరశ్మిలో ఆరబెట్టడం ద్వారా అందులో నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుందని విశ్వసిస్తారు.సూర్యుడి ఎండ క్రిములు, బ్యాక్టీరియాతో పాటు దుష్ట శక్తులను కూడా నాశనం చేస్తుంది.
సాయంత్రం లేదా చీకటి వేళల్లో ఈ పనులు చేయకుండా జాగ్రత్తగా గడపగలిగితే లక్ష్మీ దేవి కటాక్షం లభిస్తుంది. సంపాదన పెరగడంతో పాటు విజయం, కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.
టాపిక్