చలికాలంలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు ఇవి తప్పక తీసుకోండి

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Nov 22, 2024

Hindustan Times
Telugu

సీజనల్ వ్యాధులు, ఇన్పెక్షన్ల రిస్క్ ఎక్కువగా ఉండే చలికాలంలో రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉండాలి. ఇమ్యూనిటీ బలంగా ఉంటే రోగాల ప్రమాదం తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉండేందుకు సహకరించే కొన్ని ఫుడ్స్ ఇవే. 

Photo: Pexels

అల్లంలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‍ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని ఇది పెంచుతుంది. అందుకే చలికాలంలో అల్లాన్ని ఆహారాల్లో, డ్రింక్‍ల్లో తప్పకుండా తీసుకోవాలి. మరిన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి. 

Photo: Pexels

పాలకూర, కేల్ లాంటి ఆకుకూరల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సీ,ఈ సహా మరిన్ని పోషకాలు ఉంటాయి. ఇవి తీసుకుంటే రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉంటుంది. 

Photo: Pexels

బాదంలో కీలకమైన విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి ప్రతీ రోజూ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. 

Photo: Pexels

ఉసిరికాయల్లో విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు, పాలీన్యూట్రియంట్స్ సహా చాలా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి తింటే ఇమ్యూనిటీ మెరుగవుతుంది.

Photo: Pexels

నారింజ, నిమ్మ లాంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సీ సహా చాలా కీలకమైన పోషకాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తాయి. అందుకే వీటిని రెగ్యులర్‌గా తీసుకోవాలి. 

Photo: Pexels

పసుపులో కర్కుమిన్, యాంటీఇన్‍ఫ్లమేటరీ కారకాలు ఎక్కువగా ఉంటాయి. చలికాలంలో వంటకాల్లో పసుపు కాస్త ఎక్కువ వాడాలి. పసుపు కలిపిన గోరువెచ్చని పాలను తాగడం చాలా మేలు.

Photo: Pexels

మంచి కొలెస్ట్రాల్ ఉండే  డ్రై ఫ్రూట్స్ ఇవే, రోజూ తినండి