Electric Car Range : చలికాలంలో ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ తగ్గుకుండా ఉండేందుకు పాటించాల్సిన సింపుల్ టిప్స్
Electric Car Range In Winter : ఎలక్ట్రిక్ కార్ల వైపు జనాలు మెుగ్గుచూపిస్తున్నారు. మార్కెట్‌లోకి వచ్చిన ఈవీలకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. అదే సమయంలో వాటి రేంజ్(మైలేజీ) గురించి ఆలోచిస్తారు. అయితే చలికాలంలో కొన్ని టిప్స్ పాటిస్తే రేంజ్ తగ్గకుండా ఉంటుంది.
శీతాకాలంలో ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ తగ్గుతుంది. బ్యాటరీ ఛార్జింగ్ నిల్వ సామర్థ్యం తక్కువ ఉష్ణోగ్రతలలో తగ్గుతుంది. ఈ కారణంగా రేంజ్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. శీతాకాలంలో ఈవీని ఉపయోగించడం కాస్త ఛాలెంజింగ్‌గానే ఉంటుందని చెప్పాలి. కానీ ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు మీరు కొన్ని సింపుల్ టిప్స్ పాటించొచ్చు. ఇందుకోసం ఐదు ముఖ్యమైన టిప్స్ ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేసేయండి. దీని ద్వారా మీ ఎలక్ట్రిక్ కారు రేంజ్ పెంచుకోవచ్చు.
ఈవీ బ్యాటరీని చాలా చల్లని ఉష్ణోగ్రతలలో ఉపయోగించే ముందుగా వేడి చేయడం మంచిదని గుర్తుంచుకోండి. చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీ ప్రీ-హీటింగ్ ఫీచర్‌ను కలిగి ఉంటాయి. బ్యాటరీ గరిష్ట సామర్థ్యంతో పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్‌ని ఉపయోగించడంతో బ్యాటరీ వేగంగా ఛార్జ్ అవుతుంది. దాని పనితీరు కూడా మెరుగుపడుతుంది. దీంతో మీకు రేంజ్ తగ్గకుండా ఉంటుంది. ఎక్కువ కిలోమీటర్లు ఇస్తుంది.
శీతాకాలంలో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడాన్ని తగ్గించుకోవాలి. చాలా మంది పూర్తిగా ఛార్జ్ చేస్తే మంచిదనే అభిప్రాయంలో ఉంటారు. చలికాలంలాంటి వాతావరణంలో బ్యాటరీని 80 నుంచి 90 శాతం వరకు ఛార్జ్ చేయడం మంచి పని అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది బ్యాటరీ జీవితాన్ని పెంచుతుంది. శీతాకాలంలో దాని పనితీరుపై ప్రభావం పడకుండా ఉంటుంది.
వేసవిలో ఏసీ ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయమే. అలానే.. చాలా మంది శీతాకాలంలో కారు లోపల హీటర్‌ను ఉపయోగిస్తుంటారు. ఎండగా ఉన్నప్పుడు, వాహనం అన్ని కిటికీలను మూసివేయడం ద్వారా క్యాబిన్ ఉష్ణోగ్రతను సరిచేయవచ్చు. విండోలు ఎక్కువగా ఓపెన్ చేసి ఉంటే చలిపెరుగుతుంది. ఎక్కువసేపు తెరిచి ఉండకూడదు. మీరు హీటర్లను ఉపయోగించకుండా ఉంటే రేంజ్‌లో కొంచెం పెరుగుదల ఉంటుంది.
శీతాకాలంలో టైర్ ఒత్తిడి త్వరగా తగ్గుతుంది. దీని కారణంగా వాహనం రోలింగ్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. బ్యాటరీపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఇది రేంజ్‌ను కూడా ప్రభావితం చేస్తుంది. అందువల్ల టైర్ ఒత్తిడిని సరిగ్గా నిర్వహించండి. తద్వారా మీ ఈవీ మరింత సమర్థవంతంగా ఉంటుంది. బ్యాటరీపై ఎక్కువ లోడ్‌ను అందిస్తుంది. మీకు రేంజ్ కూడా బాగుంటుంది.
చాలా ఎలక్ట్రిక్ కార్లు రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటాయి. ఇది బ్రేక్‌లు అప్లై చేసినప్పుడు బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. శీతాకాలంలో దీన్ని గరిష్టంగా ఉపయోగించుకోండి. దాని సహాయంతో రేంజ్‌లో కొంచెం మెరుగుదల ఉంది.
పైన చెప్పిన చిట్కాలు పాటిస్తే మీ ఎలక్ట్రిక్ కారు రేంజ్ తగ్గకుండా ఉండే అవకాశం ఉంది. చలికాలంలో ఎలక్ట్రిక్ కార్లను సరిగా మెయింటెన్ చేయాలి. అప్పుడే అవి రేంజ్ ఎక్కువగా ఇస్తాయి.