Lucky Bhaskar OTT Release Date: ఈ నెలలోనే ఓటీటీలోకి లక్కీ భాస్కర్.. తేదీ, ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కానుందంటే?
Lucky Baskhar OTT Date: లక్కీ భాస్కర్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై క్లారిటీ వచ్చేసింది. ఒక సాధారణ బ్యాంక్ ఉద్యోగి తన కుటుంబం కోసం చేసే రిస్క్.. ఆ తర్వాత ఎదురయ్యే సమస్యల్ని ఆసక్తికరంగా లక్కీ భాస్కర్‌లో దర్శకుడు చూపించారు. ఈ సినిమా దుల్కర్ సల్మాన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
దీపావళికి విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచిన లక్కీ భాస్కర్ సినిమా ఈ నెలలోనే ఓటీటీలోకి రాబోతోంది. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమా అక్టోబరు 31న విడుదలై.. ఇప్పటికే రూ.100 కోట్లకి పైగా వసూళ్లని రాబట్టింది. దుల్కర్ సల్మాన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన లక్కీ భాస్కర్ మూవీ ఓటీటీ రైట్స్ కూడా భారీ ధరకి అమ్ముడుపోయాయి.
కథ ఏంటంటే?
వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన లక్కీ భాస్కర్ మూవీలో దుల్కర్ సల్మాన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన ఒక బ్యాంక్ ఉద్యోగిగా కనిపించారు. బ్యాంక్‌లో అతను పడిన కష్టానికి ప్రశంసలు వస్తాయి తప్ప.. ప్రమోషన్ రాదు. మరోవైపు కుటుంబ ఆర్థిక కష్టాలు చుట్టుముడుతుంటాయి. దాంతో.. ఫ్యామిలీ కోసం సాహసోపేతంగా ఒక రిస్క్ తీసుకుంటాడు? ఆ రిస్క్‌తో అతని ఫ్యామిలీ కష్టాలు తొలగిపోయాయా? లేదా రెట్టింపు అయ్యాయా? అనేది సినిమాలో చూడాలి.
అమరన్, క తో పోటీపడి హిట్
లక్కీ భాస్కర్ సినిమా రిలీజైన రోజే.. అమరన్, క సినిమాలు కూడా విడుదల అయ్యాయి. మూడు సినిమాలు పాజిటివ్ టాక్‌తో నడిచినా.. మిడిల్ క్లాస్ ఆడియెన్స్ పల్స్‌ను పట్టుకోవడంలో లక్కీ భాస్కర్ సక్సెస్ అయ్యింది. దుల్కర్ సల్మాన్‌కి సౌత్‌లో ఉన్న క్రేజ్, మీనాక్షి చౌదరికి యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ కూడా ఈ సినిమాకి ఉపయోగపడింది.
లక్కీ భాస్కర్ ఓటీటీలోకి ఎప్పుడంటే?
లక్కీ భాస్కర్ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. నవంబరు 30న ఈ సినిమాని స్ట్రీమింగ్‌కి ఉంచబోతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి డిసెంబరు మొదటి లేదా రెండో వారంలో స్ట్రీమింగ్‌కి రాబోతున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. కానీ.. సరిగ్గా 4 వారాల్లోనే క్రేజీ మూవీ స్ట్రీమింగ్‌కి రాబోతోంది.