SCR Special Trains : ఆర్‌ఆర్‌బీ అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్.. ప‌రీక్ష‌ల‌ కోసం 42 ప్ర‌త్యేక రైళ్లు.. పూర్తి వివరాలు ఇవే-south central railway to run 42 special trains for rrb exam candidates ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Scr Special Trains : ఆర్‌ఆర్‌బీ అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్.. ప‌రీక్ష‌ల‌ కోసం 42 ప్ర‌త్యేక రైళ్లు.. పూర్తి వివరాలు ఇవే

SCR Special Trains : ఆర్‌ఆర్‌బీ అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్.. ప‌రీక్ష‌ల‌ కోసం 42 ప్ర‌త్యేక రైళ్లు.. పూర్తి వివరాలు ఇవే

HT Telugu Desk HT Telugu
Nov 22, 2024 07:31 PM IST

SCR Special Trains : త్వరలో ఆర్ఆర్‌బీ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ పరీక్షలకు లక్షలాది మంది హాజరుకానున్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సౌత్ సెంట్రల్ రైల్వే చర్యలు చేపడుతోంది. ఆర్‌ఆర్‌బీ అభ్య‌ర్థుల‌ కోసం 42 ప్ర‌త్యేక రైళ్లు నడపాలని అధికారులు నిర్ణయించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

ప‌రీక్ష‌ల‌ కోసం 42 ప్ర‌త్యేక రైళ్లు
ప‌రీక్ష‌ల‌ కోసం 42 ప్ర‌త్యేక రైళ్లు

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) పరీక్షల‌కు రాసే అభ్య‌ర్థుల‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. 42 ఆర్ఆర్‌బీ ఎగ్జామినేష‌న్ స్పెష‌ల్ ట్రైన్స్ అందుబాటులోకి తెచ్చింది. ఈ రైళ్లు 23 నుంచి వివిధ తేదీల్లో రాక‌పోక‌లు సాగించనున్నాయి.

స్పెషల్ రైళ్లు..

1. గుంటూరు నుంచి బ‌య‌లుదేరే గుంటూరు- సికింద్రాబాద్ స్పెష‌ల్ (07101) రైలు న‌వంబ‌ర్ 24 నుంచి 29 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు గుంటూరులో ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభం అవుతుంది. సికింద్రాబాద్‌కు సాయంత్రం 4.15 గంట‌ల‌కు చేరుకుంది. ఈ రైలులో మొత్తం జ‌న‌ర‌ల్ సెకెండ్ క్లాస్ కోచ్‌లే ఉన్నాయి. అవి ఐదు స‌ర్వీసులు ఉంటాయి.

2. సికింద్రాబాద్ నుంచి బ‌య‌లుదేరే సికింద్రాబాద్- గుంటూరు స్పెష‌ల్ (07102) రైలు న‌వంబ‌ర్ 24 నుంచి 29 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సికింద్రాబాద్‌లో సాయంత్రం 5.45 గంట‌ల‌కు ప్రారంభం అవుతుంది. గుంటూరుకు మ‌రుస‌టి రోజు తెల్ల‌వారుజామున 2 గంట‌ల‌కు చేరుకుంది. ఈ రైలులో మొత్తం జ‌న‌ర‌ల్ సెకెండ్ క్లాస్ కోచ్‌లే ఉన్నాయి. ఇవీ స‌ర్వీసులు ఉంటాయి.

3. క‌రీంన‌గ‌ర్ నుంచి బ‌య‌లుదేరే క‌రీంన‌గ‌ర్‌- కాచిగూడ స్పెష‌ల్ (07103) రైలు న‌వంబ‌ర్ 24 నుంచి 28 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు క‌రీంన‌గ‌ర్‌లో ఉద‌యం 6 గంట‌ల‌కు ప్రారంభం అవుతుంది. కాచిగూడకు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు చేరుకుంది. ఈ రైలులో మొత్తం జ‌న‌ర‌ల్ సెకెండ్ క్లాస్ కోచ్‌లే ఉన్నాయి. ఇవి నాలుగు స‌ర్వీసులు ఉంటాయి.

4. కాచిగూడ నుంచి బ‌య‌లుదేరే కాచిగూడ- క‌రీంన‌గ‌ర్‌ స్పెష‌ల్ (07104) రైలు న‌వంబ‌ర్ 24 నుంచి 28 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు కాచిగూడలో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్రారంభం అవుతుంది. క‌రీంన‌గ‌ర్‌కు రాత్రి 11.15 గంట‌ల‌కు చేరుకుంది. ఈ రైలులో మొత్తం జ‌న‌ర‌ల్ సెకెండ్ క్లాస్ కోచ్‌లే ఉన్నాయి. ఇవి కూడా నాలుగు స‌ర్వీసులు ఉంటాయి.

5. నాందేడ్‌ నుంచి బ‌య‌లుదేరే నాందేడ్‌- తిరుప‌తి స్పెష‌ల్ (07105) రైలు న‌వంబ‌ర్ 23న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు నాందేడ్‌లో మ‌ధ్యాహ్నం 12.25 గంట‌ల‌కు ప్రారంభం అవుతుంది. తిరుప‌తికి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6.25 గంట‌ల‌కు చేరుకుంది. ఈ రైలులో సెకెండ్ ఏసీ, స్లీప‌ర్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ఒక‌ స‌ర్వీసు మాత్ర‌మే ఉంటుంది.

6. తిరుప‌తి నుంచి బ‌య‌లుదేరే తిరుప‌తి- నాందేడ్ స్పెష‌ల్ (07106) రైలు న‌వంబ‌ర్ 24న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు తిరుప‌తిలో మ‌ధ్యాహ్నం 3.35 గంట‌ల‌కు ప్రారంభం అవుతుంది. నాందేడ్‌కి మ‌రుస‌టి రోజు ఉద‌యం 8.35 గంట‌ల‌కు చేరుకుంది. ఈ రైలులో సెకెండ్ ఏసీ, స్లీప‌ర్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ఇది ఒక స‌ర్వీసు మాత్ర‌మే ఉంటుంది.

7. కాకినాడ టౌన్‌ నుంచి బ‌య‌లుదేరే కాకినాడ టౌన్‌- తిరుప‌తి స్పెష‌ల్ (07107) రైలు న‌వంబ‌ర్ 24 నుంచి న‌వంబ‌ర్ 29 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు కాకినాడ టౌన్‌లో ఉద‌యం 6.30 గంట‌ల‌కు ప్రారంభం అవుతుంది. తిరుప‌తికి సాయంత్రం 6.15 గంట‌ల‌కు చేరుకుంది. ఈ రైలులో స్లీప‌ర్, జ‌న‌ర‌ల్ సెకెండ్ క్లాస్ కోచ్‌లే ఉన్నాయి. నాలుగు స‌ర్వీసులు ఉంటాయి.

8. తిరుప‌తి నుంచి బ‌య‌లుదేరే తిరుప‌తి- కాకినాడ టౌన్ స్పెష‌ల్ (07108) రైలు న‌వంబ‌ర్ 24 నుంచి న‌వంబ‌ర్ 29 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు తిరుప‌తిలో రాత్రి 7.45 గంట‌ల‌కు ప్రారంభం అవుతుంది. కాకినాడ టౌన్‌కి మ‌రుస‌టి రోజు ఉద‌యం 9.45 గంట‌ల‌కు చేరుకుంది. ఈ రైలులో స్లీప‌ర్, జ‌న‌ర‌ల్ సెకెండ్ క్లాస్ కోచ్‌లే ఉన్నాయి. నాలుగు స‌ర్వీసులు ఉంటాయి.

9. కాచిగూడ నుంచి బ‌య‌లుదేరే కాచిగూడ- క‌ర్నూలు సిటీ స్పెష‌ల్ (07109) రైలు న‌వంబ‌ర్ 24 నుంచి 26 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు కాచిగూడలో ఉద‌యం 10.20 గంట‌ల‌కు ప్రారంభం అవుతుంది. క‌ర్నూలు సిటీకి మ‌ధ్యాహ్నం 2.15 గంట‌ల‌కు చేరుకుంది. ఈ రైలులో మొత్తం జ‌న‌ర‌ల్ సెకెండ్ క్లాస్ కోచ్‌లే ఉన్నాయి. ఇవి మూడు స‌ర్వీసులు ఉంటాయి.

10. క‌ర్నూలు సిటీ నుంచి బ‌య‌లుదేరే క‌ర్నూలు సిటీ- కాచిగూడ స్పెష‌ల్ (07110) రైలు న‌వంబ‌ర్ 24 నుంచి 26 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు క‌ర్నూలు సిటీలో మ‌ధ్యాహ్నం 3.20 గంట‌ల‌కు ప్రారంభం అవుతుంది. కాచిగూడ‌కి రాత్రి 8.40 గంట‌ల‌కు చేరుకుంది. ఈ రైలులో మొత్తం జ‌న‌ర‌ల్ సెకెండ్ క్లాస్ కోచ్‌లే ఉన్నాయి.

11. హూబ్లీ నుంచి బ‌య‌లుదేరే హూబ్లీ- క‌ర్నూలు సిటీ స్పెష‌ల్ (07315) రైలు న‌వంబ‌ర్ 24 నుంచి 27 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు హూబ్లీలో రాత్రి 8.15 గంట‌ల‌కు ప్రారంభం అవుతుంది. క‌ర్నూలు సిటీకి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 గంట‌ల‌కు చేరుకుంది. ఈ రైలులో మొత్తం జ‌న‌ర‌ల్ సెకెండ్ క్లాస్ కోచ్‌లే ఉన్నాయి. నాలుగు స‌ర్వీసులు ఉంటాయి.

12. క‌ర్నూలు సిటీ నుంచి బ‌య‌లుదేరే క‌ర్నూలు సిటీ- హూబ్లీ స్పెష‌ల్ (07316) రైలు న‌వంబ‌ర్ 25 నుంచి 28 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు క‌ర్నూలు సిటీలో రాత్రి 7.30 గంట‌ల‌కు ప్రారంభం అవుతుంది. హూబ్లీకి సాయంత్రం 4.15 గంట‌ల‌కు చేరుకుంది. ఈ రైలులో మొత్తం జ‌న‌ర‌ల్ సెకెండ్ క్లాస్ కోచ్‌లే ఉన్నాయి. ఇవి కూడా నాలుగు స‌ర్వీసులు ఉంటాయి.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner