Andhra Pradesh News Live November 22, 2024: Amaravati : వెల్త్, హెల్త్, హ్యాపీ విధానంతో విజన్- 2047 డాక్యుమెంట్.. 13 ముఖ్యమైన అంశాలు-today andhra pradesh news latest updates november 22 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live November 22, 2024: Amaravati : వెల్త్, హెల్త్, హ్యాపీ విధానంతో విజన్- 2047 డాక్యుమెంట్.. 13 ముఖ్యమైన అంశాలు

Amaravati : వెల్త్, హెల్త్, హ్యాపీ విధానంతో విజన్- 2047 డాక్యుమెంట్.. 13 ముఖ్యమైన అంశాలు

Andhra Pradesh News Live November 22, 2024: Amaravati : వెల్త్, హెల్త్, హ్యాపీ విధానంతో విజన్- 2047 డాక్యుమెంట్.. 13 ముఖ్యమైన అంశాలు

04:17 PM ISTNov 22, 2024 09:47 PM HT Telugu Desk
  • Share on Facebook
04:17 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Fri, 22 Nov 202404:17 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Amaravati : వెల్త్, హెల్త్, హ్యాపీ విధానంతో విజన్- 2047 డాక్యుమెంట్.. 13 ముఖ్యమైన అంశాలు

  • Amaravati : వెల్త్, హెల్త్, హ్యాపీనెస్.. ఇదే స్వర్ణాంధ్రప్రదేశ్- 2047 విజన్ అని చంద్రబాబు ప్రకటించారు. పది సూత్రాలతో విజన్ రూపకల్పన జరుగుతోందన్నారు. మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్య శిక్షణ నిత్యం జరగాలన్న ముఖ్యమంత్రి.. పేదరిక నిర్మాలన, సమ్మెళిత వృద్ధి, ఉపాధి కల్పనే లక్ష్యమని స్పష్టం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 22 Nov 202403:39 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Nandigam Suresh Case : మాజీ ఎంపీ నందిగం సురేష్ కేసులో కీల‌క ప‌రిణామం.. ఏపీ ప్ర‌భుత్వానికి సుప్రీం నోటీసులు

  • Nandigam Suresh Case : వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటిష‌న్ విచార‌ణ‌లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్ర‌తివాది ఏపీ ప్ర‌భుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. డిసెంబ‌ర్ 16లోగా అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని సూచించింది. త‌దుప‌రి విచార‌ణ‌ను డిసెంబ‌ర్ 16కు వాయిదా వేసింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 22 Nov 202402:01 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: SCR Special Trains : ఆర్‌ఆర్‌బీ అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్.. ప‌రీక్ష‌ల‌ కోసం 42 ప్ర‌త్యేక రైళ్లు.. పూర్తి వివరాలు ఇవే

  • SCR Special Trains : త్వరలో ఆర్ఆర్‌బీ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ పరీక్షలకు లక్షలాది మంది హాజరుకానున్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సౌత్ సెంట్రల్ రైల్వే చర్యలు చేపడుతోంది. ఆర్‌ఆర్‌బీ అభ్య‌ర్థుల‌ కోసం 42 ప్ర‌త్యేక రైళ్లు నడపాలని అధికారులు నిర్ణయించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 22 Nov 202412:23 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Vijayawada : విజ‌య‌వాడ ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలు.. జీతం రూ.30 వేలు.. ఈ లింక్ ద్వారా అప్లై చేసుకోండి

  • Vijayawada : గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://aaiclas.aero/careeruser/login ద్వారా అప్లై చేసుకోవాలి. జీతం రూ.30 నుంచి 34 వేలు ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 22 Nov 202410:58 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Assembly : ఆంధ్రప్రదేశ్ పీఏసీ ఛైర్మన్‌గా పులపర్తి రామాంజనేయులు.. ఉత్కంఠకు తెర!

  • AP Assembly : అసెంబ్లీలో పీఏసీ ఎన్నిక ముగిసింది. కూటమి ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోగా.. వైసీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్‌ను బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు. సంఖ్యాబలం లేదనడంతో బాయ్ కాట్ చేశారు. ఇటు పీఏసీ ఛైర్మన్‌గా పులపర్తి రామాంజనేయులు ఎన్నికయ్యారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 22 Nov 202409:29 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: PM SVANidhi Scheme : పీఎం స్వనిధి పథకం.. పేదలకు వరం.. ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

  • PM SVANidhi Scheme : కరోనా తర్వాత వీధి వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది. వారిని ఆదుకోవడానికి కేంద్రం ఎన్నో ప్రయత్నాలు చేసింది. వారికి రుణాలు ఇవ్వడానికి పీఎం స్వనిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఎలాంటి షూరిటీ లేకుండా రుణం పొందవచ్చు. ఈ పథకం అమలులో ఏపీ ముందంజలో ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 22 Nov 202408:58 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Kadapa Crime : క‌డప జిల్లాలో ఘోరం.. బాలిక‌ను బెదిరించి అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు న‌మోదు

  • Kadapa Crime : క‌డ‌ప జిల్లాలో ఘోర‌ం జరిగింది. బాలిక‌ను బెదిరించి ఇద్ద‌రు యువ‌కులు అత్యాచారానికి పాల్ప‌డ్డారు. సెల్‌ఫోన్‌లో చిత్రీక‌రించిన వీడియో చూపించి, బాలిక‌ను లొంగ‌దీసుకున్నారు. బాలిక‌పై అత్యాచారం చేసిన ఇద్దరు యువ‌కులు, వారికి స‌హ‌క‌రించిన మ‌రో యువ‌కుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 22 Nov 202408:00 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Cyber Safety: సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా ఈ జాగ్రత్తలు పాటించండి.. మోసపోతే మొదటి గంటలోనే ఫిర్యాదు చేయండి…

  • Cyber Safety: సైబర్‌ నేరాల బారిన పడి మోసపోతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అధికలాభాలు, ఓటీపీ, ఏపీకే ఫైల్స్‌, డిజిటల్‌ అరెస్ట్‌ ఇలా రకరకాలుగా నేరాలకు పాల్పడుతున్నారు. మోస పోకుండా జాగ్రత్త పడటంతో పాటు పొరపాటు జరిగిన గంటలోపు ఫిర్యాదు చేస్తే పోయిన సొమ్ము వెనక్కి వచ్చే అవకాశాలు ఎక్కువ.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 22 Nov 202405:45 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: PM Scholorship: ప్రధానమంత్రి స్కాలర్‌షిప్‌ స్కీమ్‌లో ఏటా రూ.30-36 వేల స్కాలర్‌షిప్‌, ఎవరికి లభిస్తుందంటే..

  • PM Scholorship: కేంద్రీయ సైనిక బోర్డ్‌ ద్వారా అందించే ప్రధానమంత్రి స్కాలర్ షిప్ స్కీమ్‌కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ స్కీమ్‌ ద్వారా ప్రొఫెషనల్, టెక్నికల్ కోర్సులు అభ్యసిస్తున్న అర్హత కలిగిన అభ్యర్థులకు స్కాలర్‌‎షిప్ అందిస్తారు. నవంబర్‌ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 22 Nov 202404:37 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Ysrcp on Adani Issue: అదానీతో వివాదంతో సంబంధం లేదు, ఒప్పందం సెకీతోనే అంటున్న వైసీపీ

  • Ysrcp on Adani Issue: సోలార్‌ విద్యుత్ ఒప్పందాల్లో ముడుపులు చెల్లించారనే ఆరోపణలపై అమెరికాలో అభియోగాలు నమోదు చేయడం, అందులో  పెద్ద ఎత్తున ముడుపులు ఆంధ్రప్రదేశ్‌లో 2021లో అధికారంలో ఉన్న వారికి దక్కాయనే ఆరోపణల నేపథ్యంలో వైసీపీ స్పందించింది. తాము సెకీతోనే ఒప్పందం చేసుకున్నామని చెబుతోంది. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 22 Nov 202402:20 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Gowtam Adani: ఏపీలో గౌతమ్ అదానీ ప్రకంపనలు.. అమెరికా అభియోగాల్లో జగన్ ప్రస్తావన.. నో కామెంట్ అంటున్న టీడీపీ

  • Gowtam Adani: భారత్‌లో విద్యుత్‌ ఒప్పందాలకు 250 మిలియన్ డాలర్ల లంచం ఇవ్వజూపారనే అభియోగాలతో ఆంధ్రప్రదేశ్‌ పేరు ప్రస్తావనకు రావడంతో దుమారం రేగుతోంది. అమెరికాలో నమోదైన అభియోగాల్లో వైసీపీ అధినేత జగన్‌ పేరు తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంపై టీడీపీ నో కామెంట్‌ అంటుంటే, సెకీతోనే ఒప్పందమని వైసీపీ చెబుతోంది. 

పూర్తి స్టోరీ చదవండి

Fri, 22 Nov 202401:57 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Cyclone Alert: ఏపీ రైతలకు బిగ్ అలర్ట్‌, బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీకి తుఫాను ముప్పు

  • AP Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌ రైతులకు వాతావరణ శాఖ అలర్ట్‌ జారీ చేసింది. బంగాళాఖాతంలో శనివారం ఏర్పాడే అల్పపీడనం క్రమంగా తుఫానుగా మారే ప్రమాదం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలకు వానగండం పొంచి ఉంది.  పంటలు చేతికొచ్చే కాలం కావడంతో అప్రమత్తంగా ఉండాలని  ప్రభుత్వం హెచ్చరించింది. 
పూర్తి స్టోరీ చదవండి