Karma Balance: దేవాలయాల్లో ఈ పనులు చేసిన వారికి అకాల మరణం తప్పదా?
Karma Balance: కర్మ ఫలితం అనుభవించక తప్పదు. సత్కర్మల ఫలితాలు ఆయుష్షును పెంచితే, అశుభమని తెలిసి కూడా చేసే దుష్కర్మలు ఆయువును తగ్గించి అర్ధాయుష్షుతో చనిపోయేందుకు కారణమవుతాయి.
పుట్టుక చావులు అనేవి మన చేతులో లేవు అంటారు. కానీ నిజానికి మనం చేసే కొన్ని పనుల కారణంగా మన మరణాన్ని మనం కొనితెచ్చుకన్న వారం అవుతామని హిందూ మతం చెబుతోంది. దీనే అకాల మరణం అంటారు. హిందూయిజం ప్రకారం వ్యక్తి జీవితంలో చేసే కొన్ని పనులు అశుభకరమైనవి. కొన్ని సందర్భాల్లో ఇవి అకాల మరణాన్ని, అర్ధాయిష్షుకు దారితీస్తాయి. ప్రతికూల శక్తులను ఆకర్షించి, కర్మ సమతుల్యతను నాశనం చేసి అర్థాంతరంగా చావును తెచ్చిపెడతాయి. ప్రశాంతమైన జీవితాన్ని దెబ్బతీసి ఊహించని పరిమాణాలకు దారితీస్తుంది. హిందూ మతం ప్రకారం అకాల మరణానికి దారితీసే పనులేంటో తెలుసుకుందాం.
అకాల మరణానికి దారి తీసే చర్యలు..
1. నాస్తికత్వం:
మత గ్రంథాలను విస్మరించడం అనైతిక చర్య అని హిందూయిజం చెబుతోంది. వీటితో పాటు నాస్తికత్వాన్ని ప్రోత్సహించడం, గురువును అవమానించడం వంటి అనైతిక ప్రవర్తన కారణంగా అకాల మరణం సంభవిస్తుంది. ధర్మం, ఆధ్యాత్మిక సూత్రాలకు విరుద్ధంగా చేసే చర్యల కారణంగా వ్యక్తి జీవితకాలం తగ్గిపోతుంది. ఇది చివరికి అకాల మరణానికి దారితీస్తుంది.
2. సాయంత్రం పూట ఈ పనులు చేయడం:
సూర్యోదయం లేదా సూర్యాస్తమయం సమయాల్లో తినడం, నిద్రపోవడం, లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం చాలా అశుభమని హిందూ మతాలు చెబుతున్నాయి.ఈ చర్యలు అర్థాయుష్షును పెంచి అకాల మరణానికి కారణమవుతాయి. ఈ సమయాన్ని ఆరాధన, ధ్యానం వంటి ఆధ్మాత్మిక సాధనలో కోసం ఉపయోగించడం వల్ల సంపన్నమైన జీవితంలో పాటు సంతోషం కలుగుతాయి.
3. సూర్య భగవానుడిని అవమానించడం:
సూర్య గ్రహణ సమయంలో లేదా మిట్ట మధ్యాహ్న వేళలో సూర్యుడ్ని చూడడం, సూర్యుడికి ఎదురుగా మూత్ర విసర్జన చేయడం లేదా పైకి చూస్తూ ఉమ్మి వేయడం వంటివి చేస్తుండటం ఆయనను అవమానించినట్లే అవుతుంది. ఇటువంటి చర్యలు అశుభమైనవిగా పరిగణించడమే కాకుండా ఆయుష్షును తగ్గిస్తాయి. ఈ పనులకు పాల్పడిన వారికి దీర్ఘాయువు ఉన్నప్పటికీ చేసిన కర్మ ఫలితంగా అర్ధాయిష్షుతో మరణిస్తారట.
4. అక్రమ లేదా వివాహేతర సంబంధాలు:
జీవిత భాగస్వామిని మోసం చేస్తూ మరొకరు అర్ధాంగితో లేదా భర్తతో వివాహేతర సంబంధం కొనసాగించడం ముమ్మాటికీ అశుభ కార్యమే. పురాణాల ప్రకారం, ఇటువంటి మోసాలకు లేదా ఘోరాలకు పాల్పడిన వారు వ్యభిచారం చేసినట్లే లెక్క. అలాంటి వారు నరకంలో కొన్నేళ్లపాటు బాధలను శిక్షలుగా ఎదుర్కోవలసి ఉంటుంది.
5. గౌరవ ప్రదమైన వ్యక్తులను అవమానించడం:
సాధువులను, వైష్ణవులను, ఆచార్యులను అవమానించడం అశుభ కార్యమే. వారితో పాటు గర్భిణీలు, స్త్రీలు, వృద్ధులు అయిన బలహీనులను కించపరచడం కూడా ఆయుష్షు తగ్గిపోయేలా చేస్తుంది. సాయం చేయగలిగే స్థాయిలో ఉండి, సేవ చేయగలిగిన అధికారంలో ఉండి కూడా దుర్వినియోగ పరిచేలా వ్యవహరించడం ఆ వ్యక్తిపై తీవ్ర పరిణామాలు కలిగేలా చేస్తుంది.
6. ఇతరుల బట్టలు లేదా పాదరక్షలు ధరించడం:
ఒకరు ఇంకొకరి దుస్తులను అంగీకరించి తొడుక్కోరాదు. ఒకవేళ ధరించాల్సి వస్తే తమ గురువు, దైవం నుంచి వచ్చిన కానుకలను మాత్రమే వినియోగించాలి. అలా కాకుండా ఇతరుల వస్తువులను వాడుకోవడం అనుచితం అవుతుంది. పైగా ఇది ప్రతికూల శక్తులను ఆకర్షించి అశుభాలకు కారణం అవుతుంది.
7. దేవాలయాల పవిత్రతకు భంగం కలిగించడం:
శుద్ధిగా లేకుండా దైవారాధనకు ఉపక్రమించడం తప్పు. స్నానం చేయకుండా భక్తి క్రియలకు పాల్పడటానికి అనుమతి ఉండదు. దేవాలయాలో సమీపంలో చెట్ల కింద విశ్రాంతి తీసుకోవడం కూడా మీ జీవితాన్ని తగ్గిస్తుంది.