Vijayawada : విజయవాడ ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలు.. జీతం రూ.30 వేలు.. ఈ లింక్ ద్వారా అప్లై చేసుకోండి
Vijayawada : గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://aaiclas.aero/careeruser/login ద్వారా అప్లై చేసుకోవాలి. జీతం రూ.30 నుంచి 34 వేలు ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు.
విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్‌పోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. దరఖాస్తు దాఖలు చేసేందుకు డిసెంబర్ 10 ఆఖరు తేదీగా నిర్ణయించారు. దరఖాస్తును ఆన్‌లైన్‌లోనే దాఖాలు చేయాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు 274..
సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం ఖాళీలు 274 ఉన్నాయి. విజయవాడతో పాటు పోర్ట్ బ్లెయిర్, సూరత్, గోవా, లేహ్ వంటి ఎయిర్‌పోర్టుల్లో కూడా.. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా కింద పని చేసే కార్గో లాజిస్టిక్ అండ్ అలైయిడ్ సర్వీస్ కంపెనీ లిమిటెడ్ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది.
జీతం..
నెలవారీ జీతం రూ.30 వేల నుంచి రూ.34 వేలు వరకు ఉంటుంది. గుర్తింపు పొందిన యూనివర్శిటీ, విద్యా సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ జనరల్ కేటగిరీ అభ్యర్థులు 60 శాతం మార్కులతోనూ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో పూర్తి చేయాలి. హిందీ, ఇంగ్లీష్ చదవాలి, మాట్లాడాలి. స్థానిక భాషలో మాట్లాడాలి. 2024 నవంబర్ 1 నాటికి గరిష్టంగా 27 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు ఫీజు..
దరఖాస్తు దాఖలు చేసేందుకు జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు రూ.750 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఉమెన్ కేటగిరీ అభ్యర్థులకు రూ.100 ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ..
సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు కంటి, ఇతర వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. దరఖాస్తును డిసెంబర్ 10 సాయంత్రం 5 గంటల లోపు దాఖలు చేయాలి. దరఖాస్తును అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ https://aaiclas.aero/careeruser/login ద్వారా దాఖలు చేయాలి.
జత చేయాల్సిన పత్రాలు..
1. పదో తరగతి మార్కుల మెమో
2. గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్
3. గ్రాడ్యుయేషన్ మార్కుల జాబితా
4. కుల ధ్రువీకరణ పత్రం
5. ఆధార్ కార్డు
6. పాస్‌పోర్టు సైజ్ ఫోటో
7. సంతకం
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)