Telugu Cinema News Live November 22, 2024: Game Changer: అమెరికా గడ్డపై రామ్ చరణ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ అరుదైన ఘనత.. ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్ సృష్టించే ఛాన్స్
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Fri, 22 Nov 202403:02 PM IST
Ram Charan: గేమ్ ఛేంజర్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ అమెరికాలో నిర్వహించబోతున్నారు. ఇప్పటి వరకూ అమెరికాలో తెలుగు సినిమా ప్రమోషన్స్ చేశారు. కానీ.. ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతుండటం ఇదే తొలిసారి.
Fri, 22 Nov 202401:26 PM IST
Kishkindha Kaandam OTT: తుపాకీ మిస్సింగ్‌తో మొదలయ్యే కథ.. ఊహించని మలుపులు తిరుగుతూ చివరికి ఒక క్రైమ్‌ను తెరపైకి తీసుకొస్తుంది. ఓటీటీలో దుమ్ముదులిపేస్తున్న కిష్కింద కాండం మూవీని చూసి ఎంజాయ్ చేయండి.
Fri, 22 Nov 202412:30 PM IST
Lucky Baskhar OTT Date: లక్కీ భాస్కర్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై క్లారిటీ వచ్చేసింది. ఒక సాధారణ బ్యాంక్ ఉద్యోగి తన కుటుంబం కోసం చేసే రిస్క్.. ఆ తర్వాత ఎదురయ్యే సమస్యల్ని ఆసక్తికరంగా లక్కీ భాస్కర్‌లో దర్శకుడు చూపించారు. ఈ సినిమా దుల్కర్ సల్మాన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
Fri, 22 Nov 202411:53 AM IST
- OTT Mystery Thriller Web Series: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. తాజాగా శుక్రవారం (నవంబర్ 22) ఈ సిరీస్ ట్రైలర్ రిలీజైంది. ఈ వెబ్ సిరీస్ పేరు హరికథ.
Fri, 22 Nov 202411:15 AM IST
Vishwak Sen: విష్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఓ మంచి ఫ్యాన్సీ రేటుకి ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయాయట. ఇక మెకానిక్ రాకీ ఓటీటీలోకి ఎప్పుడు రానుందంటే?
Fri, 22 Nov 202410:19 AM IST
- Nayanthara Vignesh Shivan: నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ ఢిల్లీలో డిన్నర్ డేట్ కు వెళ్లారు. అయితే వాళ్లు వెళ్లిన రెస్టారెంట్ ఫుల్ గా ఉండటంతో అరగంటసేపు వేచి చూసి మరీ డిన్నర్ చేయడం విశేషం. ఈ వీడియో వైరల్ అవుతోంది.
Fri, 22 Nov 202409:59 AM IST
- Bigg Boss Telugu 8 November 22 Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో ఫైనల్ మెగా చీఫ్ టాస్క్‌లో యాంకర్ విష్ణుప్రియ బండారం బయటపెట్టేసింది జబర్దస్త్ రోహిణి. బిగ్ బాస్ తెలుగు 8 నవంబర్ 22 ఎపిసోడ్ ప్రోమో వీడియోలో విష్ణుప్రియ లవ్ ట్రాక్ ప్లాన్ అని రోహిణి చెప్పినట్లు చూపించారు.
Fri, 22 Nov 202409:35 AM IST
- OTT Horror Movie: ఓటీటీలోకి మూడు నెలల తర్వాత ఓ హారర్ మూవీ ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. రూ.500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. రూ.2200 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.
Fri, 22 Nov 202409:13 AM IST
Thangalaan OTT: విక్రమ్ తంగలాన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చినట్లు సమాచారం. డిసెంబర్ నెలలోనే ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చెబుతోన్నారు. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది.
Fri, 22 Nov 202408:47 AM IST
- Laggam OTT Streaming: ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ లగ్గం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. 9.6 ఐఎమ్‌డీబీ రేటింగ్ సాధించుకున్న లగ్గం మూవీ దాదాపుగా 22 రోజుల్లో ఓటీటీ రిలీజ్ అయింది. సాయి రోనక్, రాజేంద్ర ప్రసాద్ నటించిన లగ్గం ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
Fri, 22 Nov 202408:40 AM IST
- Zee Telugu Serial: జీ తెలుగు ఛానెల్ ఇప్పుడు మరో టాప్ సీరియల్ ను కూడా ఆదివారం టెలికాస్ట్ చేయబోతోంది. కొన్నాళ్లుగా తమ ఛానెల్లో వస్తున్న చాలా సీరియల్స్ ను సోమవారం నుంచి ఆదివారం వరకు అసలు గ్యాప్ లేకుండా టెలికాస్ట్ చేస్తున్న విషయం తెలుసు కదా.
Fri, 22 Nov 202407:33 AM IST
- Ashok Galla About Devaki Nandana Vasudeva Movie: మహేశ్ బాబు మేనల్లుడు హీరో అశోక్ గల్లా నటించిన రెండో సినిమా దేవకీ నందన వాసుదేవ. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇవాళ విడుదల అయింది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా దేవకీ నందన వాసుదేవ మూవీ విశేషాలను చెప్పాడు అశోక్ గల్లా.
Fri, 22 Nov 202406:31 AM IST
- OTT Tamil Movie: తమిళ సోషల్ డ్రామా లైన్‌మ్యాన్ నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. వెటరన్ యాక్టర్ ఛార్లీ నటించిన ఈ సినిమా నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కడం విశేషం. శుక్రవారం (నవంబర్ 22) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
Fri, 22 Nov 202406:18 AM IST
Today OTT Release Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 35 సినిమాలు రిలీజ్‌కు వచ్చేశాయి. వీటన్నింటిలో 9 చాలా స్పెషల్‌గా ఉంటే అందులోనూ రెండు తెలుగు స్ట్రైట్ సినిమాలు ఉంటే మరో రెండు తెలుగు డబ్బింగ్ మూవీస్ ఉన్నాయి. అవన్నీ హారర్, బోల్డ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ జోనర్స్‌తో ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.
Fri, 22 Nov 202405:47 AM IST
Mechanic Rocky Review: విశ్వక్‌సేన్ హీరోగా నటించిన థ్రిల్లర్ మూవీ మెకానిక్ రాకీ శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Fri, 22 Nov 202405:32 AM IST
- OTT Malayalam Releases: ఓటీటీల్లోకి డిసెంబర్ లో కొన్ని మోస్ట్ అవేటెడ్ మలయాళం సినిమాలు రాబోతున్నాయి. వీటిలో థ్రిల్లర్, యాక్షన్ థ్రిల్లర్, కామెడీలాంటి జానర్ల సినిమాలు ఉన్నాయి. మరి ఆ మూవీస్ ఏంటో చూసేయండి.
Fri, 22 Nov 202405:03 AM IST
Satyadev About Zebra Movie Story: హీరో సత్యదేవ్ నటించిన లేటెస్ట్ బ్యాంకర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ జీబ్రా. ఇవాళ థియేటర్లలో విడుదలవుతున్న జీబ్రా మూవీ విశేషాలను పంచుకున్నారు సత్యదేవ్. ఏటీఎంలో డబ్బులు తీసినప్పుడు ఓ సౌండ్ వస్తుందని, ఆ సౌండ్ వెనుక జరిగేదే జీబ్రా మూవీ అని సత్యదేవ్ చెప్పాడు.
Fri, 22 Nov 202404:34 AM IST
Telugu OTT: తెలుగు రొమాంటిక్ మూవీ రవికుల రఘురామ థియేటర్లలో రిలీజైన ఎనిమిది నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. సన్స్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో గౌతమ్ వర్మ, దీప్సికా ఉమాపతి హీరోహీరోయిన్లుగా నటించారు.
Fri, 22 Nov 202403:40 AM IST
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడి గంటలు నవంబర్ 22 ఎపిసోడ్‌లో చెప్పపెట్టకుండా ఇంటికొచ్చిన తల్లి నిచూసి రోహిణి షాకవుతుంది. రోహిణి ఆరోగ్యం గురించి సుగుణ పడుతోన్న కంగారు చూసి ప్రభావతి, మీనా డౌట్‌పడతారు. నాన్నమ్మ పిలవడంతో ఆనందంగా ఇంటికొచ్చిన రవిని బాలు బయటకు గెంటేస్తాడు.
Fri, 22 Nov 202402:55 AM IST
- Vijay Devarakonda Release Sarangapani Jathakam Teaser: ప్రియదర్శి నటించిన మరొ సరికొత్త కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ సారంగపాణి జాతకం. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన సారంగపాణి జాతకం టీజర్‌ను విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. సారంగపాణి జాతకం టీజర్ విశేషాల్లోకి వెళితే..
Fri, 22 Nov 202402:20 AM IST
Brahmamudi Serial November 22nd Episode: బ్రహ్మముడి నవంబర్ 22 ఎపిసోడ్‌లో కావ్యను మోసం చేసి రాజ్ గెలవడంపై సీతారామయ్య నిలదీస్తాడు. కావ్యను ఇంటికి తీసుకురమ్మని అంటాడు. కావాలంటే కావ్యకు విడాకులు ఇస్తాను కానీ, ఇంటికి మాత్రం తీసుకురానని రాజ్ తెగేసి చెబుతాడు. మరోవైపు కనకంకు అపర్ణ మాట ఇస్తుంది.
Fri, 22 Nov 202402:09 AM IST
- Karthika Deepam November 22st Episode: కార్తీక్ దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. కార్తీక్ పుట్టిన రోజు సందర్భంగా తన తాతకు తెలియకుండా గుడికి వస్తుంది జ్యోత్స్న. దీపను బాధపెట్టాలని చూస్తుంది. కార్తీక్ జ్యోత్స్నకు గట్టిగా తగిలేలా మాటలు అంటాడు. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.
Fri, 22 Nov 202401:17 AM IST
Star Maa Serial: ఇల్లు ఇల్లాలు పిల్లలు తర్వాత మరో కొత్త సీరియల్‌ను స్టార్ మా అనౌన్స్‌చేసింది. నువ్వుంటే నా జతగా పేరుతో తెరకెక్కుతోన్న ఈ సీరియల్‌లో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 ఫేమ్ అర్జున్ కళ్యాణ్, బెంగాళీ నటి అనుమితా దత్తా కీలక పాత్రల్లో నటిస్తోన్నారు.
Fri, 22 Nov 202401:08 AM IST
Bigg Boss Telugu 8 November 21 Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 టీమ్ వేసిన అతి చెత్త ప్లాన్‌ను దారుణంగా తిప్పి కొట్టాడు గౌతమ్ కృష్ణ. దాంతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు పడినట్లు అయినట్లు అయింది. ఆఖరి మెగా చీఫ్ టాస్క్‌లో తన తెలివితో నిజంగా మాస్టర్ మైండ్ అనిపించుకున్నాడు గౌతమ్.
Fri, 22 Nov 202412:27 AM IST
Mechanic Rockey Twitter Review: విశ్వక్‌సేన్ హీరోగా నటించిన మెకానిక్ రాకీ మూవీ శుక్రవారం రిలీజైంది. ఈ యాక్షన్ కామెడీ మూవీలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు.