Weight Loss: తేనె, పసుపు కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారా? వీటిని ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు?
Weight Loss - Honey Turmeric: బరువు తగ్గేందుకు పసుపు, తేనె రెండూ ఉపకరిస్తాయి. అయితే, వీటిని కలిపి ఎలా తీసుకోవాలనే సందేహం ఉంటుంది. వీటిని కొన్ని విధాలుగా తీసుకుంటే మేలు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు అందుకు తగ్గట్టుగా డైట్ పాటించాలి. వెయిల్ లాస్ అయ్యేందుకు తీసుకునే ఆహారం చాలా ముఖ్యం. డైట్‍లో ఏం తీసుకుంటున్నామనేది జాగ్రత్త వహిస్తూ ఉండాలి. కొన్ని ప్రత్యేకమైన చిట్కాలు పాటించడం వల్ల బరువు వేగంగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పసుపు, తేనె కూడా బరువు తగ్గేందుకు ఉపకరిస్తాయి. ఇవి వెయిట్ లాస్‍కు ఎలా ఉపయోగపడతాయో.. కలిపి ఎలా తీసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
తెనే, పసుపు వెయిట్ లాస్ ఉపయోగాలు ఇలా..
పసుపులో యాంటీ ఇన్‍ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. శరీరంలో ఇన్‍ఫ్లమేషన్ తగ్గించి.. ఊబకాయం తక్కువవడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. జీవక్రియను, జీర్ణశక్తిని పసులు మెరుగుపరుస్తుంది. ఆకలి కలిగించే హార్మోన్లను కంట్రోల్ చేస్తుంది. వీటి ద్వారా బరువు తగ్గేందుకు పసుపు సహకరిస్తుంది.
తేనెలో గ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. చెక్కెరకు సహజమైన ప్రత్నామ్నాయంగా ఉంటుంది. ఇది తీసుకుంటే తీపి పదార్థాలను తినాలనే ఆశ తగ్గుతుంది. దీంతో క్యాలరీలు ఎక్కువగా తీసుకోకుండా చేయగలదు. నిద్ర కూడా బాగా పట్టేలా చేస్తుంది. శరీరానికి కీలకమైన పోషకాలు అందిస్తుంది. అందుకే తేనె కూడా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. తేనె, పసుపు కలిపి తీసుకుంటే వేగంగా బరువు తగ్గేందుకు తోడ్పడతాయి.
తెనే, పసుపును కలిపి తీసుకునే విధానాలు
గోల్డెన్ మిల్క్: గోరువెచ్చని ఓ గ్లాసు పాలల్లో టీస్పూన్ పసుపు, కాస్త మిరియాల పొడి, తీపికి సరిపడా తేనె వేసుకోవాలి. ఇది రాత్రి నిద్రపోయే ముందు తాగితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. రాత్రి ఈ గోల్డెన్ మిల్క్ తాగితే.. రాత్రివేళ జీర్ణం మెరుగ్గా అవుతుంది. శరీరం, మైండ్ ప్రశాంతంగా మారుతుంది. బరువు తగ్గేందుకు ఈ డ్రింక్ చాలా ఉపకరిస్తుంది. కావాలంటే ఉదయం కూడా ఈ డ్రింక్ తీసుకోవచ్చు.
పసుపు టీ: పసుపు టీ తాగేందుకు రుచిగా ఉంటుంది. ముందుగా ఓ కప్ నీటిలో ఓ టీస్పూన్ పసుపు వేసుకొని మరిగించుకోవాలి. దాంట్లో కాస్త నిమ్మరసం పిండుకోవాలి. ఆ టీని కాస్త చల్లార్చుకోని చివర్లో ఓ స్పూన్ తేనె కలుపుకోవాలి. ఈ పసుపు టీ తాగితే జీవక్రియ చాలా మెరుగవుతుంది. క్యాలరీలు ఎక్కువగా బర్న్ అయ్యేందుకు ఈ టీ ఉపయోగపడుతుంది. జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. ఆకలిని కూడా తగ్గిస్తుంది. వెయిట్ లాస్ డైట్‍లో ఈ డ్రింక్ యాడ్ చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది.
సలాడ్లలో..: కూరగాయలు, ఆకుకూరలతో చేసుకునే సలాడ్లలో తేనె, పసుపు వేసుకోవడం చాలా మేలు. సలాడ్‍కు మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. సలాడ్‍లో కాస్త పసుపు, తేనెతో పాటు కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవాలి. దీనివల్ల బరువు తగ్గేందుకు మరింత ఉపకరిస్తుంది. సలాడ్ ఎక్కువ హెల్దీగా పోషకాలతో ఉండటంతో పాటు టేస్ట్ కూడా పెరుగుతుంది.
స్మూతీల్లో..: కూరగాయలతో చేసుకునే స్మూతీల్లో పసుపు వేస్తే రుచితో పాటు కలర్ కూడా యాడ్ అవుతుంది. తేనె మంచి టేస్ట్ ఇస్తుంది. అందుకే ఈ రెండింటినీ కలిపి స్మూతీల్లో వేసుకోవచ్చు. స్మూతీ పోషక విలువలు కూడా పెరుగుతాయి.
టాపిక్