Satyadev: పగ కోసం మొక్కను పెంచడం.. మలయాళ హీరోయిన్‌పై సత్య దేవ్ కామెంట్స్-actor satyadev comments on athira raj and krishnamma movie malayalam heroine athira raj ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Satyadev: పగ కోసం మొక్కను పెంచడం.. మలయాళ హీరోయిన్‌పై సత్య దేవ్ కామెంట్స్

Satyadev: పగ కోసం మొక్కను పెంచడం.. మలయాళ హీరోయిన్‌పై సత్య దేవ్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
May 09, 2024 02:23 PM IST

Satyadev About Athira Raj Krishnamma: యంగ్ హీరో సత్యదేవ్ నటిస్తున్న మరో డిఫరెంట్ మూవీ కృష్ణమ్మ. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మలయాళ నటి అథిరా రాజ్, కృష్ణమ్మ సినిమాపై ఆసక్తికర విశేషాలు చెప్పారు సత్య దేవ్. ఆయన చెప్పిన విశేషాల్లోకి వెళితే..

పగ కోసం మొక్కను పెంచడం.. మలయాళ హీరోయిన్‌పై సత్య దేవ్ కామెంట్స్
పగ కోసం మొక్కను పెంచడం.. మలయాళ హీరోయిన్‌పై సత్య దేవ్ కామెంట్స్

Satyadev Athira Raj Krishnamma Movie: వెర్స‌టైల్ హీరో స‌త్య‌దేవ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం కృష్ణ‌మ్మ‌. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమాను మే 10న భారీ ఎత్తున‌ విడుదల చేస్తున్నాయి.

ఇదివరకు విడుదలైన కృష్ణమ్మ ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చారు సత్యదేవ్. ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

కృష్ణ, విజయవాడ అంటే పాలిటిక్స్ ఇవన్నీ వినిపిస్తాయి కదా?

విజయవాడ అంటే పాలిటిక్స్, రౌడీయిజం అని చెప్తారు. కానీ, అది కాదు అని చెప్పే కథే ఈ కృష్ణమ్మ. ఇది ముఖ్యంగా ముగ్గురు స్నేహితుల కథ. వాళ్ల చిన్న జీవితాలు, వాళ్లకి ఒక మంచి ఫ్యామిలీ ఉండాలి అనుకునే ముగ్గురు ఫ్రెండ్స్. కానీ అలాంటి డ్రీమ్ చెడగొడితే వీళ్లు ఏం చేశారు అనేదే ఉంటుంది. దీంట్లో రౌడీయిజం, పాలిటిక్స్ ఏం ఉండవు.

యాక్షన్స్, ఫ్రెండ్‌షిప్ రెండు ఎలా మేనేజ్ చేశారు?

కథ మెయిన్ లైఫ్ గురించే ఉంటుంది. కాకపోతే సందర్భానికి తగ్గట్టు, హీరో బాధ నుంచి వచ్చే రివెంజ్‌లో యాక్షన్ సీక్వెన్స్ వస్తాయి. అంతే కానీ కావాలని ఫైట్ సీన్స్ పెట్టలేదు ఎక్కడా కూడా.

ఇది రియల్ క్యారెక్టరా లేక ఫిక్షనల్ క్యారెక్టరా?

వించిపేట భద్ర అనే క్యారెక్టర్ కోసం, విజయవాడ స్లాంగ్ కోసం, ఆ బాడీ లాంగ్వేజ్ కోసం, కథలో కొన్నేళ్ల తర్వాత 40 ఏళ్ల వ్యక్తిగా, పొగరు, పగ.. ఇలాంటివి అన్ని చూపించాలి కాబట్టి కొంచెం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఇప్పటివరకు చేసిన పాత్రలకు ఇది డిఫరెంట్. ఇక ఇది రియల్‌గా జరిగిన కొన్ని సంఘటనల నుంచి తీసుకొని ఫిక్షనల్‌గా రాసిన పాత్ర, కథ.

ట్రైలర్‌లో ఒక షాట్‌లో మొక్కని నాటుతూ ఒకర్ని కొడతారు. ఆ షాట్ చాలా కొత్తగా ఉంది?

సినిమాలో అది చాలా స్ట్రాంగ్ ఎమోషన్ ఉన్న సీన్. రివెంజ్ మర్చిపోతామేమో అని ఒక మొక్క పెంచుకుంటారు సినిమాలో. ఆ మొక్క ఎంత పెరిగితే పగ అంత పెరుగుతుంది. మొక్క నుంచి వృక్షం వరకు డైరెక్టర్ చాలా బాగా రాసాడు. అది సినిమాలో చూస్తేనే చాలా బాగుంటుంది. ఇలాంటి కొత్త సీన్స్ సినిమాలో చాలా ఉన్నాయి.

సినిమాలో అథిరా రాజ్, మిగిలిన పాత్రల గురించి చెప్పండి.

ఈ సినిమాలో అథిరా ఒక్కరే మలయాళీ అమ్మాయి. మిగిలిన వాళ్లంతా తెలుగు వాళ్లే. విజయవాడలో చేసాము కాబట్టి విజయవాడ నుంచి చాలా మంది ఆర్టిస్టులని తీసుకున్నాము. అథిరా మంచి ఎమోషన్ పండించింది. తెలుగమ్మాయిలా ఎమోషన్స్ చూపించింది. పోలీసాఫీసర్ నందగోపాల్ చాలా బాగా చేశారు. లక్ష్మణ్ మీసాల, కృష్ణ, అర్చన మిగిలిన పాత్రలు కూడా మంచి ఎమోషన్ పండించారు.

సినిమాలో కేవలం రివెంజ్ ఉంటుందా లేదా లవ్, రొమాన్స్ కూడా ఉంటుందా?

అర్చన అనే అమ్మాయికి నాకు కథ ఉంటుంది. అలా అని లవ్, రొమాన్స్ కాదు ఒక చిన్న క్యూట్ కథ నడుస్తుంది. తన పాత్ర కూడా కథలో ఇంపార్టెంట్‌గా ఉంటుంది.

IPL_Entry_Point