Prathinidhi 2 Teaser: అభివృద్ధా.. అదెక్కడుంది? - ఏపీ పాలిటిక్స్‌పై నారా రోహిత్ సెటైర్స్ - ప్రతినిధి 2 టీజర్ రిలీజ్
Prathinidhi 2 Teaser: ప్రతినిధి 2 మూవీతో ఆరేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి హీరోగా రీఎంట్రీ ఇస్తున్నాడు నారా రోహిత్. ప్రతినిధి 2 టీజర్‌ను శుక్రవారం చిరంజీవి రిలీజ్ చేశాడు.
Prathinidhi 2 Teaser: దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత ప్రతినిధి 2 మూవీతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోన్నాడు హీరో నారా రోహిత్. ప్రతినిధి 2 టీజర్‌ను శుక్రవారం మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశాడు. పొలిటికల్ అంశాలతో టీజర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ఇందులో నారా రోహిత్ టీవీ ఛానెల్ రిపోర్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు.
రాజకీయాలు టార్గెట్…
రాజకీయాలను టార్గెట్ చేస్తూ టీజర్‌లో వినిపిస్తోన్న డైలాగ్స్ ఆసక్తిని పంచుతున్నాయి. మన రాష్ట్ర అప్పు ఎంత ఉంటుంది సార్ అని పొలిటిలక్ లీడర్ పాత్ర చేస్తోన్న అజయ్ ఘోష్‌ను నారా రోహిత్ ప్రశ్నించడం ఆకట్టుకుంటోంది. ఐదు లక్షల కోట్ల ఉండొచ్చునని అజయ్ ఘోష్ సమాధానం ఇవ్వడం ఆ తర్వాత అభివృద్ధి ఉంటే అదెంత సేపు తీర్చడం అని అనగానే...అభివృద్ధా అదేక్కడుంది అని నారా రోహిత్ చెప్పే డైలాగ్ టీజర్‌లో క్యూరియాసిటీని కలిగిస్తోంది.
పొలిటికల్ డైలాగ్స్...
జనం కోసం బతికితే చచ్చాక కూడా జనంలో బతికే ఉంటాం...పైన కూర్చొండి ఎన్నైనా చెబుతారు నీతులు. మేము ఖర్చు పెట్టింత అంతా ఎవరిస్తారు...అనే పొటిలికల్ డైలాగ్స్‌ను ఆలోచనను రేకెత్తిస్తోన్నాయి. టీజర్ చివరలో ఇప్పటికైన కళ్లు తెరవండి. ఒళ్లు విరించి బయటకు వచ్చి ఓటేయండి. కుదరకపోతే దేశం వదిలి వెళ్లిపొండి. అది కుదరకపోతే చచ్చిపొండి అనే ఇంటెన్స్ డైలాగ్‌తో టీజర్ ఎండ్ అయ్యింది.
ఏపీ పాలిటిక్స్ టార్గెట్...
ప్రతినిధి 2 టీజర్ చూస్తుంటే ఏపీ పాలిటిక్స్‌ను టార్గెట్ చేస్తోన్నట్లుగా కనిపిస్తోంది. ఏపీ రాజకీయ పరిస్థితులను స్ఫూర్తిగా తీసుకొని కల్పిత అంశాలతో ప్రతినిధి 2 తెరకెక్కిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. టీజర్‌లో కనిపిస్తోన్న చాలా పాత్రలు ప్రస్తుతం ఏపీ రాజకీయ నాయకులను గుర్తు కు తెస్తోన్నాయి. ఏపి పాటిలిక్స్‌తో ఇటీవల కాలంలో యాత్ర 2, వ్యూహం, రాజధాని ఫైల్స్‌తో పాటు మరికొన్ని సినిమాలొచ్చాయి. తాజాగా ప్రతినిధి 2 కూడా ఎన్నికల టైమ్‌లో రిలీజ్ కాబోతోంది.
ప్రతినిధి సీక్వెల్...
ప్రతినిధి 2 మూవీతో మూర్తి దేవగుప్తపు దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. 2014లో రూపొందిన ప్రతినిధి సినిమాకు సీక్వెల్‌గా ప్రతినిధి 2 తెరకెక్కుతోంది. ప్రశాంత్ మండవ దర్శకత్వంలో రూపొందిన ప్రతినిధి మూవీ కమర్షియల్‌గా పెద్ద సక్సెస్‌గా నిలిచింది. ప్రతినిధి 2 మూవీలో జిషుషేన్ గుస్తా, శరద్ ఖేల్కర్, దినేష్ తేజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సిరీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఏప్రిల్‌లో ప్రతినిధి 2 మూవీని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తోన్నారు.
2009లో బాణంతో ఎంట్రీ...
2009లో బాణం సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నారా రోహిత్. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశాలతో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. సోలో, ప్రతినిధి, అప్పట్లో ఒకడుండేవాడుతో పాటు ఆడియెన్స్‌తో పాటు క్రిటిక్స్‌ను మెప్పించాయి. వరుస పరాజయాలతో 2018లో రిలీజైన వీరభోగవసంతరాయలు తర్వాత టాలీవుడ్‌కు దూరమయ్యాడు నారా రోహిత్.