Telugu Movies: మలయాళీలకు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం.. మహేష్, బన్నీ, ఎన్టీఆర్‌పై మలయాళ డైరెక్టర్ కామెంట్స్
Manjummel Boys Director About Telugu Movies: మాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ మంజుమ్మల్ బాయ్స్ తెలుగులోనూ విడుదలై మంచి మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో తెలుగు సినిమాలు, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్‌పై ఆ మూవీ డైరెక్టర్ చిదంబరం ఎస్ పొదువల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Telugu Movies Manjummel Boys Chidambaram: ఇప్పుడు టాలీవుడ్‌లో ఎక్కడా విన్నా రెండు మలయాళ సినిమాల పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. వాటిలో ఒకటి ప్రేమలు అయితే, మరొకటి మంజుమ్మల్ బాయ్స్. ప్రేమలు తెలుగు వెర్షన్ ఏపీ తెలంగాణలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. త్వరలో దీని తెలుగు వెర్షన్ ఓటీటీలోకి సైతం రానుంది.
హౌజ్‌ఫుల్ బోర్డ్స్
ఈ సినిమా తర్వాత మాలీవుడ్‌లో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా మంజుమ్మల్ బాయ్స్. భాషా బేధం లేకుండా ట్రెండింగ్ అయిన ఈ సినిమాను ఏప్రిల్ 6న తెలంగాణ, ఆంధ్రప్రదేష్ రాష్ట్రాల్లో తెలుగులో విడుదల చేశారు. ఇక్కడ కూడా సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. థియేటర్లలో హౌజ్‌ఫుల్ బోర్డ్‌లతో కనిపిస్తున్నాయని అంటున్నారు.
మంజుమ్మల్ బాయ్స్ ప్రమోషన్స్
ఇంతలా మాట్లాడుకుంటున్న మంజుమ్మల్ బాయ్స్ సినిమాకు చిదంబరం ఎస్ పోదువల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో తెలుగు సినిమాలు, టాలీవుడ్ హీరోలపై ఆసక్తికకర కామెంట్స్ చేశారు మలయాళ డైరెక్టర్ చిదంబరం ఎస్ పొదువల్.
పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది
"కేరళలో మేం తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తాం. మలయాళీలకు తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టం. అల్లు అర్జున్ గారికి కేరళలో పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. మలయాళంలో మంజుమ్మల్ బాయ్స్‌కు వచ్చిన స్పందన తెలుగులో కూడా వస్తుందని ఆశిస్తున్నాను. తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా సినిమా నచ్చుతుంది" అని సినిమా తెలుగు వెర్షన్ విడుదలకు ముందు డైరెక్టర్ చిదంబరం ఎస్ పొదువల్ తెలిపారు.
ఎగ్జైటెడ్‌గా ఉన్నా
అనంతరం "అవకాశం వస్తే తెలుగులో ఏ హీరోతో సినిమా చేస్తారు?" అని యాంకర్ అడిగిన ప్రశ్నకు "తెలుగులో నాకు ఇష్టమైన హీరోలు చాలా మంది ఉన్నారు. ఒక్కరి పేరు చెప్పలేను. చిరంజీవి గారు, బాలయ్య గారు, అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు.. డిఫరెంట్ యాక్టర్స్ ఉన్నారు. వాళ్లందరితో సినిమా చేయడానికి ఎగ్జైటెడ్‌గా ఉన్నాను" అని దర్శకుడు చిదంబరం అన్నారు.
కామెంట్స్ వైరల్
ప్రస్తుతం డైరెక్టర్ చిదంబరం కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే, 2006లో జరిగిన ఒక యదార్థ సంఘటనను స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. కొచ్చికి చెందిన కొంతమంది స్నేహితుల కథను అద్భుతంగా చూపించిన మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ మంజుమ్మెల్ బాయ్స్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్లను కొల్లగొట్టింది.
మంజుమ్మల్ బాయ్స్ యాక్టర్స్
దీంతో మలయాళంలో 200 కోట్లు కలెక్ట్ చేసిన మొదటి సినిమాగా మంజుమ్మల్ బాయ్స్ చరిత్ర సృష్టించింది. చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషించారు.
తెలుగు వెర్షన్ ప్రొడక్షన్
పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఇండియన్ బాక్సాఫీస్ సెన్సేషన్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. తెలుగు హక్కులను సొంతం చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 6న ఏపీ, తెలంగాణలో విడుదల చేశారు.