Zebra OTT: జీబ్రా ఓటీటీ లాక్, సత్యదేవ్ కొత్త సినిమా ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కి రానుందంటే?
Zebra Movie: సత్యదేవ్ నటించిన జీబ్రా మూవీ థియేటర్లలో రిలీజ్‌కి ముందే ఓటీటీలో ఫ్యాన్సీ రేటుకి అమ్ముడుపోయింది. మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి రావడంతో.. సినిమాకి హైప్ వచ్చింది.
టాలీవుడ్‌లో ఒకవైపు హీరోగా చేస్తూనే.. మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తున్న సత్యదేవ్ నటించిన జీబ్రా మూవీ ఓటీటీపై క్లారిటీ వచ్చేసింది. సత్యదేవ్, పుష్ప ఫేమ్ ధనంజయ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ జీబ్రా మూవీ నవంబర్ 22న థియేటర్లలో విడుదలకానుంది.
మెగాస్టార్ రాకతో పెరిగిన హైప్
జీబ్రా మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌కి మెగాస్టార్ చిరంజీవి రావడంతో.. ఈ మూవీపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. మెగాస్టార్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సత్యదేవ్ గురించి మాట్లాడిన చిరంజీవి.. అతని నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. దెబ్బకి సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
ఫ్యాన్సీ రేటుకి ఓటీటీ రైట్స్
జీబ్రా సినిమాను విడుదలకి ముందే ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్యానీ రేటుకి ఓటీటీ హక్కుల్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ చివరి వారంలో ఈ సినిమా స్ట్రీమింగ్‌కి వచ్చే అవకాశం ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రాబోతున్న సినిమాలో సత్యదేవ్ బ్యాంక్ ఉద్యోగిగా కనిపించబోతున్నారు. కన్నడ నటుడు ధనంజయ క్యారెక్టర్‌పై ఇంకా క్లారిటీ రాలేదు.
గాడ్ ఫాదర్ తర్వాత తగ్గిన ఛాన్స్‌లు
డీసెంట్ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. సత్యదేవ్ కొంచెం గ్యాప్ తీసుకుని మళ్లీ సినిమాల్లో యాక్టీవ్ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి గాడ్‌ఫాదర్‌లో సత్యదేవ్ విలన్‌గా నటించారు. కానీ.. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో.. సత్యదేవ్‌కి అవకాశాలు తగ్గాయి.
జీబ్రాలో జెనిఫర్ పిచినాటో, ప్రియా భవానీ శంకర్, సత్యరాజ్, సునీల్, సత్య కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి.