Zebra OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. నెల రోజుల్లోపే..-zebra ott release date satyadev movie to stream on aha video ott soon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Zebra Ott Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. నెల రోజుల్లోపే..

Zebra OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. నెల రోజుల్లోపే..

Hari Prasad S HT Telugu
Dec 12, 2024 11:43 AM IST

Zebra OTT Release Date: ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ వచ్చేస్తోంది. నవంబర్ 22న థియేటర్లలో రిలీజై ఓ మోస్తరు కలెక్షన్లు సాధించిన జీబ్రా మూవీ.. నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం కానుంది.

ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. నెల రోజుల్లోపే..
ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. నెల రోజుల్లోపే..

Zebra OTT Release Date: టాలీవుడ్ హీరో సత్యదేవ్ నటించిన మూవీ జీబ్రా. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు థియేటర్లలో రిలీజైనప్పుడు మిక్స్‌డ్ నుంచి పాజిటివ్ రివ్యూలు రావడంతో బాక్సాఫీస్ దగ్గర కూడా ఫర్వాలేదనిపించింది. రూ.8 కోట్లకుపైనే వసూలు చేసింది. ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ఆహా వీడియో ఓటీటీ దక్కించుకుంది.

జీబ్రా ఓటీటీ రిలీజ్ డేట్

టాలీవుడ్ లో ఈ మధ్యే వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ జీబ్రా త్వరలోనే ఆహా వీడియో ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ గురువారం (డిసెంబర్ 12) ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. "థ్రిల్లింగ్ రైడ్, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ను ఆహాలో త్వరలో చూడటానికి సిద్ధంగా ఉండండి" అంటూ పోస్ట్ చేసింది. అయితే ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని మాత్రం చెప్పలేదు.

ఈ డేట్ ను కూడా త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం ఉంది. నెల రోజుల్లోపే ఓటీటీలోకి రావడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. సత్యదేశ్ తోపాటు పుష్ప ఫేమ్ ధనంజయ ప్రధాన పాత్రలు పోషించిన జీబ్రా మూవీ బాక్సాఫీస్ దగ్గర కూడా ఓ మోస్తరు సక్సెస్ సాధించడంతో ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

జీబ్రా మూవీ గురించి..

జీబ్రా మూవీ నవంబర్ 22న థియేటర్లలో రిలీజైంది. ఈశ్వర్ కార్తీక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మజ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. సత్యదేవ్, ధనంజయతోపాటు సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, అమృతా అయ్యంగార్, సునీల్, సత్యలాంటి వాళ్లు నటించారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందించాడు.

రెండు వేర్వేరు బ్యాంకుల్లో పని చేసే సూర్య, అతని గర్ల్‌ఫ్రెండ్ స్వాతి, ఓ మల్టీ మిలియనీర్ ఆది చుట్టూ తిరిగే కథ ఇది. బ్యాంకులో స్వాతి చేసిన తప్పిదం తర్వాత ఆమెతోపాటు సూర్యను కూడా ఎలాంటి చిక్కుల్లో పడేసిందన్నది ఈ జీబ్రా మూవీలో చూడొచ్చు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని మేకర్స్ బాగానే ప్రమోట్ చేశారు. ప్రీరిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవినే తీసుకొచ్చారు.

అంతకుముందు గాడ్‌ఫాదర్ సినిమాలో చిరుతో కలిసి సత్యదేవ్ నటించిన విషయం తెలిసిందే. జీబ్రా మూవీలో సత్యదేవ్ నటనపై మెగాస్టార్ ప్రశంసలు కురిపించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. థియేటర్లలో ఫర్వాలేదనిపించిన ఈ జీబ్రా మూవీ ఆహా వీడియోలో ఎంత మేర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

Whats_app_banner