ప్రముఖ ఫోటో-వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ ఇటీవల కస్టమర్ల కోసం ఫీచర్‌ను అప్‌డేట్ చేసింది. దీనికి ట్రయల్ రీల్స్ అని పేరు పెట్టారు. క్రియేటర్లు తమ వీడియో ఆలోచనలను గతంలో కంటే సులభంగా క్రియేటివిటీగా చేసేందుకు, కొత్త కంటెంట్‌ను సృష్టించడానికి ఈ ఫీచర్ అవకాశం ఇస్తుంది. ఈ ఫీచర్ గురించి వివరంగా తెలుసుకుందాం.
ట్రయల్ రీల్స్ అనేది రీల్స్ సృష్టించడానికి మీకు ప్రైవేట్ స్పేస్ ఇచ్చే ఫీచర్. ఇక్కడ మీరు కొత్త ఫిల్టర్లు, ఎఫెక్ట్స్, మ్యూజిక్ ఉపయోగించి వివిధ రకాల వీడియోలను క్రియోట్ చేయవచ్చు. ఈ వీడియోలను మీరు మాత్రమే చూడగలరు. ఒకవేళ కావాలనుకుంటే వాటిని మీ సన్నిహిత స్నేహితులతో పంచుకోవచ్చు.
మీ క్రియేటివిటీని ప్రయత్నించే అవకాశాన్ని ట్రయల్ రీల్స్ అందిస్తుంది. వివిధ రకాల కంటెంట్‌ను సృష్టించవచ్చు. మీ ఫాలోవర్లు ఏ కంటెంట్‌ను ఎక్కువగా ఇష్టపడతారో చూడవచ్చు. అదేవిధంగా వీడియో ఎడిటింగ్, క్రియేటివిటికీ కొత్త మార్గాలను నేర్చుకోవడానికి ట్రయల్ రీల్స్ సహాయపడుతుంది. వివిధ రకాల ఎఫెక్ట్స్ ఉపయోగించడం ద్వారా వీడియోలను మరింత అట్రాక్ట్ చేసేలా చేయవచ్చు.
ట్రయల్ రీల్స్‌ను సన్నిహితులతో షేర్ చేయవచ్చు. వారి ఫీడ్ బ్యాక్ కూడా పొందవచ్చు. ఏ రకమైన కంటెంట్ క్రియేట్ చేస్తున్నారో దానిని ఎలా మెరుగుపరచవచ్చో అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ట్రయల్ రీల్స్‌లో వివిధ రకాల వీడియోలను క్రియేట్ చేస్తే మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇది ఇన్‌స్టాగ్రామ్ మరింత కొత్త కంటెంట్‌ను సృష్టించడానికి అనుమతిస్తుంది.
ట్రయల్ రీల్స్ ఫీచర్ ఉపయోగించడం చాలా సులభం. ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసి రీల్స్ క్రియేట్ చేసే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ట్రయల్ రీల్స్ సృష్టించగల కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫిల్టర్లు, ఎఫెక్ట్స్ ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. మీరు మీ వీడియోలో వివిధ రకాల మ్యూజిక్ వాడుకోవచ్చు. ఒకవేళ ఈ ఫీచర్ రాకపోతే యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మరికొంత కాలం వెయిట్ చేయాలి.