Tollywood 1000 Crore Movies: ఇదీ తెలుగు సినిమా సత్తా.. కొడితే రూ.1000 కోట్లు.. తగ్గేదేలే.. నాలుగు సినిమాలతో రికార్డు-tollywood 1000 crores movies pushpa 2 box office collections kalki 2898 ad rrr bahubali 2 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tollywood 1000 Crore Movies: ఇదీ తెలుగు సినిమా సత్తా.. కొడితే రూ.1000 కోట్లు.. తగ్గేదేలే.. నాలుగు సినిమాలతో రికార్డు

Tollywood 1000 Crore Movies: ఇదీ తెలుగు సినిమా సత్తా.. కొడితే రూ.1000 కోట్లు.. తగ్గేదేలే.. నాలుగు సినిమాలతో రికార్డు

Hari Prasad S HT Telugu
Dec 12, 2024 07:55 AM IST

Tollywood 1000 Crore Movies: తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి తెలుస్తోంది. ఇన్నాళ్లూ ఇండియాలో బాలీవుడ్ తర్వాతే టాలీవుడ్ అనే మాటను చెరిపేస్తోంది. బాక్సాఫీస్ దగ్గర అత్యధిక రూ.1000 కోట్ల మార్క్ అందుకున్న సినిమాల రికార్డు ఇప్పుడు టాలీవుడ్ సొంతం.

ఇదీ తెలుగు సినిమా సత్తా.. కొడితే రూ.1000 కోట్లు.. తగ్గేదేలే.. బాలీవుడ్ దిమ్మదిరిగిపోయింది
ఇదీ తెలుగు సినిమా సత్తా.. కొడితే రూ.1000 కోట్లు.. తగ్గేదేలే.. బాలీవుడ్ దిమ్మదిరిగిపోయింది

Tollywood 1000 Crore Movies: పుష్ప 2 మూవీ తెలుగు సినిమా రేంజ్ ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. అత్యంత వేగంగా రూ.1000 కోట్ల మార్క్ అందుకున్న ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించడమే కాదు.. ఈ క్రమంలో టాలీవుడ్ ను బాలీవుడ్ కంటే ఓ అడుగు ముందుకు పడేలా చేసింది. ఇప్పుడు రూ.1000 కోట్ల కలెక్షన్లు దాటిన సినిమాలు ఎక్కువగా ఉన్న ఇండస్ట్రీగా ఇండియాలో టాలీవుడ్ నిలిచింది. ఇది బాలీవుడ్ కు దిమ్మదిరిగే షాకే.

yearly horoscope entry point

ఇదీ తెలుగు సినిమా సత్తా

ఇండియాలో అతిపెద్ద సినిమా ఇండస్ట్రీ బాలీవుడ్. కొన్ని దశాబ్దాలుగా ఇదే కొనసాగుతోంది. దేశంలో హిందీ మాట్లాడే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో బడ్జెట్, వసూళ్ల పరంగా మిగిలిన ఇండస్ట్రీలను వెనక్కి నెడుతూ వస్తోంది. అయితే బాలీవుడ్ ఆధిపత్యానికి సవాలు విసిరింది మాత్రం మన తెలుగు సినిమాయే. బాహుబలి మూవీతో పాన్ ఇండియా సాంప్రదాయానికి తెరతీసి.. నార్త్ ప్రేక్షకులను కూడా కట్టిపడేసిన ఘనత మన రాజమౌళికి దక్కుతుంది.

ఆ తర్వాత వచ్చిన బాహుబలి 2 మూవీ రూ.1000 కోట్ల మార్క్ అందుకున్న తొలి ఇండియన్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ సినిమా దంగల్ ఈ మార్క్ అందుకుంది. ఇన్నాళ్లూ టాలీవుడ్, బాలీవుడ్ కు చెందిన మూడేసి సినిమాలు రూ.1000 కోట్ల మార్క్ అందుకోగా.. తాజాగా పుష్ప 2 కూడా ఆ మార్క్ అందుకోవడంతో బాలీవుడ్ ను వెనక్కి నెట్టి టాలీవుడ్ దూసుకెళ్లింది.

పుష్ప 2తో సరికొత్త చరిత్ర

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ కేవలం ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్క్ అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలుసు కదా. అప్పట్లో బాహుబలి 2 బాక్సాఫీస్ దగ్గర రూ.1000 కోట్ల మార్క్ అందుకున్న తొలి ఇండియన్ సినిమాగా నిలిస్తే.. ఇప్పుడు పుష్ప 2 కేవలం ఆరు రోజుల్లోనే ఆ మార్క్ అందుకొని తెలుగు సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లింది. బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడీ తర్వాత పుష్ప 2 ఈ ఘనత సాధించిన నాలుగో తెలుగు సినిమాగా నిలిచింది.

బాలీవుడ్ నుంచి ఇప్పటి వరకూ మూడు సినిమాలు ఈ మార్క్ అందుకున్నాయి. అందులో ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ తోపాటు షారుక్ ఖాన్ గతేడాది నటించిన పఠాన్, జవాన్ సినిమాలు ఉన్నాయి. ఇక కన్నడ ఇండస్ట్రీ నుంచి కేజీఎఫ్ 2 కూడా రూ.1000 కోట్ల మార్క్ దాటింది. అయితే అత్యధికంగా నాలుగు రూ.1000 కోట్ల సినిమాలతో బాలీవుడ్ ను వెనక్కి నెట్టింది మన టాలీవుడ్.

రాజమౌళి చూపిన బాటలో..

తెలుగు సినిమాకే కాదు.. దేశంలోని అన్ని ఇండస్ట్రీలకు పాన్ ఇండియా, సీక్వెల్, భారీ బడ్జెట్ అనే పదాలను పరిచయం చేసిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. అంతకుముందు ఈ ఫార్ములాతో కొన్ని సినిమాలు వచ్చినా అంతగా సక్సెస్ కాలేదు. కానీ బాహుబలితో జక్కన్న తెలుగు సినిమాను విశ్వవ్యాప్తం చేశాడు. బాహుబలి 2తో దానిని మరో స్థాయికి తీసుకెళ్లాడు. అతని సక్సెస్ ఫార్ములాను మిగిలిన తెలుగు డైరెక్టర్లు కూడా ఫాలో అవుతున్నారు.

కల్కి 2898 ఏడీతో నాగ్ అశ్విన్, ఇప్పుడు పుష్ప 2తో సుకుమార్ కూడా అదే ఫార్ములాతో రూ.1000 కోట్ల మార్క్ అందుకున్నారు. ఈ ఘనత సాధించిన నాలుగు సినిమాల్లో రెండు (బాహుబలి 2, ఆర్ఆర్ఆర్) రాజమౌళి మూవీస్ కావడం విశేషం. ఇక ఇప్పుడతడు మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ ప్లాన్ చేస్తుండటంతో ఆ సినిమా మరెన్ని రికార్డులు తిరగరాస్తుందో అన్న ఆసక్తి నెలకొంది. అదే కాకుండా కల్కి 2898 ఏడీ, పుష్ప సినిమాలకు కూడా ఇంకా సీక్వెల్స్ రాబోతున్నాయి. ఆ లెక్కన బాలీవుడ్ కు ఊపిరి సలపని రీతిలో టాలీవుడ్ జైత్రయాత్ర కొనసాగబోతుందని చెప్పొచ్చు.

Whats_app_banner