RITES Recruitment : ఆర్ఐటీఈఎస్‌లో అప్రెంటిస్ పోస్టులు.. మంచి మార్కులుంటే చాలు.. పరీక్ష లేకుండానే ఎంపిక!
RITES Recruitment 2024 : రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్(ఆర్ఐటీఈఎస్) లిమిటెడ్ ద్వారా 200 కంటే ఎక్కువ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.
ఆర్ఐటీఈఎస్ అంటే రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ నోటిఫికేషన్ వచ్చింది. ప్రభుత్వ సంస్థలో పని చేయాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం 223 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ (BE/B.Tech/B.Arch), డిప్లొమా లేదా నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ (BA/BBA/B.Com/B.Sc/BCA) పూర్తి చేసి ఉంటే వెంటనే అప్లై చేసుకోండి.
పోస్టులు ఇవే
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ గరిష్ట పోస్టులు - 141, డిప్లొమా అప్రెంటీస్- 36 పోస్టులు, ట్రేడ్ అప్రెంటీస్ (ఐటీఐ) - 46 పోస్టులు.
అర్హతలు
మొత్తం 223 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కోసం ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ లేదా నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కలిగి ఉండాలి. డిప్లొమా అప్రెంటీస్ కోసం మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా కలిగి ఉండాలి. ట్రేడ్ అప్రెంటిస్ తప్పనిసరిగా ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ రూ. 14,000, డిప్లొమా అప్రెంటీస్‌కు రూ. 12,000, ట్రేడ్ అప్రెంటీస్(ITI)కు రూ 10,000 అందిస్తారు.
చివరి తేదీ
ఆర్ఐటీఈఎస్ రిక్రూట్‌మెంట్ కింద మొత్తం 223 పోస్టులకు నియమిస్తారు. దరఖాస్తుకు డిసెంబర్ 25 చివరి తేదీగా ఉంది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థుల అకడమిక్ మార్కుల శాతం ఆధారంగా మెరిట్ జాబితాను తయారుచేస్తారు. దాని ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు చివరి తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
అధికారిక వెబ్‌సైట్ rites.comని సందర్శించి అప్లై చేసుకోవచ్చు. అవసరమైన అన్ని వివరాలు, పత్రాలను సరిగ్గా ఇవ్వాలి. దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదివితే మంచిది.