New Year Remedies: కొత్త ఏడాదికి ముందు ఇంట్లో ఈ వస్తువులు తెచ్చిపెట్టుకోండి.. ఇల్లు డబ్బుతో నిండిపోతుంది!
New Year Remedies: పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి ఇప్పటికే అందరూ సిద్ధమై ఉంటారు. అయితే కొత్త ఏడాది మీకు బాగా కలిసి రావాలంటే, ఇల్లు డబ్బుతో నిండిపోవాలంటే న్యూ ఇయర్ లోకి అడుగుపెట్టడానికి ముందే ఇంట్లోకి కొన్ని వస్తువులను తెచ్చిపెట్టుకోవాలి.
ఈ ఏడాది ముగిసిపోతుంది. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టడానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. 2025 సంవత్సరాన్ని ఘనంగా స్వాగతించేందుకు ఇప్పటికే చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కొత్త ఏడాది తమ భవిష్యత్తు బాగుండాలని, ఆర్థిక, ఆరోగ్య పరిస్థితితులు మరింత మెరుగవాలని ప్రతి ఒక్కరూ దేవుడిని కోరుకుంటూ ఉంటారు. న్యూ ఇయర్ 2025 మీకు అన్నివిధాలా బాగా కలిసి రావడానికి, ఇల్లు డబ్బుతో నిండిపోవడానికి కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టడానికి ముందు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. న్యూ ఇయర్‌కు కొద్ది రోజుల ముందే ఇంట్లోకి కొన్ని ప్రత్యేకమైన వస్తువులను తెచ్చిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఇల్లు సకల ఐశ్వర్యాలతో నిండిపోతుంది. ఇంట్లోని వ్యక్తులు సుఖసంతోషాలతో జీవిస్తారు.వాస్తు దోషం కూడా తొలగిపోతుంది. సంపద, ఆదాయం పెరుగుతుందని విశ్వాసం. కొత్త ఏడాదికి ముందే ఇంట్లోకి తెచ్చిపెట్టుకోవాల్సిన వస్తువులేంటో తెలుసుకుందాం.
- కొత్త ఏడాదికి ముందు శ్రీకృష్ణుడికి ఇష్టమైన వేణువును ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకోండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వేణువును ఉంచడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి. అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవాహం పెరుగుతుంది. శ్రీ కృష్ణుడికి వేణువు అంటే చాలా ఇష్టం. కనుక కృష్ణుడి అనుగ్రహం కలుగుతుంది. ఇల్లు సుఖసంతోషాలతో నిండుతుంది. ప్రేమ, కుటుంబ విషయాలు సంతోషంతో నిండుతాయి.
- వ్యాపారంలో శ్రేయస్సు కోసం నూతన సంవత్సరానికి ముందు వినాయక విగ్రహాన్ని ఇంటికి తీసుకురంటి. అలాగే కొత్త సంవత్సరం మొదటి రోజున విధి విధానాలతో వినాయకుడి విగ్రహాన్ని పూజించండి. వాస్తు నిపుణులు అభిప్రాయం ప్రకారం ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ఉంచడం వల్ల వాస్తు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో గొడవలు, చికాకులు తగ్గుతాయి, సంపద, ఐశ్వర్యం పెరుగుతాయి. వినాయకుడిని పూజించడం వల్ల శివకుటుంబంలోని అన్ని దేవతల అనుగ్రహం లభిస్తుంది. కనుక కొత్త సంవత్సరానికి ముందే ఇంట్లోకి వినాయకుడి విగ్రహాన్నిఇంట్లో తెచ్చిపెట్టుకోండి.
- వాస్తు నిపుణులు అభిప్రాయం ప్రకారం ఇంట్లో నెమలి ఈకలను ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ ఆదాయం, అదృష్టం పెంచుకోవాలంటే కొత్త సంవత్సరానికి ముందు నెమలి ఈకలను ఇంటికి తెచ్చుకోండి. అలాగే నూతన సంవత్సరం మొదటిరోజు పూజ చేసిన తర్వాత నెమిలి ఈకను భద్రంగా దాచిపెట్టుకోండి. ఇది మీ ఆర్థిక సమస్యలను తగ్గించి ఇంట్లోకి డబ్బును ఆకర్షిస్తుంది.
- సనాతన ధర్మం ప్రకారం ఆవులు శ్రీకృష్ణుడికి చాలా ప్రీతికరమైనవి. కొత్త సంవత్పరం మొదటి రోజున వెండితో చేసిన కామధేనువును ఇంటికి తీసుకురండి. ఈ రోజు ఈ కామధేనువును పూజించడం వల్ల ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. లక్ష్మీ దేవి కటాక్షం సిద్ధిస్తుంది. గణేశుడిని పూజించడం వల్ల జీవితంలోని అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయని, ఆదాయం,సంపద పెరుగుతాయని నమ్ముతారు.