Lucky Baskhar OTT: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్ము రేపుతున్న లక్కీ భాస్కర్.. ఏ తెలుగు సినిమాకూ సాధ్యం కాని రికార్డు-lucky baskhar on netflix dulquer salman movie creates another unique record ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lucky Baskhar Ott: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్ము రేపుతున్న లక్కీ భాస్కర్.. ఏ తెలుగు సినిమాకూ సాధ్యం కాని రికార్డు

Lucky Baskhar OTT: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్ము రేపుతున్న లక్కీ భాస్కర్.. ఏ తెలుగు సినిమాకూ సాధ్యం కాని రికార్డు

Hari Prasad S HT Telugu
Dec 12, 2024 12:30 PM IST

Lucky Baskhar OTT: లక్కీ భాస్కర్ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో దుమ్ము రేపుతోంది. ఇప్పటి వరకూ ఏ తెలుగు సినిమాకూ సాధ్యం కాని రికార్డును అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోనూ అదే స్థాయిలో దూసుకెళ్తోంది.

నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్ము రేపుతున్న లక్కీ భాస్కర్.. ఏ తెలుగు సినిమాకూ సాధ్యం కాని రికార్డు
నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్ము రేపుతున్న లక్కీ భాస్కర్.. ఏ తెలుగు సినిమాకూ సాధ్యం కాని రికార్డు

Lucky Baskhar OTT: దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ మూవీ ఓటీటీలోనూ ఓ రేంజ్ లో సత్తా చాటుతోంది. ఓ సాధారణ బ్యాంకు ఉద్యోగి తలచుకుంటే కోట్లు ఎలా సంపాదించగలడో చూపించిన ఈ సినిమా.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ.. ఏకంగా 17.8 బిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకోవడం విశేషం.

yearly horoscope entry point

లక్కీ భాస్కర్ రికార్డు

లక్కీ భాస్కర్ ఇప్పటి వరకూ ఏ తెలుగు సినిమాకూ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకుంది. ఓటీటీ రిలీజ్ తర్వాత ఇంత వేగంగా ఏకంగా 17.8 బిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ అందుకున్న మరో తెలుగు మూవీ లేదు. తెలుగుతోపాటు కన్నడ, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్ లోకి రావడంతో అన్ని భాషలు కలిపి ఈ అరుదైన రికార్డును అందుకుంది. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన లక్కీ భాస్కర్ ను ఓటీటీలోనూ ప్రేక్షకులు ఎంతలా ఆదరిస్తున్నారో దీనిని బట్టే అర్థమవుతోంది.

నెట్‌ఫ్లిక్స్ లో అడుగుపెట్టినప్పటి నుంచీ ఈ మూవీ టాప్ ట్రెండింగ్ సినిమాల్లో ఒకటి లేదా రెండో స్థానాల్లోనే కొనసాగుతోంది. ప్రస్తుతం హిందీ మూవీ విక్కీ ఔర్ విద్యా కా వో వాలా వీడియో రావడంతో ఆ సినిమా టాప్ లోకి వెళ్లగా.. లక్కీ భాస్కర్ రెండో స్థానానికి పడిపోయింది. అమరన్, దేవరలాంటి సినిమాలను కూడా దుల్కర్ మూవీ వెనక్కి నెట్టింది.

లక్కీ భాస్కర్ ఎలా ఉందంటే?

లక్కీ భాస్కర్ మూవీ అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. అదే రోజు అమరన్, కలాంటి సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయినా బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. దుల్కర్ సల్మాన్ కు తెలుగులో హ్యాట్రిక్ విజయాలు అందించిన మూవీ ఇది. ఓ బ్యాంకులో పని చేసే సాధారణ ఉద్యోగి తనకు ప్రమోషన్ రాలేదన్న కారణంగా పక్కదారి పట్టి, ఎవరికీ చిక్కకుండా రూ.100 కోట్లు ఎలా సంపాదించాడన్నదే ఈ మూవీ స్టోరీ.

1990ల మొదట్లో స్టార్ మార్కెట్ లో జరిగిన అర్షద్ మెహతా స్కామ్ కు లింకు పెడుతూ సాగిన ఈ స్టోరీ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి నటించింది. జీవీ ప్రకాశ్ మ్యూజిక్ అందించాడు. రానున్న రోజుల్లో నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా మరెన్ని రికార్డులు తిరగరాస్తుందో చూడాలి.

Whats_app_banner