Annamaya District: సినిమాను తలపించే క్రైమ్ కథ.. చట్టం పని చేయటం లేదని..!-gutta anjaneyulu was brutally murdered in annamayya district ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Annamaya District: సినిమాను తలపించే క్రైమ్ కథ.. చట్టం పని చేయటం లేదని..!

Annamaya District: సినిమాను తలపించే క్రైమ్ కథ.. చట్టం పని చేయటం లేదని..!

Dec 12, 2024 12:25 PM IST Muvva Krishnama Naidu
Dec 12, 2024 12:25 PM IST

  • అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటలో గుట్ట ఆంజనేయులు దారుణ హత్యకు గురయ్యారు. ఈయనకు 60 సంవత్సరాల వయసు ఉంటుంది. పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కొత్త మంగంపేటకు చెందిన చంద్రకళ, ఆమె భర్త ఆంజనేయప్రసాద్ కువైట్లో ఉంటున్నారు. దీంతో తమ కుమార్తెను ఊళ్లో ఉంటున్న చెల్లెలు లక్ష్మి, వెంకటరమణ దంపతుల వద్ద ఉంచారు. ఇటీవల వెంకటరమణ తండ్రి ఆంజనేయులు మనవరాలి వరసయ్యే ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విషయాన్ని బాలిక తన తల్లి చంద్రకళకు ఫోన్ చేసి తెలిపింది. ఆమె వెంటనే చెల్లెలు లక్ష్మికి ఫోన్ చేసి అడగ్గా, ఆమె సరిగా స్పందించలేదు. ఆందోళనతో చంద్రకళ కువైట్ నుంచి వచ్చి ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడు ఆంజనేయులును పిలిపించి మందలించి వదిలేశారు. ఆమె ఈ విషయాన్ని భర్త ఆంజనేయ ప్రసాద్‌కు చెప్పింది. తీవ్ర ఆవేదనకు గురైన అతడు ఆడపిల్లపై అసభ్యకరంగా ప్రవర్తించినా పోలీసులు పట్టించుకోకపోవడం ఏమిటని ఆవేదన చెందాడు. కువైట్ నుంచి వచ్చి శనివారం ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఆంజనేయులు తలపై ఇనుప రాడ్డుతో మోది హత్య చేసి వెంటనే కువైట్ వెళ్లిపోయాడు. అనంతరం ఈ విషయాన్ని వివరిస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్టు చేశాడు. ఆడ బిడ్డ తండ్రిగా తాను చేసింది న్యాయమేనని.. పోలీసులకు లొంగిపోతానని వెల్లడించాడు.

More