Special Trains : రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్.. 8 ప్రత్యేక రైళ్లు పొడిగింపు-east coast railway is running special trains via vijayawada ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Special Trains : రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్.. 8 ప్రత్యేక రైళ్లు పొడిగింపు

Special Trains : రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్.. 8 ప్రత్యేక రైళ్లు పొడిగింపు

HT Telugu Desk HT Telugu
Dec 12, 2024 11:22 AM IST

Special Trains : రైల్వే ప్ర‌యాణికుల‌కు ఈస్ట్‌ కోస్ట్ రైల్వే గుడ్‌ న్యూస్ చెప్పింది. విజ‌య‌వాడ మీదుగా బెంగ‌ళూరుకు ప్ర‌త్యేక రైలును అందుబాటులోకి తెచ్చింది. మ‌రోవైపు ఇప్ప‌టికే రాక‌పోక‌లు నిర్వ‌హిస్తోన్న ఎనిమిది స్పెష‌ల్ రైళ్ల‌ను నెల పాటు పొడిగించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రత్యేక రైళ్లు పొడిగింపు
ప్రత్యేక రైళ్లు పొడిగింపు

అదనపు రద్దీని క్లియర్ చేయడానికి ఎస్ఎంవీబీ- హౌరా మ‌ధ్య విజ‌య‌వాడ మీదుగా స్పెష‌ల్ రైలు అందుబాటులోకి తెచ్చారు. ఎస్ఎంవీబీ బెంగ‌ళూరు నుంచి బ‌య‌లుదేరే స్పెష‌ల్ ఎక్స్‌ప్రెస్‌ను (08565) రైలు అందుబాటులోకి తెచ్చారు. ఈ రైలు డిసెంబ‌ర్ 14 (శనివారం)న ఉద‌యం 10.15 గంట‌ల‌కు ఎస్ఎంవీబీ బెంగ‌ళూరులో బ‌య‌లుదేరుతోంది. ఈ రైలు మ‌రుస‌టి రోజు ఆదివారం రాత్రి 9.45 గంట‌ల‌కు హౌరా చేరుకుంటుంది.

ఈ రైలు ఆంధ్ర‌ప్రదేశ్‌లోని రేణిగుంట, గూడూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం, పలాస త‌దిత‌ర స్టేష‌న్ల‌లో ఆగుతోంది. ఈ రైలుకు థర్డ్ ఏసీ-2, స్లీపర్ క్లాస్-9, సెకండ్ క్లాస్ లగేజ్ కమ్ గార్డ్/ దివ్యాంగజన్ కోచ్ - 2 ఉంటాయి.

స్పెష‌ల్‌ రైళ్ల పొడిగింపు..

ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి ప్రత్యేక రైళ్లను పొడిగించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.

1. కొచ్చువేలి (త్రివేండ్రం నార్త్) - షాలిమార్ ప్రత్యేక (06081) రైలు డిసెంబ‌ర్ 20 నుంచి జ‌న‌వ‌రి 24 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. షాలిమార్ - కొచ్చువేలి (త్రివేండ్రం నార్త్) ప్రత్యేక (06082) రైలు డిసెంబ‌ర్ 23 నుండి జ‌న‌వ‌రి 27 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. ఈ రెండు రైళ్లు ఆంధ్ర‌ప్రదేశ్‌లోని రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం త‌దిత‌ర స్టేష‌న్ల‌లో ఆగుతాయి.

2. తిరునెల్వేలి– షాలిమార్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (06087) రైలు డిసెంబ‌ర్ 19 నుంచి జ‌న‌వ‌రి 23 వరకు అందుబాటులో ఉంటుంది. షాలిమార్ - తిరునెల్వేలి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (06088) రైలు డిసెంబ‌ర్ 21 నుండి జ‌న‌వ‌రి 25 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైళ్లు ఆంధ్ర‌ప్రదేశ్‌లోని నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామ‌ర్ల‌కోట‌, దువ్వాడ, పెందుర్తి, కొత్త‌వ‌లస‌, విజయనగరం, శ్రీకాకుళం, పలాస త‌దిత‌ర స్టేష‌న్ల‌లో ఆగుతాయి.

3. పోదనూరు - బరౌని ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (06055) రైలు డిసెంబ‌ర్ 21 నుండి జ‌న‌వ‌రి 25 వరకు అందుబాటులో ఉంటుంది. బరౌని - పోదనూరు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (06056) రైలు డిసెంబ‌ర్ 24 నుండి జ‌న‌వ‌రి 28 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైళ్లు ఆంధ్ర‌ప్రదేశ్‌లోని గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, తాడేప‌ల్లి గూడెం, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, బొబ్బిలి, పార్వ‌తీపురం త‌దిత‌ర స్టేష‌న్ల‌లో ఆగుతాయి.

4. తాంబరం - సంత్రాగచ్చి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (06095) రైలు డిసెంబ‌ర్ 19 నుండి జ‌న‌వ‌రి 23 వరకు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. సంత్రాగచ్చి - తాబ్‌బ్రం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (06096) రైలు డిసెంబ‌ర్ 20 నుంచి జ‌న‌వ‌రి 24 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. ఈ రైళ్లకు ఆంధ్ర‌ప్రదేశ్‌లోని గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామ‌ర్ల‌కోట‌, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం, ప‌లాస త‌దిత‌ర స్టేష‌న్ల‌లో హాల్టింగ్ ఉంది.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner