Vennela Anchor Jayathi Duggu Duggu Bulletto Song In Youtube: తెలుగు ప్రేక్షకులకు జయతి పేరును ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఒకప్పుడు జెమినీ మ్యూజిక్‌లో వెన్నెల అనే షో ద్వారా వీడియో జాకీగా అలరించింది జయతి.
అప్పట్లో జయతికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆమె యాంకరింగ్ కోసమే కాలర్స్ కాల్ చేసి పాటలు అడిగేవారు. అలా విపరీతమైన ఫాలోయింగ్ ఉండటమే కాకుండా అభిమానుల నుంచి ఆంధ్ర మాధురి దీక్షిత్‌లా ఉందనే కాంప్లిమెంట్స్ తెచ్చుకుంది. జయతి అందంపై ఆమె అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉండేవారు.
ఇక వీడియో జాకీగా పనిచేసిన తర్వాత ఈ ముద్దుగుమ్మ జయతి తెలుగు సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అది కూడా నిర్మాతగా మారి తన సొంత నిర్మాణ సంస్థలో సినిమాలను రూపొందించింది. లచ్చి అనే హారర్ కామెడీ జానర్ సినిమాను నిర్మించిన జయతి ఆ మూవీలో హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. లచ్చి సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న జయతి ఇప్పుడు ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ నటనకు మళ్లీ దగ్గరవుతోంది.
తాజాగా డుగ్గు డుగ్గు బుల్లెట్టో అనే పాటతో నటనలో రీ ఎంట్రీ ఇచ్చింది జయతి. ఈ డుగ్గు డుగ్గు బుల్లెట్టో ఆల్బమ్ సాంగ్‌తో జయతి ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్టు అందుకుంది. నివృతి వైబ్స్ యూట్యూబ్ ఛానల్‌లో రిలీజ్ అయిన ఈ సాంగ్ ట్రెండింగ్‌లో ఉంది. తాజాగా డుగ్గు డుగ్గు బుల్లెట్టో పాట యూట్యూబ్‌లో 2 మిలియన్ వ్యూస్ దక్కించుకుని దూసుకుపోతోంది.
పెళ్లి నేపథ్యంలో సాగే ఈ ఫోక్ సాంగ్‌లో జయతి తనదైన శైలిలో ఆకట్టుకుంది. అలాగే, డుగ్గు డుగ్గు బుల్లెట్టో పాటలోని లిరిక్స్ చాలా క్యాచీగా ఉంటూ అలరిస్తున్నాయి. ఈ పాటకు లిరిక్స్ రాయడంతోపాటు మ్యూజిక్ అందించింది సింగర్ భోలే షావలి. బిగ్ బాస్ తెలుగు 7 సీజన్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన భోలే షావలి తనదైన ఆటతో అలరించాడు.
ఇప్పుడు కొత్త సాంగ్ డుగ్గు డుగ్గు బుల్లెట్టోతో మరోసారి తన సంగీతం ఆకట్టుకున్నాడు సింగర్ భోలే షావలి. ఇదిలా ఉంటే, ఈ పాటను భోలే షావలి, వరం పాడారు. ఇందులో జయతితోపాటు ఆషిష్ గాంధీ నటించారు. డుగ్గు డుగ్గు బుల్లెట్టో పాటకు జితు మాస్టర్ కొరియోగ్రఫీ అందించగా.. షోయబ్ సినిమాటోగ్రాఫీ బాధ్యతలు చేపట్టారు. అలాగే, నర్సింగ్ రాథోడ్ ఎడిటింగ్ చేశారు.
ఇక సోషల్ మీడియాలో కూడా జయతి ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఆమెకు కెరీర్‌కు సంబంధించిన సాంగ్స్ ప్రమోషన్స్‌ను ఇన్‌స్టా గ్రామ్ వంటి సోషల్ మీడియాలో చేస్తోంది. అలాగే, గ్లామరస్ ఫొటోలు పెడుతూ అభిమానులు, ఫాలోవర్స్, నెటిజన్స్‌ను తనవైపునకు తిప్పుకుంటోంది.
టాపిక్