LIVE UPDATES
Andhra Pradesh News Live December 12, 2024: NIA searches in AP : ఏపీతో పాటు మరో 2 రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు - డిజిటల్ పరికరాలు స్వాధీనం
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 12 Dec 202404:12 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: NIA searches in AP : ఏపీతో పాటు మరో 2 రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు - డిజిటల్ పరికరాలు స్వాధీనం
- NIA searches in Andhra Pradesh: మావోయిస్టులకు ఆయుధాలు, పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్న కేసులో ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏపీలోని చింతూరులో సోదాలు నిర్వహించింది. సోదాల్లో కొన్ని డిజిటల్ పరికరాలు, పత్రాలు స్వాధీనం చేసుకుంది.
Thu, 12 Dec 202412:51 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Amaravati : అమరావతికి భారీగా నిధులు.. అభివృద్ధి పరుగులు.. ఫలించిన ప్రభుత్వం ప్రయత్నాలు!
- Amaravati : అమరావతిని అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబుకు అమరావతి డ్రీమ్ ప్రాజెక్టు. కానీ.. నిధులు భారీగా అవసరం అవుతున్నాయి. దీంతో ప్రభుత్వం వివిధ సంస్థలు, బ్యాంకులను రుణాలు అడిగింది. తాజాగా ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ భారీగా రుణం మంజూరు చేసింది.
Thu, 12 Dec 202410:58 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Vande Bharat Express : ఏపీకి మరో వందేభారత్ రైలు.. అనంతపురం మీదుగా విజయవాడ- బెంగళూరు మధ్య సర్వీసు
- Vande Bharat Express : రైల్వే ప్రయాణికులకు.. ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌కు మరో వందేభారత్ రైలు రానుంది. అనంతపురం మీదుగా విజయవాడ- బెంగళూరు మధ్య వందేభారత్ రైలును నడపనున్నారు. ఈ సర్వీసును త్వరలోనే ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Thu, 12 Dec 202408:26 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: CRDA R5 Zone: అమరావతిలో ఆర్5 జోన్ లబ్దిదారులకు సొంత జిల్లాల్లోనే ఇళ్ల స్థలాలు, హడ్కో నుంచి మరో రూ.12వేల కోట్ల రుణం
- CRDA R5 Zone: అమరావతి మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వ హయంలో కొత్తగా సృష్టించిన ఆర్ 5 జోన్‌పై కూటమి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన లబ్దిదారులకు సొంత జిల్లాల్లోనే ఇళ్ల స్థలాలను కేటాయించనున్నట్టు సీఆర్‌డిఏ కమిషనర్ భాస్కర్ కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు.
Thu, 12 Dec 202407:58 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: TDP 6 Months Rule : రాష్ట్రమే ఫస్ట్.. ప్రజలే ఫైనల్.. ఆరు నెలల పాలనపై చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- TDP 6 Months Rule : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 6 నెలలు అయ్యింది. ఈ 6 నెలల పాలనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రమే ఫస్ట్.. ప్రజలే ఫైనల్ నినాదంతో పరిపాలన చేస్తున్నట్టు వ్యాఖ్యానించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్‌తో పనిచేస్తున్నట్టు స్పష్టం చేశారు.
Thu, 12 Dec 202407:08 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Chittoor Rains: చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు, స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించిన కలెక్టర్
- Chittoor Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, తిరుమలలో గురువారం ఉదయం భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు అల్పపీడన ప్రభావంతో తిరుమలలో చలి తీవ్రత కూడా పెరిగింది.
Thu, 12 Dec 202405:52 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 8 ప్రత్యేక రైళ్లు పొడిగింపు
- Special Trains : రైల్వే ప్రయాణికులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడ మీదుగా బెంగళూరుకు ప్రత్యేక రైలును అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు ఇప్పటికే రాకపోకలు నిర్వహిస్తోన్న ఎనిమిది స్పెషల్ రైళ్లను నెల పాటు పొడిగించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Thu, 12 Dec 202405:29 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Welfare Pensions: అనర్హులకు పెన్షన్లు తొలగించాల్సిందే.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశం,
- AP Welfare Pensions: ఏపీలో అనర్హులైన వారికి పెన్షన్లను తొలగించాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. మూడు నెలల్లో అనర్హులను గుర్తించి తొలగించే పని పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాథమికంగా కనీసం 6లక్షల మంది అనర్హులకు పెన్షన్లు వెళుతుండొచ్చని మంత్రి నాదెండ్ల వివరించారు.
Thu, 12 Dec 202404:51 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Avanti Srinivas Resignation: వైసీపీని వీడిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, వైసీపీ తీరుపై విమర్శలు
- Avanti Srinivas Resignation: వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేవారు. వ్యక్తిగత కారణాలతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. వైసీపీ వ్యవహార శైలి నచ్చలేదని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఐదు నెలలు కూడా సమయం ఇవ్వకుండా విమర్శించడాన్ని తప్పు పట్టారు.
Thu, 12 Dec 202404:25 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Bapatla Crime: బాపట్ల జిల్లాలో దారుణం...తల్లి లేని బాలికపై సామూహిక అత్యాచారం
- Bapatla Crime: బాపట్ల జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తల్లి లేని బాలికపై ఒకరి తరువాత ఒకరు ఇద్దరు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి విచారణ జరిపారు. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై పోక్సో కేసు నమోదు చేశారు.
Thu, 12 Dec 202404:00 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Capital Issue: అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్
- AP Capital Issue: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో సాంకేతికంగా ఉన్న చిక్కుముడులను కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తోంది. అమరావతి చుట్టూ అల్లుకున్న వివాదాలను పరిష్కరించేలా చర్యలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని సుప్రీం కోర్టులో అఫిడవిట్ సమర్పించింది.
Thu, 12 Dec 202403:15 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Mangampet Murder: కుమార్తెపై లైంగిక వేధింపులు, ఫిర్యాదు పట్టించుకోని పోలీసులు, కువైట్ నుంచి వచ్చి మరీ చంపేశాడు…
- Mangampet Murder: తన కుమార్తెను తాత వరుసయ్యే వ్యక్తి లైంగికంగా వేధించాడని తల్లి పోలీసుల్ని ఆశ్రయించింది. నిందితుడిపై చర్యలు తీసుకోని పోలీసులు మందలించి పంపేశారు. పోలీసుల తీరుపై రగిలిపోయిన తండ్రి కువైట్ నుంచి వచ్చి నిందితుడ్ని హత్య చేసి తిరిగి వెళ్లిపోయాడు.తానే హత్య చేసినట్టు వీడియో విడుదల చేశాడు.
Thu, 12 Dec 202401:03 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Inter Caste Marriages: ఏపీలో కొత్త సమస్య.. ఆ కులాల్లో ఆడపిల్లల కొరత, కులాంతరమైనా ఫర్లేదంటున్న అబ్బాయిలు…
- Inter Caste Marriages: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ట్రెండ్ మొదలైంది. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందిన కొన్ని కులాలు తీవ్రమైన ఆడపిల్లల కొరత ఎదుర్కొంటున్నాయి. దీంతో సొంత కులంలో మగపిల్లలకు పెళ్లి కావడం కష్టమైపోతోంది. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా అన్ని చోట్ల ఇదే సమస్య నెలకొంది.
Thu, 12 Dec 202412:23 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Liquor Prices: ఎట్టకేలకు ఏపీలో తగ్గిన మద్యం ధరలు.. రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి కొత్త ధరలు..
- AP Liquor Prices: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు తగ్గుముఖం పట్టాయి. హిందుస్తాన్ టైమ్స్ తెలుగు కథనానికి ఏపీ ఎక్సైజ్ శాఖ స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ధరలతో మద్యం విక్రయాలను జరపాలని ఆదేశించడంతో పాతబాటిళ్లపై కొత్త స్టిక్కర్లు ప్రత్యక్షం అయ్యాయి. మాన్షన్ హౌస్ క్వార్టర్ బాటిల్ రూ.30 తగ్గింది.