స్వప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలను ఫణంగా పెట్టడం విజయవాడ రాజకీయానికే చెల్లుతుంది. అన్నీ సిద్ధంగా ఉన్నా వందే భారత్ రైలును మంజూరు చేయకుండా స్థానిక రాజకీయం అడ్డు పడుతోంది. ఏడాదిన్నర క్రితమే వందే భారత్ ర్యాక్ మెయింటెయినెన్స్ డిపో సిద్ధమైనా, సాంకేతిక సమస్యలు, రైళ్లు లేకపోవడంతో నిరుపయోగంగా మారింది.