తెలుగు న్యూస్ / ఫోటో /
Smriti Mandhana Record: చరిత్ర సృష్టించిన స్మృతి మంధానా.. ఆస్ట్రేలియాతో వన్డేలో వరల్డ్ రికార్డు
- Smriti Mandhana Record: స్మృతి మంధానా మరో వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో సెంచరీ చేయడం ద్వారా ఆమె ఈ రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ మహిళల క్రికెట్ లో ఎవరికీ సాధ్యం కాని రికార్డు అది.
- Smriti Mandhana Record: స్మృతి మంధానా మరో వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో సెంచరీ చేయడం ద్వారా ఆమె ఈ రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ మహిళల క్రికెట్ లో ఎవరికీ సాధ్యం కాని రికార్డు అది.
(1 / 6)
Smriti Mandhana Record: ఆస్ట్రేలియాపై సెంచరీతో ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ స్మృతి మంధానా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఒక క్యాలెండర్ ఇయర్ లో నాలుగు వన్డే సెంచరీలు సాధించిన తొలి మహిళా క్రికెటర్ గా రికార్డు సృష్టించింది.(BCCI X)
(2 / 6)
Smriti Mandhana Record: ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో ఇండియన్ టీమ్ ఓడినా.. స్మృతి క్రీజులో ఉన్నంత వరకూ మ్యాచ్ పై ఆశలు ఉన్నాయి. ఆమె 109 బంతుల్లో 105 పరుగులు చేసి ఔటైంది. ఆమె వెనుదిరగడంతో ఇక ఇండియన్ టీమ్ కోలుకోలేకపోయింది.(BCCI X)
(3 / 6)
Smriti Mandhana Record: ఆస్ట్రేలియాతో పెర్త్ లో ఈ మూడో వన్డే జరిగింది. ఇందులోనూ సెంచరీ సాధించిన స్మృతికి ఈ ఏడాది వన్డేల్లో ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. గతంలో ఏ మహిళా క్రికెటర్ ఒక ఏడాది ఇన్ని వన్డే సెంచరీలు చేయలేదు.
(4 / 6)
Smriti Mandhana Record: స్మృతి మంధానా కంటే ముందు ఒక ఏడాదిలో మూడు సెంచరీలు చేసిన మహిళా క్రికెటర్లు ఏడుగురు ఉన్నారు. అయితే వాళ్లలో ఎవరో నాలుగో సెంచరీ సాధించలేదు. కానీ స్మృతి సెంచరీ వృథా అయింది. మూడో వన్డేలో ఇండియన్ టీమ్ ఓడిపోయింది.
(5 / 6)
Smriti Mandhana Record: దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ (2024), మెగ్ లానింగ్ (2016), నాట్ స్కివర్-బ్రంట్ (2023), సోఫీ డివైన్ (2018), సిద్రా అమిన్ (2022), అమీ సాటర్త్వైట్ (2016), బెలిండా క్లార్క్ (1997) ఇప్పటివరకు ఒకే సంవత్సరంలో మూడు సెంచరీలు చేశారు.
ఇతర గ్యాలరీలు