Margasira Pournami: మార్గశిర పౌర్ణమి నాడు ఈ పరిహారాలను పాటిస్తే, అష్టైశ్వర్యాలు కలుగుతాయి-follow these remedies on margasira pournami for success wealth happiness and to stay healthy ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Margasira Pournami: మార్గశిర పౌర్ణమి నాడు ఈ పరిహారాలను పాటిస్తే, అష్టైశ్వర్యాలు కలుగుతాయి

Margasira Pournami: మార్గశిర పౌర్ణమి నాడు ఈ పరిహారాలను పాటిస్తే, అష్టైశ్వర్యాలు కలుగుతాయి

Peddinti Sravya HT Telugu
Dec 12, 2024 08:00 AM IST

Margasira Pournami: తిధుల్లో అమావాస్య, పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి కూడా ఎంతో పవిత్రమైనది. ఈ రోజు చేసే కొన్ని పనుల వలన విశేష ఫలితాలని పొందవచ్చు. మహావిష్ణువు అనుగ్రహం కలిగి, సంతోషంగా ఉండొచ్చు.

Margasira Pournami: మార్గశిర పౌర్ణమి నాడు ఈ పరిహారాలను పాటిస్తే, అష్టైశ్వర్యాలు కలుగుతాయి
Margasira Pournami: మార్గశిర పౌర్ణమి నాడు ఈ పరిహారాలను పాటిస్తే, అష్టైశ్వర్యాలు కలుగుతాయి

మార్గశిర పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని ఆరాధించడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. గంగా స్నానం చేసినా, దానం చేసిన కూడా ఎంతో మంచి జరుగుతుంది. మార్గశిర పౌర్ణమి నాడు ఏం చేయాలి, వేటిని దానం చేస్తే మంచిది? వంటి విషయాలు చాలా మందికి తెలియదు. పైగా తిధుల్లో అమావాస్య, పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి కూడా ఎంతో పవిత్రమైనది. ఈ రోజు చేసే కొన్ని పనుల వలన విశేష ఫలితాలని పొందవచ్చు. మహావిష్ణువు అనుగ్రహం కలిగి, సంతోషంగా ఉండొచ్చు.

ఈసారి మార్గశిర పౌర్ణమి ఎప్పుడు వచ్చింది?

పౌర్ణమి తిది డిసెంబర్ 14 శనివారం సాయంత్రం 4:58 గంటలకు మొదలైంది. ఆదివారం అంటే డిసెంబర్ 15 మధ్యాహ్నం రెండు 2:31 వరకు ఉంటుంది. ఉదయం తిది డిసెంబర్ 15న ఉంది కనుక ఆ రోజు ఉపవాసం చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు.

మార్గశిర పౌర్ణమి నాడు విశేష ఫలితాల కోసం వీటిని పాటించవచ్చు:

మార్గశిర పౌర్ణమి నాడు గాయత్రి మంత్రాన్ని పఠిస్తే మంచిది. అలాగే విష్ణు సహస్రనామాలను కూడా చదువుకోవచ్చు. ఇష్ట దైవాన్ని ఆరాధిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కనుక మీకు ఇష్టమైన దైవానికి సంబంధించి మంత్రాలని జపించవచ్చు.

కుదిరిన వాళ్ళు మార్గశిర పౌర్ణమి నాడు గంగా స్నానం చేస్తే మంచిది. స్తోమతకి తగ్గట్టు మీరు దానాలు కూడా చేయొచ్చు. దానాలు చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది.

దేవతలకి నివాసమైన రావి చెట్టుని ఆరాధిస్తే కూడా మార్గశిర పౌర్ణమి నాడు విశేష ఫలితాలని పొందడానికి అవుతుంది. మార్గశిర పౌర్ణమి నాడు ఉపవాసం ఉంటే కూడా మంచి జరుగుతుంది. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కష్టాల నుంచి గట్టెక్కొచ్చు.

ఎప్పటిలాగే మార్గశిర పౌర్ణమి నాడు కూడా తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి విష్ణుమూర్తిని ఆరాధించడం మంచిది.

సానుకూల ఆలోచనలతో భగవంతుని ఆరాధించడం వలన భగవంతుని అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆహారం కానీ బట్టలు కానీ డబ్బులు కానీ మీకు నచ్చినది మార్గశిర పౌర్ణమి నాడు దానం చేయొచ్చు. సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. పాపాలన్నీ కూడా తొలగిపోతాయి.

ఎవరు ఏం దానం చేస్తే మంచిది?

మార్గశిర పౌర్ణమి నాడు మేషరాశి వాళ్ళు గోధుమలు బెల్లాన్ని దానం చేయడం మంచిది. వృషభ రాశి వారు బెల్లం, పంచదార దానం చేయాలి. మిధున రాశి వారు కూరగాయల్ని దానం చేస్తే పూర్ణచంద్రుడి అనుగ్రహం కలుగుతుంది. కర్కాటక రాశి వారు పెరుగు, పాలు దానం చేయడం మంచిది. సింహ రాశి వారు వేరుశనగ, తేనె దానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ధన లాభం కూడా కలుగుతుంది.

కన్యా రాశి వారు మొక్కజొన్న, చెరుకు దానం చేయడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. తుల రాశి వాళ్ళు తెల్లని వస్త్రం దానం చేయాలి. వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు దుస్తుల్ని దానం చేయాలి. ధనస్సు రాశి వారు పసుపు రంగు దుస్తుల్ని దానం చేయాలి. మకర రాశి వారు చెప్పులు, గొడుగు దానం చేయడం మంచిది. కుంభ రాశి వారు నీలిరంగు వస్త్రాలు, నల్ల నువ్వులు దానం చేస్తే మంచిది. మీనా రాశి వారు బొప్పాయి, అరటి పండ్లు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి.

Whats_app_banner

సంబంధిత కథనం