Weightloss tips: వ్యాయామం, డైటింగ్ లేకుండా తింటూనే సులువుగా బరువు ఇలా తగ్గండి
Weightloss tips: వర్కవుట్స్, డైటింగ్ లేకుండా బరువు తగ్గే చిట్కాలు ఉన్నాయి. దానికి మీరు చేయాల్సిందల్లా ఆరోగ్యంగా తినడమే. తింటూ బరువు ఎలా తగ్గొచ్చో డైటీషియన్లు వివరిస్తున్నారు. ఈ వెయిట్ లాస్ టిప్స్ అందరికీ ఉపయోగపడతాయి.
ఈ రోజుల్లో చాలా మందికి బరువు పెరగడం పెద్ద సమస్యగా మారింది. బరువు తగ్గడానికి అనేక రకాల వ్యాయామాలు, డైటింగ్ వంటివి చేస్తూ ఉంటారు. కానీ అవేవీ బరువును సులువుగా తగ్గించలేకపోతున్నాయి. అయితే జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వార బరువును సులువుగా తగ్గించుకోవచ్చు. గురుగ్రావ్ కు చెందిన డైటీషియన్ డాక్టర్ అన్షుల్ సింగ్ బరువు తగ్గడానికి కొన్ని సులభమైన చిట్కాలను చెబుతున్నారు. దీని ప్రకారం తీవ్రమైన వ్యాయామాలు, డైటింగ్ లేకుండా కూడా బరువు తగ్గవచ్చు.
జీవనశైలి మార్పులు
బరువు తగ్గడానికి కొన్ని జీవనశైలిలో మార్పులు చేయడం ఒక ముఖ్యమైన దశ. ఈ చిన్న మార్పులు బరువు నియంత్రణలో చాలా సహాయపడతాయి. ప్రతి రోజూ నిద్రా వేళలు మారడం వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది, ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. అటువంటి పరిస్థితిలో, రాత్రిపూట 7-8 గంటల నిద్ర తీసుకోవడం బరువు నియంత్రణకు సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గించడం వల్ల బరువు తగ్గవచ్చు. యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి ఒత్తిడిని తగ్గించుకోవడానికి కీలకం.
తగినంత నీరు త్రాగాలి
తగినంత నీరు త్రాగటం కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నీరు లేకపోవడం జీవక్రియపై దుష్ప్రభావాన్ని చూపుతుంది, ఇది బరువును పెంచేస్తుంది. నీరు మీరు ఎంతగా తాగితే అంత ఆరోగ్యం. డైటింగ్ మాత్రమే కాదు, ఆహారపు అలవాట్లలో కొన్ని సాధారణ మార్పులు చేయడం కూడా బరువు నియంత్రణకు సహాయపడుతుంది. ఆహారంలో పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకోండి. వీటిలో ఉండే ఫైబర్, విటమిన్లు వంటివి బరువు తగ్గడానికి సహాయపడతాయి.
తృణధాన్యాల వినియోగం
తృణధాన్యాల వినియోగం కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చక్కెర, కొవ్వు ఉన్న పదార్థాలను తినడం మానేస్తే బరువు సులువుగా తగ్గుతారు. చక్కెర, కొవ్వు ఉన్న ఆహారాలలో కేలరీలు అధికంగా ఉంటాయి, ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.
మెట్లు ఎక్కడం
నడక బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నడక శరీరంలోని క్యాలరీలను కరిగించి బరువును నియంత్రిస్తుంది. మెట్లు ఎక్కడం కూడా ఎంతో ఆరోగ్యకరమైన పద్ధతి. సాధ్యమైనంత వరకు ఎలివేటర్లకు బదులుగా మెట్లను ఉపయోగించండి. ఇది బరువు నియంత్రణకు సహాయపడుతుంది.
యోగా
యోగా, ధ్యానం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు బరువు నియంత్రణకు సహాయపడతాయి. వీటిని ప్రతిరోజూ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. బరువు నియంత్రణకు సహాయపడుతుంది.
ఆహారాన్ని తగ్గించుకోవడం ద్వారా కూడా బరువును తగ్గొచ్చు. మనదేశంలో మూడు పూటలా భోజనం చేస్తారు. దాన్ని రెండు పూటలకు తగ్గించండి. ఒక పూట తేలికపాటి పండ్లతో సరిపెట్టుకోండి. ఇది కూడా బరువు త్వరగా తగ్గేందుకు సహకరిస్తుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)