Margashira pournami: మార్గశిర పౌర్ణమి ఈ రోజే, ఇలా చేశారంటే ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి.. ధనవంతులు అవుతారు-margashira pournami december 2023 maa lakshmi devi puja for releving financial crisis ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Margashira Pournami: మార్గశిర పౌర్ణమి ఈ రోజే, ఇలా చేశారంటే ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి.. ధనవంతులు అవుతారు

Margashira pournami: మార్గశిర పౌర్ణమి ఈ రోజే, ఇలా చేశారంటే ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి.. ధనవంతులు అవుతారు

Gunti Soundarya HT Telugu
Dec 26, 2023 09:52 AM IST

Margashira pournami: పౌర్ణమి రోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. విష్ణువు ఆరాధించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి.

లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇలా పూజించండి
లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇలా పూజించండి (freepik)

Margashira pournami: హిందూమతంలో పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పౌర్ణమి రోజు విష్ణువు, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఏడాది వచ్చిన చివరి పౌర్ణమి ఇదే. మార్గశిర మాసంలోని వచ్చిన పౌర్ణమి డిసెంబర్ 26, 2023న వచ్చింది. పౌర్ణమి డిసెంబర్ 26 ఉదయం 5.46 నుంచి డిసెంబర్ 27 ఉదయం 6.02 గంటల వరకు ఉంటుంది.

పౌర్ణమి రోజున పూజలు, ఉపవాస దీక్షలు చేస్తారు. ఇలా చేయడం వల్ల సుఖ సంతోషాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. దానధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని విశ్వసిస్తారు. ఈరోజు మొత్తం విష్ణువు, లక్ష్మీదేవిని పూజిస్తారు. పౌర్ణమి నాడు చంద్రుని ఆరాధనకి విశేష ప్రాధాన్యత ఉంటుంది. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది.

పౌర్ణమి రోజు పూజా విధి

ఈ పవిత్రమైన రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయాలి. పవిత్ర నదుల్లో స్నానమాచారించడం మంచిది. ఇంట్లోని ఆలయంలో దీపం వెలిగించాలి. ఉపవాసం చేస్తే చాలా మంచిది. గంగా జలంతో దేవతలందరికీ అభిషేకం చేస్తారు. మహావిష్ణువు ఆరాధనకి విశేష ప్రాముఖ్యత ఉంటుంది. విష్ణుమూర్తికి నైవేద్యాలు సమర్పించాలి. తులసి లేకుండా విష్ణు పూజ చేయకూడదు. సాత్విక వస్తువులు మాత్రమే భగవంతుడికి సమర్పించాలి. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మంచిది. ఇంటి చుట్టుపక్కన ఆవు ఉంటే వాటికి ఆహారం పెట్టాలి. ఇలా చేయడం వల్ల అనేక రకాల లోపాల నుంచి బయట పడొచ్చు.

పౌర్ణమి రోజు కొన్ని పరిహారాలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. అమ్మవారి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురుకావు. సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. లక్ష్మీదేవి సంపదకి అధిదేవత. ఆమె అనుగ్రహం పొందితే ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఈరోజు కొన్ని పరిహారాలు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. సంపద పెరుగుతుంది. ఆర్థిక కష్టాలు తీరిపోతాయి. పౌర్ణమి రోజు ఇలా చేశారంటే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి

చంద్రుడికి అర్ఘ్యం

చంద్రుడు ఉదయించినప్పుడు పచ్చి పాలలో చక్కెర, బియ్యం కలిపి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని మత విశ్వాసాలు చెబుతున్నాయి. హిందూ మతంలో చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది.

లక్ష్మీదేవి ఆరాధన

పౌర్ణమి పర్వదినాన విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవికి సుగంధ ద్రవ్యాలు, సువాసనలు వెదజల్లే ధూపం, గులాబీ పువ్వులు సమర్పించాలి. లక్ష్మీదేవిని పూజించడం వల్ల జీవితంలో డబ్బుకి సంబంధించి సమస్యలు రావు. నైవేద్యంగా లక్ష్మీదేవికి ఖీర్ సమర్పించవచ్చు. లక్ష్మీదేవికి ఖీర్ అంటే చాలా ఇష్టం.

హనుమంతుని ఆరాధన

పౌర్ణమి రోజు హనుమంతుని ఆరాధించాలి. హనుమంతుని అనుగ్రహంతో అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శుభ ఫలితాలు చూస్తారు. ఈరోజు హనుమాన్ చాలీసా ఒకటి కంటే ఎక్కువ సార్లు పఠించాలి. శ్రీరాముడు సీతాదేవి నామాలు జపించడం వల్ల వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి.

 

Whats_app_banner