UPSC Mains 2024 : రాజీవ్ సివిల్స్ అభయ హస్తం సాయం- యూపీఎస్సీ మెయిన్స్ లో 20 మంది ఉత్తీర్ణత-tg rajiv civils abhaya hastham scheme support 20 candidates passed in upsc mains ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Upsc Mains 2024 : రాజీవ్ సివిల్స్ అభయ హస్తం సాయం- యూపీఎస్సీ మెయిన్స్ లో 20 మంది ఉత్తీర్ణత

UPSC Mains 2024 : రాజీవ్ సివిల్స్ అభయ హస్తం సాయం- యూపీఎస్సీ మెయిన్స్ లో 20 మంది ఉత్తీర్ణత

Bandaru Satyaprasad HT Telugu
Dec 11, 2024 06:44 PM IST

UPSC Mains 2024 : యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. రాజీవ్ సివిల్స్ అభయ హస్తం సాయం పొందిన వారిలో 20 మంది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.

 రాజీవ్ సివిల్స్ అభయ హస్తం సాయం- యూపీఎస్సీ మెయిన్స్ లో 20 మంది ఉత్తీర్ణత
రాజీవ్ సివిల్స్ అభయ హస్తం సాయం- యూపీఎస్సీ మెయిన్స్ లో 20 మంది ఉత్తీర్ణత

UPSC Mains 2024 : యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్-2024 పరీక్ష ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. ఈ ఏడాది మొదటిసారిగా రాష్ట్రం నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. సివిల్స్​కు ప్రిపేర్ అవుతున్న పేద కుటుంబీకులకు అండగా నిలిచేందుకు రాజీవ్ సివిల్స్ అభ‌య హ‌స్తం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేసింది. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో 135 మందికి రూ. ల‌క్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది. ఈ ఏడాది ఆగస్ట్ 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సివిల్స్ అభ్యర్థులకు చెక్కులు పంపిణీ చేశారు.

yearly horoscope entry point

రాజీవ్ సివిల్స్ అభయ హస్తం సాయం అందుకున్న అభ్యర్థుల్లో 20 మంది యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్​ ఫలితాల్లో విజేతలుగా నిలిచారు. వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన ఈ. సాయి శివాని, రాహుల్ శంకేషి, పోతరాజు హరి ప్రసాద్, విక్రమ్ బేతి, ఖమ్మం జిల్లాకు చెందిన నల్లమల సాయికుమార్ , బానోతు నాగ రాజా నాయక్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన కడారి శ్రీవాణి, గాదె శ్వేత, రాపర్తి ప్రీతి, మెదక్ జిల్లాకు చెందిన కుమ్మరి శ్రవణ్ కుమార్, రంగారెడ్డి జిల్లాకు చెందిన మొహమ్మద్ అశ్ఫాక్, తొగరు సూర్యతేజ, మహబూబాబాద్ జిల్లాకు చెందిన బెస్త ప్రియాంజలి, సిద్ధిపేటకు చెందిన నరిగె స్వామి, నాగర్‌కర్నూలుకు చెందిన గోకమల్ల ఆంజనేయులు, ఆదిలాబాద్‌కు చెందిన ఆర్. ప్రమోద్ కుమార్, వికారాబాద్‌కు చెందిన బి. ప్రహ్లాద్, జగిత్యాలకు చెందిన బురుగుపెల్లి నీరజ్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన జస్వంత్ కుమార్, అసిఫాబాద్-కుమ్రంభీం జిల్లాకు చెందిన రామ్టెంకి సుధాకర్ సివిల్స్ మెయిన్స్​ క్వాలిఫై అయిన జాబితాలో ఉన్నారు.

తెలంగాణ నుంచి మెయిన్స్ ఫలితాల్లో విజయం సాధించి ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులందరికీ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం కింద ప్రభుత్వం లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన వారిలో 20 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు ఎంపిక కావడం పట్ల సీఎం అభినందనలు తెలిపారు. తెలంగాణ నుంచి ఎక్కువ మంది సివిల్స్ సాధించేలా తదుపరి దశల్లోనూ అభ్యర్థులు రాణించాలని సీఎం ఆకాంక్షించారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణులై ఇంట‌ర్వ్యూకు అర్హత సాధించిన వారికి మ‌రో రూ.ల‌క్ష అందిస్తామ‌ని సీఎం గతంలో హామీ ఇచ్చారు.

యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాలు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్ 2024 ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ upsconline.nic.in, upsc.gov.inలో చూసుకోవచ్చు. మెయిన్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇప్పుడు ఇంటర్వ్యూ రౌండ్ కు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ షెడ్యూల్ ను త్వరలోనే వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నారు. అభ్యర్థులు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రధాన కార్యాలయం, ధోల్పూర్ హౌస్, షాజహాన్ రోడ్, న్యూఢిల్లీ-110069లో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం