Jio New Year Welcome Plan: జియో నుంచి కొత్తగా ‘న్యూ ఇయర్ వెల్‌కమ్ ప్లాన్’.. ప్రయోజనాలు ఇవే..
Jio New Year Welcome Plan: ప్రముఖ టెలీకాం ప్రొవైడర్ జియో నూతన సంవత్సరం సందర్భంగా వినియోగదారులకు అద్భుతమైన ప్రయోజనాలతో కొత్త ప్లాన్ ను తీసుకువచ్చింది. ఈ ‘2025 న్యూ ఇయర్ వెల్‌కమ్ ప్లాన్’ అందించే ప్రయోజనాలను ఇక్కడ చూద్దాం..
Jio New Year Welcome Plan: పలు ఉత్తేజకరమైన ప్రయోజనాలతో రూ. 2025 ‘న్యూ ఇయర్ వెల్‌కమ్ ప్లాన్’ను జియో తీసుకువచ్చింది. రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం సాటిలేని విలువతో 2025 కిక్‌స్టార్ట్ చేయడానికి ప్రత్యేక ‘న్యూ ఇయర్ వెల్‌కమ్ ప్లాన్ రూ. 2025’ని ప్రారంభించింది. ఈ ప్లాన్ ను డిసెంబర్ 11, 2024 నుండి జనవరి 11, 2025 మధ్య రీచార్జ్ చేసినవారికి ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి.
జియో న్యూ ఇయర్ వెల్‌కమ్ ప్లాన్ వివరాలు
- ఈ ప్లాన్ ధర రూ. 2025.
• ఈ ప్లాన్ తో 200 రోజుల పాటు అపరిమిత 5G యాక్సెస్ లభిస్తుంది.
• 500 GB 4G డేటా (2.5 GB/రోజు) లభిస్తుంది.
• అపరిమిత వాయిస్ కాల్‌లు, SMSలు లభిస్తాయి.
• అదనంగా, రూ. 2150 విలువైన పార్ట్ నర్ కూపన్స్.
రూ.349తో సమానమైన నెలవారీ ప్లాన్‌తో పోలిస్తే, హై-స్పీడ్ కనెక్టివిటీ, ఆకర్షణీయమైన ఆదాతో రూ. 468 ల విలువైన ప్రయోజనాలను పొందవచ్చు.
ప్రత్యేక భాగస్వామి కూపన్లు
రూ. 2025 ప్లాన్ తో సబ్‌స్క్రైబ్ చేసుకున్నవారు రూ. 2150 విలువైన పార్ట్ నర్ కూపన్స్ లభిస్తాయి. వాటిని ఆయా స్టోర్స్ లేదా సైట్స్ లో రీడీమ్ చేసుకోవచ్చు. ఆ కూపన్స్ ఇవే..
1.రూ.500 AJIO కూపన్: అజియో లో రూ.2500 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోళ్లపై రీడీమ్ చేసుకోవచ్చు.
2. Swiggyపై రూ. 150 తగ్గింపు: రూ. 499 ఆర్డర్‌పై రూ. 150 డిస్కౌంట్ కూపన్.
3. EaseMyTripపై రూ. 1500 తగ్గింపు: మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా విమాన బుకింగ్‌లకు చెల్లుబాటు అవుతుంది.