Cars Discount : ఈ కార్లపై బంపర్ ఆఫర్స్.. ధర పెరగకముందే కొనుగోలు చేస్తే డబ్బులు సేవ్!
Cars Discount : కొన్ని కార్ల ధరలు 2025లో పెరుగుతాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అలాంటప్పుడు మీరు ఇప్పుడే కొనుగోలు చేస్తే డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. కొన్ని మారుతి సుజుకి కార్లపై డిస్కౌండ్ నడుస్తోంది. వాటిపై ఓ లుక్కేయండి.
భారత్‌లో ఎక్కువగా కొనుగోలు చేసే కార్లలో మారుతి సుజుకి కంపెనీకి చెందిన కార్లు ముందువరుసలో ఉంటాయి. కస్టమర్లకు మంచి ఫీచర్లతో బడ్జెట్ ధరలో ఈ కార్లు వస్తాయి. ఈ కంపెనీ తమ కార్లపై మంచి ఆఫర్లు అందిస్తుంది. ఇప్పటికే పలు కంపెనీలు తమ కార్ల ధరలో కొత్త సంవత్సరంలో పెంచుతున్నట్టుగా ప్రకటించాయి. మారుతి కార్ల ధరలు కూడా ఎంతో కొంత పెరిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు. తక్కువ ధరతో మంచి మైలేజీ ఇచ్చే కార్ల కోసం చూస్తుంటే ఇప్పుడు సరైన సమయం అనుకోవచ్చు. మారుతి కార్లపై ఉన్న డిస్కౌంట్ గురించి చూద్దాం..
మారుతి సుజుకి ఆల్టో K10 టాప్-స్పెక్ VXi+ (డ్రీమ్ సిరీస్) ట్రిమ్‌ని ఎంచుకోవాలనుకుంటే రూ. 43,302 నగదు తగ్గింపు లభిస్తుంది. అదే సమయంలో దాని మాన్యువల్, సీఎన్జీ వేరియంట్‌లపై రూ.40,000 నగదు తగ్గింపు అందుబాటులో ఉంది.
మారుతి స్విఫ్ట్ 2024 బేస్-స్పెక్ ఎల్ఎక్స్ఐ మాన్యువల్, హై-స్పెక్ జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ ఏఎంటీ వేరియంట్‌ల కోసం చూస్తున్న కస్టమర్‌లు రూ.75,000 వరకు తగ్గింపు వస్తుంది. ఇందులో రూ.50,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 25,000 వరకు స్క్రాపేజ్ బోనస్ ఉంటాయి.
మిడ్ స్పెక్ వీఎక్స్ఐ, వీఎక్స్ఐ (ఓ) ఏఎంటీ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ ఎంటీ, జెడ్ఎక్స్ఐ సీఎన్జీ వేరియంట్‌లు రూ. 45,000 వరకు క్యాష్ డిస్కౌంట్ తీసుకువస్తాయి. ఇందులో రూ. 25,000 వరకు స్క్రాపేజ్ బోనస్ కూడా ఉంది.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ టర్బో వేరియంట్‌లో రూ. 40,000 వినియోగదారు ప్రయోజనాలు లభిస్తాయి. రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 43,000 విలువైన యాక్సెసరీలు అందుబాటులో ఉంటాయి.
మారుతి సుజుకి దాని హ్యాచ్‌బ్యాక్ కార్లపై రూ. 75,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఇందులో ఎస్ ప్రెస్సో, వ్యాగన్ ఆర్, సెలెరియో, బాలెనో ఉన్నాయి. మరోవైపు ఈకో ఎంపీవీ దాదాపు రూ. 20,000 తగ్గింపుతో వస్తుంది. ప్రీమియం ఎక్స్ఎల్6 ఎంపీవీ దాదాపు రూ. 40,000 తగ్గింపును అందిస్తుంది.
మారుతి సుజుకి పాత డిజైర్ అన్ని ఏఎంటీ వేరియంట్‌లపై రూ. 40 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ. 15,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 25,000 వరకు స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి. సెడాన్ సీఎన్జీ ట్రిమ్‌లపై ఎటువంటి తగ్గింపు అందుబాటులో లేదు.
గమనిక : ఈ ఆఫర్‌లు వివిధ నగరాల్లో మారుతూ ఉండవచ్చు. ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. దయచేసి దగ్గరలోని డీలర్‌షిప్‌ను సంప్రదించి ఆఫర్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి.