AP SSC Exams Schedule : ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల-మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు-ap ssc exams schedule released exams starts from march 17 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ssc Exams Schedule : ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల-మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు

AP SSC Exams Schedule : ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల-మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు

Bandaru Satyaprasad HT Telugu
Dec 11, 2024 08:35 PM IST

AP SSC Exams Schedule : ఏపీ పదో తరగతి షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.

ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల (HT)

AP SSC Exams Schedule : ఏపీ పదో తరగతి షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. మంత్రి లోకేశ్ టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల చేశారు.

yearly horoscope entry point

పదో తరగతి పరీక్షల షెడ్యూల్

  • మార్చి 17 -ఫస్ట్ లాంగ్వేజ్
  • మార్చి 19-సెకండ్ లాంగ్వేజ్
  • మార్చి 21- ఇంగ్లీష్
  • మార్చి 24 -గణితం
  • మార్చి 26- ఫిజిక్స్
  • మార్చి 28 - బయోలజీ
  • మార్చి 31 - సోషల్

"మార్చి 2025 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మీరు మెరుగ్గా ప్రిపేర్ అవ్వడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి, మేము ప్రత్యామ్నాయ రోజులలో పరీక్షలను ప్లాన్ చేశాము. ఈ అదనపు సమయాన్ని అధ్యయనం చేయడానికి, అద్భుతమైన స్కోర్‌లను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించుకోండి. నా సోదరులు, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు" - మంత్రి లోకేశ్

ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్


ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2025 పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా విడుదల చేశారు. మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఇంటర్‌ రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఒకేషనల్ విద్యార్థులకు కూడా ఇవే తేదీలలో పరీక్షలు నిర్వహిస్తారు. ఒకేషనల్ విద్యార్థుల టైమ్‌ టేబుల్ విడిగా విడుదల చేస్తారు.

ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్

  • మార్చి 1- సెకండ్ లాంగ్వేజ్ పేపర్‌ 1
  • మార్చి 4 - ఇంగ్లీష్ పేపర్‌ 1
  • మార్చి 6- మ్యాథ్స్‌ పేపర్ 1ఏ, బోటనీ పేపర్ 1, సివిక్స్‌ పేపర్ 1
  • మార్చి 8 - మ్యాథ్స్‌ పేపర్ 1బి, జువాలజీ పేపర్‌ 1, హిస్టరీ పేపర్ 1
  • మార్చి 11 - ఫిజిక్స్‌ పేపర్ 1, ఎకనామిక్స్‌ పేపర్ 1
  • మార్చి 13- కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్‌ పేపర్ 1, సోషియాలజీ పేపర్‌ 1, ఫైన్ ఆర్ట్స్‌, మ్యూజిక్ పేపర్ 1
  • మార్చి 17 -పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్ 1, లాజిక్ పేపర్ 1, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌(బైపీసీ విద్యార్థుల కోసం)
  • మార్చి 19 -మోడరన్ లాంగ్వేజ్‌ పేపర్1, జాగ్రఫీ పేపర్ 1

ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్

  • మార్చి 3 -సెకండ్ లాంగ్వేజ్ పేపర్‌ 2
  • మార్చి 5 - ఇంగ్లీష్‌ పేపర్‌ 2
  • మార్చి 7-మ్యాథ్స్‌ పేపర్ 2ఏ, బోటనీ పేపర్ 2, సివిక్స్‌ పేపర్ 2
  • మార్చి 10- మ్యాథ్స్‌ పేపర్ 2బి, జువాలజీ పేపర్‌ 2, హిస్టరీ పేపర్ 2
  • మార్చి 12- ఫిజిక్స్‌ పేపర్ 2, ఎకనామిక్స్‌ పేపర్ 2
  • మార్చి 15 - కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్‌ పేపర్ 2, సోషియాలజీ పేపర్‌ 2, ఫైన్ ఆర్ట్స్‌, మ్యూజిక్ పేపర్ 2
  • మార్చి 18- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్ 2, లాజిక్ పేపర్ 2, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌ 2(బైపీసీ విద్యార్థుల కోసం)
  • మార్చి 20 -మోడరన్ లాంగ్వేజ్‌ పేపర్2, జాగ్రఫీ పేపర్ 2

Whats_app_banner

సంబంధిత కథనం