Google Pixel 7A : గూగుల్ పిక్సెల్ 7ఏపై కనీవినీ ఎరుగని డిస్కౌంట్.. రూ.18 వేల వరకు ఆదా చేసుకోవచ్చు
Google Pixel 7A Discount : గూగుల్ పిక్సెల్ 7ఏ ఫోన్ మీద మంచి డిస్కౌండ్ నడుస్తోంది. గూగుల్ పిక్సెల్ ఫోన్ కొనాలనుకునేవారికి ఇది సరైన సమయం. భారీ తగ్గింపుతో ఈ ఫోన్ వస్తుంది.
గూగుల్ ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది. టెక్ దిగ్గజం గూగుల్ విభిన్న శ్రేణి మొబైల్స్ ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం గూగుల్ పిక్సెల్ 7ఏ ఫోన్ ధరను తగ్గించింది. ఈ మొబైల్ కొంటే 18,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఫోన్ కొత్త ధర, ఆఫర్లు, ప్రత్యేక ఫీచర్లను తెలుసుకుందాం.
ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ గూగుల్ పిక్సెల్ 7 స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్‌ను ప్రకటించింది. కొత్త ఫోన్ కొనుగోలుదారులకు ఇది బెటర్ ఆప్షన్. ఈ మొబైల్‌లో 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది Tensor G2 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఫోన్ 6.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో 128జీబీ స్టోరేజ్, 4300mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి.
కంపెనీ గత ఏడాది గూగుల్ పిక్సెల్ 7 ఫోన్‌ను విడుదల చేసింది. ఫోన్ 8జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.43,999 ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 36 శాతం తగ్గింపును అందిస్తోంది. ఈ ఫోన్ కేవలం రూ.27,999కే విక్రయిస్తున్నారు. బ్యాంక్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. డిస్కౌంట్ తర్వాత మీరు ఈ మొబైల్‌ను రూ.25,999కి కొనుగోలు చేయవచ్చు. దీని ద్వారా 18,000 వరకు సేవ్ చేయవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. అలాగే, మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగిస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ ఫోన్ చార్‌కోల్, కోరల్, సీ, స్నో రంగులలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
గూగుల్ పిక్సెల్ 7 మొబైల్ 6.1 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 2400 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ 3 రక్షణను కలిగి ఉంది. గూగుల్ పిక్సెల్ 7 ఫోన్‌లో Tensor G2 ప్రాసెసర్ ఉంది. ఇందులో టైటాన్ ఎమ్2 ప్రాసెసర్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఓఎస్‌తో పనిచేస్తుంది. సరికొత్త ఆండ్రాయిడ్ 15 ఓఎస్‌కి కూడా సపోర్ట్ చేస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మద్దతుతో 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంది. ఇందులో 13 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.
గూగుల్ పిక్సెల్ 7 మొబైల్ 4300mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం ఉంటుంది. ఈ ఫోన్ నీరు, దుమ్ము నుండి సేఫ్టీ కోసం ఐపీ67 రేటింగ్‌ను కలిగి ఉంది.