Realme 14x: రియల్మీ 14ఎక్స్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ వచ్చేసింది; ఇవే స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్-realme 14x with ip69 rating 6 000mah battery and more set to launch in india on december 18 all details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Realme 14x: రియల్మీ 14ఎక్స్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ వచ్చేసింది; ఇవే స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్

Realme 14x: రియల్మీ 14ఎక్స్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ వచ్చేసింది; ఇవే స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్

Sudarshan V HT Telugu
Dec 11, 2024 05:08 PM IST

Realme 14x launch: రియల్మీ 14ఎక్స్ స్మార్ట్ఫోన్ ను డిసెంబర్ 18న భారత్ లో లాంచ్ చేయనున్నట్లు రియల్మీ ధృవీకరించింది. చైనా దిగ్గజ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్మీ నుంచి వస్తున్న మరో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ఇది. దీని ధర, ఫీచర్లకు సంబంధించిన కీలక వివరాలను ఇక్కడ చూడండి..

 రియల్మీ 14ఎక్స్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్
రియల్మీ 14ఎక్స్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ (Flipkart)

Realme 14x launch: రియల్మీ 14ఎక్స్ స్మార్ట్ పోన్ ను డిసెంబర్ 18న భారత్ లో లాంచ్ చేయనున్నట్లు రియల్మీ ప్రకటించింది. రియల్మీ 14 ప్రో, రియల్మీ 14 ప్రో+ మోడళ్లను కలిగి ఉన్న రియల్మీ 14 ప్రో సిరీస్ ను ప్రవేశపెట్టే ప్రణాళికలను కంపెనీ వెల్లడించిన కొద్దిసేపటికే ఈ ప్రకటన వచ్చింది. అయితే ఈ రెండు లాంచ్ లు ఒకే రోజు జరుగుతాయా లేక వేర్వేరు తేదీల్లో జరుగుతాయా అనే విషయాన్ని రియల్ మీ ఇంకా వెల్లడించలేదు.

రియల్ మీ 14ఎక్స్: ధర

లాంచ్ కు ముందు రియల్ మీ 14ఎక్స్ మోడల్ గురించి కొన్ని కీలక వివరాలను పంచుకుంది. ఇది మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ గా తెలుస్తోంది. దీని ధర రూ. 15,000 లోపు ఉండవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ధరను కంపెనీ ఇంకా అధికారిక ధరను ప్రకటించలేదు. కానీ, ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన రియల్మీ 12ఎక్స్ బేస్ వేరియంట్ ధర రూ.11,999 గా ఉంది. హై ఎండ్ వేరియంట్ ధర రూ.14,999. గా ఉంది. అందువల్ల రియల్మీ 14 ఎక్స్ కు కూడా ఇదే ధరల స్ట్రాటెజీని ఫాలో కావచ్చని తెలుస్తోంది. రియల్మీ 14ఎక్స్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కు సంబంధించి ఐపీ69 రేటింగ్ కలిగిన తొలి స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం.

ఫ్లిప్ కార్ట్ లో సేల్

రియల్ మీ 14 ఎక్స్ స్మార్ట్ ఫోన్ ను డిసెంబర్ 18వ తేదీన లాంచ్ అయిన సమయం నుంచి ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. లాంచ్ (smart phones launch) ఈవెంట్ డిసెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. రియల్మీ 14 ఎక్స్ కలర్స్ స్కీమ్ లను రియల్మీ తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో టీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ జ్యువెల్ రెడ్, గోల్డెన్ గ్లో, క్రిస్టల్ బ్లాక్ అనే మూడు రంగుల్లో లభిస్తుంది.

రియల్ మీ 14ఎక్స్: స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్

రియల్ మీ 14ఎక్స్ ఫోన్ (smartphones) స్పెసిఫికేషన్లను కూడా అధికారికంగా వెల్లడించలేదు. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్ల గురించి అనేక లీకులు వెల్లడయ్యాయి. రియల్ మీ (realme) 14ఎక్స్ 6.67 అంగుళాల హెచ్ డీ+ ఎల్ సీడీ డిస్ ప్లే, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుందని తెలుస్తోంది. రియల్ మీ 14ఎక్స్ మూడు కాన్ఫిగరేషన్లలో లభిస్తుందని మరిన్ని లీకులు సూచిస్తున్నాయి. అవి 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో కూడిన బేస్ మోడల్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో మిడ్ టైర్ వెర్షన్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తో టాప్ వేరియంట్.

Whats_app_banner