AP Housing Scheme : ఇల్లు లేని వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, సొంతింటి నిర్మాణానికి ఆర్థికసాయం-ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి-ap govt good news to housing for poor applications opened in sachivalayams ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Housing Scheme : ఇల్లు లేని వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, సొంతింటి నిర్మాణానికి ఆర్థికసాయం-ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి

AP Housing Scheme : ఇల్లు లేని వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, సొంతింటి నిర్మాణానికి ఆర్థికసాయం-ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి

HT Telugu Desk HT Telugu
Dec 11, 2024 05:53 PM IST

AP Housing Scheme : సొంతింటి క‌ల‌ను నెరవేర్చుకోవ‌డానికి ఎదురు చూస్తున్నారా? అయితే ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సంబంధిత స‌చివాలయానికి వెళ్లి ద‌ర‌ఖాస్తు తీసుకుని, దానికి అవ‌స‌ర‌మైన ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు జత చేసి సొంతింటి నిర్మాణానికి ఆర్థిక సాయం పొందవచ్చు.

ఇల్లు లేని వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, సొంతింటి నిర్మాణానికి ఆర్థికసాయం-ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి
ఇల్లు లేని వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, సొంతింటి నిర్మాణానికి ఆర్థికసాయం-ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి

AP Housing Scheme : రాష్ట్రంలో కూట‌మి ప్రభుత్వం ప‌క్కా ఇల్లు లేనివారికి గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజ‌న (పీఎంఏవై) 2.0 కింద రాష్ట్రంలో ప‌క్కా ఇళ్లు నిర్మాణానికి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించింది. బెనిఫిషయ‌రీ ల్యాండ్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ (బీఎల్‌సీ) కింద అంటే భూమి ఉండి ఇల్లు నిర్మించుకోవాల‌నుకునే వారి వ‌ద్ద నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తున్నారు. ద‌ర‌ఖాస్తుల‌ను దాఖ‌లు చేసుకునేందుకు ఈ నెల 14 వ‌ర‌కే గ‌డువు ఉంద‌ని ప్రచారం జ‌రుగుతోంది. అయితే ఇప్పటి వ‌ర‌కు ఎటువంటి గ‌డువు నిబంధ‌న ఇవ్వలేద‌ని స‌చివాలయ ఉద్యోగులు తెలిపారు. కేవ‌లం ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు మాత్రమే ఆదేశాలు వ‌చ్చాయ‌ని అన్నారు.

yearly horoscope entry point

అలాగే ఎన్ని ఇళ్లు మంజూరు చేస్తార‌నే దానిపై కూడా ఇంకా మార్గద‌ర్శకాలు విడుద‌ల కాలేద‌ని, ఎన్ని ద‌ర‌ఖాస్తులు దాఖ‌లు అయితే అన్నింటికి మంజూరు చేసే అవ‌కాశం ఉంద‌ని స‌చివాల‌య ఉద్యోగులు తెలిపారు. ఒక వేళ త‌రువాత మార్గద‌ర్శకాలు విడుద‌ల అయితే, ఆ మార్గద‌ర్శకాలు ప్రకారం ఇళ్లు మంజూరు అవుతాయ‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతానికి అటువంటి మార్గ‌ద‌ర్శ‌కాలు ఏమీ విడుద‌ల కాలేద‌ని హిందుస్తాన్ టైమ్స్ తెలుగుకి తెలిపారు.

ఎవ‌రు అర్హులు

1. స్థలం ఉండి సొంత ఇల్లు లేనివారు మాత్రం అర్హులు.

2. క‌నీసం 48 గ‌జాలు (ఒక సెంటు) భూమి ఉండాలి.

3. ఇప్పటి వ‌ర‌కు రేష‌న్ కార్డుపై ఎటువంటి ఇల్లు మంజూరు కాకుండా ఉండాలి

ఎంత స‌హాయం వ‌స్తుంది?

1. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకుందాం అనుకునే వాళ్లకి ప్రభుత్వ ఆర్థిక స‌హాయం చేస్తుంది.

2. పీఎంఏవై-యూ కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కం అయిన‌ప్ప‌టికీ, దీంట్లో రాష్ట్ర ప్ర‌భుత్వం వాటా కూడా ఉంటుంది.

3. ల‌బ్ధిదారునికి రూ.2.50 ల‌క్షల ఆర్థిక స‌హాయం వ‌స్తుంది.

4. అందులో కేంద్ర ప్రభుత్వం వాటా రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.1 లక్ష ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు ఎలా చేయాలి?

1. భూమి ఉండి ప‌క్కా ఇల్లు నిర్మించుకోవాల‌నుకుంటే సంబంధిత స‌చివాల‌యాన్ని సంద‌ర్శించాలి.

2. స‌చివాల‌యంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌ను క‌లిసి ద‌ర‌ఖాస్తు తీసుకోవాలి.

3. ద‌ర‌ఖాస్తులో ఖాళీల‌ను పూర్తి చేయాలి.

4. ఆ త‌రువాత ద‌ర‌ఖాస్తుకు అవ‌స‌ర‌మైన ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు జ‌త చేయాలి.

5. ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు జ‌త చేసిన ద‌ర‌ఖాస్తును స‌చివాల‌యంలోనే ఇంజినీరింగ్ అసిస్టెంట్‌కు స‌మ‌ర్పించాలి.

ద‌ర‌ఖాస్తుకు జ‌త చేయాల్సిన ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు

1. కుటుంబ స‌భ్యుల అంద‌రి ఆధార్ కార్డ్స్ జెరాక్స్ కాపీలు, మొబైల్ నెంబ‌ర్‌

2. రేష‌న్ కార్డు

3. బ్యాంకు అకౌంట్, పాస్‌బుక్ జెరాక్స్‌

4. భార్యా, భ‌ర్త‌లు క‌లిసి తీసుకునే ఫోటో

5. పాన్‌కార్డ్ జెరాక్స్ కాపీ

6. ల్యాండ్ డాక్యుమెంట్ (ప‌ట్టా, ద‌స్తావేజు, పోసిష‌న్ స‌ర్టిఫికేట్‌)

7. కులం అండ్ ఉప కులం (కుల ధ్రువీక‌ర‌ణ స‌ర్టిఫికేట్‌)

8. వృత్తి (భార్య, భ‌ర్త)

9. చ‌దువు (భార్య, భ‌ర్త)

10. ఆదాయం (ఆదాయ ధ్రువీక‌ర‌ణ స‌ర్టిఫికేట్)

11. ఈడ‌బ్ల్యుఎస్ స‌ర్టిఫికేట్ (ఈడ‌బ్ల్యుఎస్ వ‌ర్గానికి మాత్ర‌మే)

12. ప్రస్తుతం నివ‌సిస్తున్న చిరునామా, గృహం నిర్మించుకోనే స్థ‌లం చిరుమానా

13. ల‌బ్ధిదారుని సంత‌కం (ఆధార్ కార్డుల వెనుక‌)

రిపోర్టర్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం