తేనె సంపూర్ణ ఆహారమే కాకుండా సర్వరోగ నివారిణిగా కూడా పనిచేస్తుంది. తేనెను అమృతంగా కూడా పరిగణించవచ్చు. ఎన్ని సంవత్సరాలు పాటు నిల్వ చేసినా దాని రంగు, రుచిలో ఎలాంటి మార్పు ఉండదు.
By Bolleddu Sarath Chandra Dec 11, 2024
Hindustan Times Telugu
జీవ పరిణామ క్రమంలో మొదట బాక్టీరియా, తర్వాత వృక్షజాతి ఆ తర్వాత బాక్టీరియా ఉద్భవం జరిగింది. ప్రకృతిలో తేనెటీగ అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రతీకగా భావించవచ్చు.
పరపరాగ సంపర్కం ద్వారా తేనెటీగలు మనుషులకు, పశుపక్ష్యాదులకు అవసరమైన ఆహారం సమకూరుస్తాయి.
భూగోళంపై తేనెటీగలు అదృశ్యమైన నాలుగేళ్లలో మానవాళి అంతరించిపోతుందని ఐన్ స్టీన్ వ్యాఖ్యానించారు. మానవ జీవితంలో తేనెటీగలకు అంతటి ప్రాముఖ్యత ఉంది.
తేనె అద్భుతమైన ఆహారమే కాకుండా అద్భుతమైన ఔషధంగా కూడా పనిచేస్తుంది. వ్యాధుల నివారణలో తేనె నయం చేయలేని వ్యాధులు లేవనడంలో అతిశయోక్తి లేదు.
తేనెలో అధికశాతం 82.4శాతం కార్బో హైడ్రెట్స్ ఉంటాయి. 100గ్రాములో తేనెలో 38.5గ్రాముల ఫ్రక్టోజ్, 31 గ్రాముల గ్లూకోజ్, 7.2గ్రాముల మాల్టోజ్, గ్రాము సుక్రోజ్ ఉంటాయి.
తేనెలో ప్రోటీన్లు, యమినో యాసిడ్స్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్య సంరక్షణలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. తేనె బొట్టులో శరీరానికి అవసరమైన 200 బయో న్యూట్రియంట్స్ ఉంటాయి.
ప్రాసెస్ చేయని ఆర్గానిక్ తేనెలో ఫైటో న్యూట్రియంట్స్ శరీరంలో రోగకారక బాక్టీరియాను అంతం చేసే యాంటీ బాడీస్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
తేనెను రోజువారీ ఆహారంలో తీసుకోవడం ద్వారా శరీరంలో రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి మనల్ని రోగాల బారి నుంచి కాపాడుతుంది.
తేనెలో దాల్చిన చెక్క పొడిని కలిపి వాడితే అది బాక్టీరియల్ వ్యాధుల నుంచి, వైరస్ వ్యాధుల నుంచి కాపాడుతుంది. తేనెతో పాటు యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలిపి వాడితే రోగ నిరోధక శక్తి ఏర్పడి ల్యూకోసైట్స్ రక్త కణాల్ని పెంచి రోగనిరోధక శక్తి పెంచడానికి ఉపయోగపడుతుంది.
తేనెను పెరుగుతో కలిపి తీసుకుంటే అది ప్రేగులలో రోగనిరోధక శక్తిని పెంచే బాక్టీరియాను పెంచి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహకరిస్తుంది.