Pushpa 2 Peelings Song: పుష్ప 2లో పీలింగ్ సాంగ్ కాపీనా? సాక్ష్యాలతో సహా బయటపెట్టిన ఆర్జే అపూర్వ-allu arjun and rashmika mandanna pushpa 2 song peelings copied by shraddha stree track ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Peelings Song: పుష్ప 2లో పీలింగ్ సాంగ్ కాపీనా? సాక్ష్యాలతో సహా బయటపెట్టిన ఆర్జే అపూర్వ

Pushpa 2 Peelings Song: పుష్ప 2లో పీలింగ్ సాంగ్ కాపీనా? సాక్ష్యాలతో సహా బయటపెట్టిన ఆర్జే అపూర్వ

Galeti Rajendra HT Telugu
Dec 11, 2024 07:44 PM IST

Pushpa 2 Peelings Song: పుష్ప 2పై మరో వివాదం మొదలైంది. మూవీలో సూపర్ హిట్‌గా నిలిచిన పీలింగ్ సాంగ్ కాపీ అని.. ఓ ఆర్జే వీడియో సాక్ష్యంతో బయటపెట్టింది. దాంతో.. సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.

పుష్ప 2లో పీలింగ్ సాంగ్ కాపీనా?
పుష్ప 2లో పీలింగ్ సాంగ్ కాపీనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప2 మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా సుమారు 12,500 స్క్రీన్లలో.. ఆరు భాషల్లో రిలీజైన పుష్ప 2 సినిమాపై పాజిటివ్ టాక్‌తో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. కానీ.. విమర్శలు సినిమా వసూళ్లని ఆపలేకపోతున్నాయి. ఇప్పటికే రూ.1000 కోట్ల వరకూ వరల్డ్‌వైడ్ పుష్ప 2 కలెక్షన్లు రాబట్టింది.

yearly horoscope entry point

పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మంధాన నటించగా.. శ్రీలీల ఐటెం సాంగ్ చేసింది. మూవీలోని పాటలన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. మరీ ముఖ్యంగా.. పీలింగ్స్ పాట యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. రష్మిక అందాల్ని ఆరబోస్తూ.. అల్లు అర్జున్‌తో కలిసి వేసిన మాస్ స్టెప్స్‌ థియేటర్లలో విజిల్స్ వేయిస్తున్నాయి. అయితే.. ఈ పాట.. శ్రద్ధా కపూర్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘స్త్రీ’లోని సాంగ్‌కి కాపీ అని ఆర్జే అపూర్వ వెలుగులోకి తెచ్చింది. 2018లో రిలీజైన స్రీ మూవీకి.. ఇటీవల సీక్వెల్‌గా ‘స్త్రీ 2’ కూడా వచ్చి బ్లాక్ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది.

కానీ.. ఆర్జే అపూర్వ కాపీ ఆరోపణలపై అల్లు అర్జున్ అభిమానులు ఘాటుగా స్పందిస్తున్నారు. టాలీవుడ్ సినిమాల్నే ఇప్పుడు బాలీవుడ్‌లో కాపీ చేస్తున్నారు.. సాంగ్స్ చేస్తే తప్పేంటి? అని ప్రశ్నిస్తున్నారు. అయినా.. సాంగ్ ప్లో ఒకటే తప్ప.. లిరిక్స్ కాదు కదా? అని వాదిస్తున్నారు. మరోవైపు పుష్ప 2 విమర్శకులు.. సినిమానే కేజీఎఫ్‌ నుంచి కాపీ కొట్టారంటూ ఎద్దేవా చేస్తున్నారు. దాంతో పుష్ప 2 గురించి మళ్లీ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

పీలింగ్స్ సాంగ్‌కి చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సాంగ్‌కి శేఖర్ మాస్టర్ స్టెప్‌‌లను కంపోజ్ చేశారు. ఈ పాటపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. రష్మిక మంధాన మితిమీరి అందాల్ని ఆరబోసిందని.. కొన్ని స్టెప్‌లపై నెటిజన్లు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశాయి. తాజాగా కాపీ అపవాదుతో ఈ సాంగ్‌పై మళ్లీ చర్చ మొదలైంది.

Whats_app_banner